అన్వేషించండి

దేశంలో 66 శాతం పాఠశాలల్లో 'నో' ఇంటర్నెట్, అధ్వాన్న స్థితిలో బీహార్, మిజోరం రాష్ట్రాలు - తెలంగాణలో పరిస్థితి ఇలా!

మరోవైపు ఢిల్లీ, లక్ష్వదీప్‌లలోని పాఠశాలలు 100% కంప్యూటర్ సౌకర్యాలతో పని చేస్తున్నాయని, వీటిలో 97.4% పాఠశాలలు ఇంటర్నెట్ యాక్సెస్‌తో ఉన్నాయని నివేదిక వెల్లడించింది.

భారతదేశంలో దాదాపు 66% పాఠశాలలకు ఇంటర్నెట్ సదుపాయం లేదు. బీహార్, మిజోరాం రాష్ట్రాలు ఈ కోవలో మొదటి రెండు స్థానాల్లో నిలుస్తున్నాయి. బీహార్‌లో 92%, మిజోరంలో 90% పాఠశాలల్లోని విద్యార్థులు ఇంటర్నెట్ మాటే ఎరుగరు. ఇక ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ మరియు కాశ్మీర్, మధ్యప్రదేశ్, మణిపూర్, పశ్చిమ బెంగాల్, మేఘాలయ, ఒడిశా, తెలంగాణ, త్రిపుర రాష్ట్రాల్లో 80-85% పాఠశాలలకు ఇంటర్నెట్ సదుపాయం లేదు. యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ (UDISE+) నివేదిక 2021–22 ద్వారా ఈ విషయం వెల్లడైంది. ఈ నివేదిక పాఠశాల విద్యకు సంబంధించిన డేటాను క్రోడీకరించడానికి విద్యా మంత్రిత్వ శాఖ తోడ్పాటునిచ్చింది.

ఢిల్లీ దూకుడు - గుజరాత్‌కు సాటిలేదు..
ఇదిలా ఉండగా.. మరోవైపు ఢిల్లీ, లక్ష్వదీప్‌లలోని పాఠశాలలు 100% కంప్యూటర్ సౌకర్యాలతో పని చేస్తున్నాయని, వీటిలో 97.4% పాఠశాలలు ఇంటర్నెట్ యాక్సెస్‌తో ఉన్నాయని నివేదిక వెల్లడించింది. 100% పాఠశాలలు ఇంటర్నెట్ కనెక్షన్‌ను కలిగి ఉన్న ఏకైక కేంద్ర పాలిత ప్రాంతం (UT) ఢిల్లీ. ఆ తర్వాతి స్థానాల్లో చండీగఢ్ (98.7%), పుదుచ్చేరి (98.4%) కేంద్రపాలిత ప్రాంతాలు నిలిచాయి. ఇక రాష్ట్రాల విషయానికొస్తే 94.6 శాతంతో కేరళ, 92 శాతంతో గుజరాత్ ఇంటర్నెట్ సదుపాయాలు అత్యుత్తమ పనితీరు గల రాష్ట్రాలుగా నిలిచాయి. దేశంలో ప్రైవేట్ పాఠశాలల కంటే ఎక్కువ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నెట్ సదుపాయం ఉన్న ఏకైక రాష్ట్రంగా గుజరాత్ నిలిచింది. గుజరాత్‌లో 94.2 శాతం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నెట్ సదుపాయాలు ఉండగా, ప్రైవేట్ స్కూళ్లలో 89.6 శాతం సౌకర్యాలు మాత్రమే ఉన్నాయి.

సర్వే ప్రకారం గుజరాత్‌లో మినహాయించి మొత్తంగా.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల మధ్య అంతరం కొనసాగుతోంది. సర్వేలో 59.6% ప్రైవేట్, అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో ఇంటర్నెట్ సదుపాయాలు ఉండగా.. ప్రభుత్వ-ఎయిడెడ్ పాఠశాలల్లో 53.1 శాతం ఇంటర్నెట్ సదుపాయాలు ఉన్నాయి. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం 24.2% మాత్రమే సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.

స్మార్ట్‌లో బెంగాల్ అదరహో..
సర్వే చేయబడిన పాఠశాలల్లో 50% కంటే తక్కువ పాఠశాలల్లో కంప్యూటర్‌లు పనిచేస్తున్నాయి. ఆన్‌లైన్ తరగతుల కోసం కేవలం 20% మాత్రమే మొబైల్ ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయని నివేదిక స్పష్టం చేసింది. ఇక స్మార్ట్ తరగతుల లభ్యత కూడా చాలా తక్కువగానే ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. దేశంలోని 1.4 మిలియన్ల పాఠశాలల్లో 2,22,155 మాత్రమే డిజిటల్ లేదా స్మార్ట్ బోర్డులతో స్మార్ట్ తరగతులు అందుబాటులో ఉన్నాయి. పశ్చిమ బెంగాల్‌లో 99.99 % పాఠశాలల్లో స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు ఉండటం విశేషం. పంజాబ్, హర్యానా, గుజరాత్, కేరళ రాష్ట్రాల్లో 90 శాతానికి పైగా స్మార్ట్ తరగతులు ఉన్నాయి. మరోవైపు, తమిళనాడులో ఒక్కటంటే ఒక్క స్మార్ట్ క్లాస్ రూమ్ లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక మిజోరంలో ఉన్న 3911 పాఠశాలల్లో, కేవలం 25 పాఠశాలలు మాత్రమే స్మార్ట్ క్లాస్‌రూమ్‌లను కలిగి ఉన్నాయి.

గత నివేదికల కంటే మెరుగ్గానే..

అయితే, గత నివేదికలతో పోల్చితే.. మొత్తంగా పెరుగుదల మాత్రం కనిపిస్తోంది. గత నాలుగేళ్లలో భారతదేశంలోని మొత్తం పాఠశాలల సంఖ్య 2018-19లో 15,51,000 నుండి 2021–22లో 1,48,9,115కి తగ్గినప్పటికీ, ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న పాఠశాలల సంఖ్య 2018–19లో 2,90,447 (18.3) నుంచి 2021–22లో 5,04,989(33.9%)కి చేరింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Embed widget