అన్వేషించండి

JNTUH: ఇంజినీరింగ్‌ విద్యార్థులకు 'గ్రేస్‌' మార్కులు, ఉత్తర్వులు జారీచేసిన జేఎన్‌టీయూ

JNTU: జేఎన్‌టీయూ పరిధిలో 2022-23 విద్యాసంవత్సరంలో ఇంజినీరింగ్‌ విద్యార్థులకు గ్రేస్‌ మార్కులు కలుపుతూ జేఎన్‌టీయూ యూనివర్సిటీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డిసెంబరు 18 ఉత్తర్వులు జారీ చేసింది.

JNTUH Grace Marks: జేఎన్‌టీయూ పరిధిలో 2022-23 విద్యాసంవత్సరంలో ఇంజినీరింగ్‌ విద్యార్థులకు గ్రేస్‌ మార్కులు కలుపుతూ జేఎన్‌టీయూ యూనివర్సిటీ (JNTU) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు యూనివర్సిటీ అధికారులు డిసెంబరు 18 ఉత్తర్వులు జారీ చేశారు. ఇంజినీరింగ్ చివరి సెమిస్టర్‌ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు 30 మార్కులు, డిప్లొమా పూర్తిచేసిన ఇంజినీరింగ్‌ విద్యార్థులకు 23 మార్కులు కలుపుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని అధికారులు తెలిపారు. 

కరోనా సమయంలో విద్యార్థులకు గ్రేస్‌ మార్కులు కలిపామని, ఈసారి విద్యార్థులు కోరడంతో ఇంజినీరింగ్‌లోని అన్ని విభాగాల డీన్‌‌లతో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. దీంతో సుమారు 4వేల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని జేఎన్‌టీయూ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ మంజూర్‌ హుస్సేన్‌ అన్నారు. యూనివర్సిటీ అధికారుల నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేసిన విద్యార్థులు ప్రిన్సిపల్‌ డాక్టర్‌ విజయకుమార్‌ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

ఇంజినీరింగ్ కాలేజీల ఎదురీత..
ఇదిలా ఉండగా..  రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ కళాశాలలు ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. గడచిన పదేళ్ల కాలంలో కళాశాలల సంఖ్య తగ్గుతూ వస్తోంది. 2015 నాటికి రాష్ట్రంలో 234 ఇంజినీరింగ్‌ కాలేజీలుంటే, ప్రస్తుతం వాటి సంఖ్య 159కి తగ్గింది. గ్రామీణ ప్రాంతాలకు చేరువగా ఉండే కాలేజీలే ఎక్కువగా మూతపడుతున్నాయి. ఒకప్పుడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 48 కాలేజీలుంటే, ఇప్పుడు వాటి సంఖ్య 11కు తగ్గింది. ఖమ్మం జిల్లాలో 28 ఉంటే, ఇప్పుడు 8 మాత్రమే ఉన్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 11కుగాను ప్రస్తుతం రెండు మాత్రమే మిగిలాయి. ఇలా ప్రతీ జిల్లాలోనూ ఇదే పరిస్థితి కన్పిస్తోంది. ఆఖరుకు హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోనూ 2015లో 74 కాలేజీలుంటే, 20 కాలేజీలు మాయమై 54 మిగిలాయి. ఇటీవల ఉన్నతాధికారులు ప్రభుత్వానికి అందించిన నివేదికలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. భవిష్యత్‌లో మరికొన్ని కాలేజీలు కనుమరుగయ్యే అవకాశం లేకపోలేదని ఉన్నత విద్యామండలి అధికారులు అంటున్నారు.

ఇప్పటికే రాష్ట్రంలోని 80 శాతం కాలేజీల నాణ్యత పెంచాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) రాష్ట్రానికి సూచించింది. న్యాక్‌ అక్రిడిటేషన్‌ పరిధిలోకి వస్తేనే అనుమతి ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది. ఈ తరహా పోటీని తట్టుకునే ప్రైవేటు కాలేజీలు 20కి మించి లేవు. ఇంజనీరింగ్‌ విద్యలోనూ మార్పులు వస్తున్నాయి. బోధన ప్రణాళికను అంతర్జాతీయ స్థాయిలో రూపొందించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవన్నీ భవిష్యత్‌లో మరికొన్ని కాలేజీలు మూతపడేందుకు కారణాలవుతాయని అంటున్నారు.

మరోవైపు ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు కేంద్ర విద్యాశాఖ ఆహ్వానం పలుకుతోంది. అమెరికా, ఆస్ట్రేలియా, ఇటలీలోని ప్రధాన కాలేజీలు ఇక్కడ బ్రాంచీలు ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. విదేశీ విద్య కోసం వెళ్లే విద్యార్థులను ఆకట్టుకునేందుకు అవి ప్రయత్నిస్తాయని నిపుణులు చెబుతు న్నారు. ఈ పోటీని మన ఇంజనీరింగ్‌ కాలేజీలు తట్టుకునే అవకాశం తక్కువనే వాదన విన్పిస్తోంది. 

ALSO READ:

విజ్ఞాన్‌ యూనివర్సిటీలో ప్రవేశాలు..
గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీ 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం వీశాట్-2024 (Vignan Scholastic Aptitude Test) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరంలలోని విద్యాసంస్థల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. నోటిఫికేషన్‌ను ఉపకులపతి పి.నాగభూషణ్, రిజిస్ట్రార్ పీఎంవీ రావు, డీన్ అడ్మిషన్స్ కేవీ క్రిష్ణకిషోర్, డైరెక్టర్ గౌరీశంకరరావు నవంబరు 22న విడుదల చేశారు. ప్రవేశాలు కోరువారు ఆయా క్యాంపస్‌ల్లో దరఖాస్తులు పొందవచ్చు. విద్యార్థులు యూనివర్సిటీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. భారతీయ విద్యార్థులతో పాటు, విదేశాల్లో ఉంటున్న భారత సంతతి విద్యార్థులు కూడా ప్రవేశాలకు అర్హులు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వీశాట్‌ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. విశాట్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. అదేవిధంగా ప్రతిభావంతులకు స్కాలర్‌షిప్స్ అందిస్తారు. 
ప్రవేశాలకు సంబంధించిన పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Naidu Meets PM Modi: ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu Meets PM Modi: ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Trump TV Ads: అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
Kanpur Fraud Case: ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Embed widget