Visakhapatnam Port: వైజాగ్ పోర్టు సరికొత్త రికార్డు, మాంగనీస్ ఓర్ హ్యాండ్లింగ్‌లో పాత రికార్డులు బద్ధలు కొట్టిన వీపీఏ

Visakhapatnam Port : విశాఖపట్నం: సరుకు హ్యాండ్లింగ్‌లో విశాఖపట్నం పోర్ట్ అథారిటీ (Visakhapatnam Port Authority VPA) మరోసారి రికార్డును సృష్టించింది. వీఎస్ పీఎల్ ఈస్ట్ క్వే-8 బెర్త్ జనవరి 29న ఎంవీ ఎన్బీఏ వివా కార్గో షిప్‌లో 22,746 మెట్రిక్ టన్నుల మాంగనీస్ ముడి సరుకు లోడింగ్ పూర్తి చేసి వీపీఏ కొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ క్రమంలో గత ఏడాది ఆగస్ట్ 4వ తేదీన ఈస్ట్ క్వే-7 వద్ద 22,359 మెట్రిక్ టన్నుల లోడ్ చేసిన తన రికార్డును తానే తిరగరాసింది.
బోత్ర షిప్పింగ్ సర్వీసెస్ ఏజెన్సీ చేపట్టిన మాంగనీస్ హ్యాండ్లింగ్ ద్వారా, తక్కువ సమయంలో అధిక సామర్థ్యంతో కార్గో హ్యాండ్లింగ్ సాధ్యమైం దని విశాఖ పోర్టు చైర్మన్ డా.అంగముత్తు వెల్లడించారు. పోర్టులో ఏప్రిల్ 2024 నుంచి జనవరి 29, 2025 వరకు 98 నౌకల ద్వారా 31,34,058 మెట్రిక్ టన్నుల మాంగనీస్ ఓర్ లోడ్‌ను విజయవంతంగా నిర్వహించినట్లు అంగముత్తు తెలిపారు. గతేడాది ఇదే సమయానికి 25.14 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే లోడ్ చేశామన్నారు. వివిధ రకాల కార్గోలను భారీగా నిర్వహిస్తూ బల్క్ కార్గోల హ్యాండ్లింగ్లో దేశంలోనే ప్రధాన కేంద్రంగా విశాఖపట్నం పోర్ట్ నిలుస్తోందని చైర్మన్ అంగముత్తు అన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

