By: ABP Desam | Updated at : 24 Aug 2021 03:54 PM (IST)
మెుదటి జీతాన్ని ప్రణాళిక వేసుకోండి(ఫైల్ ఫొటో)
మెుదటి జీతం రాగానే.. చాలా మంది.. కుటుంబ సభ్యులకు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటారు. కొంతమంది ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకోవాలనుకుంటారు. ఏదైనా వస్తువును తీసుకోవాలని మరికొంతమంది ప్లాన్ వేసుకుంటారు. చిన్నప్పటి నుంచి చదివి.. చదివి.. ఉద్యోగంలో చేరి.. ఫస్ట్ శాలరీ తీసుకుంటే ప్రత్యేకమే కదా. లైఫ్ టైమ్ గుర్తుండేలా చేయాలనుకోవడం సహజమే. కానీ మెుత్తం ఖర్చు చేయకుండా... కొంత భాగం మాత్రమే చేసి.. ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకుంటే బెటర్.
ఖర్చు ఎవరైనా ఇష్టం వచ్చినట్టు చేస్తారు. అది కాదు ముఖ్యం. బడ్జెట్ ప్రకారం చేయడం గ్రేట్. దేనికి ప్రాధాన్యం ఇచ్చి ఖర్చు చేయాలనే ఐడియా వస్తుంది. బడ్జెట్ వేసుకోవడం అనేది.. ఖర్చులను లెక్కించడానికే అనుకుంటే పొరబడినట్టే. ఎంత ఖర్చు చేస్తున్నారు... ఎంత మనీ సేవింగ్ చేస్తున్నారనే.. క్లారిటీ వస్తుంది. మీరు ఎప్పుడైనా వారెన్ బఫెట్ చెప్పిన మాటాలు విన్నారా? ఆయన ప్రపంచంలో అత్యంత విజయవంతమైన పెట్టుబడిదారుల్లో ఒకరు. ఆయన చెప్పేది ఏంటంటే.. ఖర్చు చేశాక పొదుపు చేయడం కాదు.. పొదుపు చేశాక ఖర్చు చేయి అని చెప్తారు.
మనిషి జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. అలర్ట్ గా ఉండటమే మంచిది. ఎమర్జెన్సీ సమయంలో ఇబ్బంది పడకుండా.. కొంత నిధిని ఏర్పాటు చేయాలి. అదే ఎమర్జెన్సీ ఫండ్. మనం డెయిలీ చేసే ఖర్చులకు వీటిలో నుంచి ఉపయోగించొద్దు. మెడికల్ ఎమర్జెన్సీ, జాబ్ పోవడం లాంటి అత్యవసర పరిస్థితులకు మాత్రమే వాడాలి. కనీసం ఆరు నుంచి ఎనిమిది నెలల పాటు కుటుంబ ఖర్చులకు సరిపోయే మెుత్తాన్ని ఎమర్జెన్సీ ఫండ్ ను ఏర్పాటు చేయాలి. దీని కోసం డబ్బును పొదుపు ఖాతాలో కానీ, ఫిక్స్‌డ్ డిపాజిట్లలో గానీ, లిక్విడ్ ఫండ్లలో గానీ ఉంచుకోవచ్చు.
ఉద్యోగంలో చేరాక.. అప్పటికి ఉన్న రుణాలను తీర్చే ప్రయత్నం చేయాలి. ఏదైనా లోన్స్ తీసుకుంటే.. ఫస్ట్ నెల నుంచే ఈఎంఐ రూపంలో చెల్లించుకుంటే ఉత్తమం.
సంపాదించే ప్రతి ఒక్కరికీ జీవిత, ఆరోగ్య బీమా ఉంటే మంచిది. ఆ వ్యక్తిని కుటుంబం కోల్పోతే.. ఆర్థికంగా అండగా ఉంటుంది టర్మ్ పాలసీ. పాలసీ కాలవ్యవధిలో బీమా చేసిన వ్యక్తి మరణిస్తే.. హామీ మొత్తం నామినీకి అందుతుంది. లేకపోతే ఎటువంటి ప్రయోజనాలూ లభించవు. ఆరోగ్య బీమా కూడా ఉపయోగపడుతుంది. కుటుంబం మెుత్తానికి కూడా.. ఆరోగ్య బీమా తీసుకోవచ్చు.
New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్ ఇన్వెస్టర్లకు బెస్ట్ ఆప్షన్!
Gold-Silver Prices Today 20 Dec: మీ నగరంలో చవకగా మారిన గోల్డ్, సిల్వర్ నగలు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
Instant Loan Apps: అర్జంట్గా డబ్బులు కావాలా?, నిమిషాల్లో రుణం ఇచ్చే ఇన్స్టాంట్ లోన్ యాప్స్ ఇవి, కానీ జాగ్రత్త!
Instant Loan: తక్షణం రూ.10,000 లోన్ తీసుకోవచ్చు - ఎవరికి ఇస్తారు, ఎలా అప్లై చేయాలి?
Trending Gold Jewellery: ధర తక్కువ, మన్నిక ఎక్కువ - ఇప్పుడు ఎవరి ఒంటిపై చూసినా ఇవే నగలు!
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!