By: ABP Desam | Updated at : 01 Sep 2021 08:03 AM (IST)
బంగారం, వెండి ధరలు (ప్రతీకాత్మక చిత్రం)
భారత్‌లో బంగారం ధర వరుసగా రెండో రోజు (సెప్టెంబర్ 1న) దిగొచ్చింది. గ్రాముకు అతి స్వల్పంగా రూ.12 చొప్పున తగ్గింది. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, నేడు భారత మార్కెట్‌లో రూ.46,450గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,680 కి దిగొచ్చింది.
భారత మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా.. వెండి ధర సైతం స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్ మార్కెట్‌లోనూ వెండి ధర దిగొచ్చింది. తాజాగా భారత మార్కెట్‌లో రూ.100 మేర దిగిరావడంతో కిలో వెండి ధర రూ.63,500 అయింది. హైదరాబాద్ మార్కెట్‌లో వెండి ధర నిలకడగా ఉంది. నిన్నటి ధర రూ.68,400గా కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ముఖ్య నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి తాజా ధరలివీ..
హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర గ్రాముకు రూ.16 చొప్పున తగ్గింది. దాంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం (99.99) ధర ప్రస్తుతం రూ.48,330 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం (91.6) ధర రూ.44,300కి తగ్గింది. ఇక స్వచ్ఛమైన వెండి ధర రూ.100 మేర తగ్గడంతో హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.68,400 కి దిగొచ్చింది.
Also Read: First Salary: ఫస్ట్ శాలరీ తీసుకుంటున్నారా? మరి ప్లాన్ ఏంటి?
ఇక విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర సెప్టెంబర్ 1న గ్రాముకు రూ.16 మేర తగ్గడంతో రూ.44,300 కాగా.. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.48,330 అయింది. ఇక్కడ కిలో వెండి ధర రూ.68,700గా ఉంది. విశాఖపట్నం పసిడి మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,560 గానే ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,610గా ఉంది. ఇక్కడ కూడా వెండి ధర కిలో హైదరాబాద్ తరహాలోనే రూ.68,400 వద్ద విక్రయాలు ప్రారంభమవుతాయి.
దేశంలోని పలు నగరాల్లో పసిడి ధర ఇలా..
దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు సెప్టెంబర్ 1న ఇలా ఉన్నాయి. ముంబయిలో నేడు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.46,380 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,380కి దిగొచ్చింది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారంపై రూ.240 మేర తగ్గి ధర రూ.44,660 అయింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,720 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
Also Read: Bank Holidays In September: సెప్టెంబర్ నెలలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు... ఏఏ తేదీల్లో అంటే!
నిలకడగా ప్లాటినం ధర
బంగారం తరహాలో మరో విలువైన లోహం ప్లాటినం ధర వరుసగా రెండోరోజు తగ్గింది. ఢిల్లీలో పది గ్రాముల ప్లాటినం ధర రూ.23,530గా ఉంది. హైదరాబాద్‌లో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.23,690కి దిగొచ్చింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్లాటినం ఇదే ధరల వద్ద కొనసాగుతోంది.
Stock Market Closing: సెన్సెక్స్ 60k టచ్ చేసింది.. నిలబడింది! రేపు నిఫ్టీ 18K దాటేందుకు సిద్ధం!
Top Loser Today August 16, 2022 స్టాక్ మార్కెట్ సెన్సెక్స్, నిఫ్టీ టాప్ లాసర్స్ జాబితా
టాప్ గెయినర్స్ August 16, 2022 : స్టాక్ మార్కెట్‌లో సెన్సెక్స్, నిఫ్టీ టాప్ గెయినర్స్
Salary Hike: గుడ్ న్యూస్! 2023లో ఉద్యోగుల వేతనాల్లో బంపర్ పెరుగుదల!
PM Kisan Yojana Update: రైతులకు గుడ్‌న్యూస్! కిసాన్ యోజన 12వ విడత నగదు వచ్చేది అప్పుడే!
కమ్యూనిస్టులపై సంజయ్ సంచలన కామెంట్స్- కేసీఆర్ చిల్లర పెంకులకు ఆశపడ్డారంటూ ఆరోపణ
Venkaiah On Sita Ramam: చాలా కాలం తర్వాత ఓ చక్కని సినిమా చూశా- సీతారామంపై వెంకయ్య రివ్యూ
KTR : ఆసియా లీడర్స్ మీట్‌కు కేటీఆర్ - ఆహ్వానం పంపిన ప్రతిష్టాత్మక సంస్థ !
Anantapur Crime News : బిల్లులు చెల్లించమన్నదుకు విద్యుత్ ఏఈపై చెప్పుతో దాడి - ఉరవకొండలో సర్పంచ్ అరాచకం !