అన్వేషించండి

Konaseema News: నడిసంద్రంలో ఆగిపోయిన బోట్లు.. 14 మంది మత్స్యకారులను ఎలా రక్షించారంటే..

Konaseema News:న‌డి సముద్రంలో ఆగిపోయిన 2 బోట్లు. దిక్కు తోచని స్థితిలో 14 మంది మత్స్యకారులు. సరైన టైంలో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి వారిని రక్షించిన అధికారులు. సినిమా తరహా రియల్ రెస్క్యూ ఆపరేషన్ ఇది.

Ambedkar Konaseema District News: ఓ పక్క అల్పపీడన ప్రభావంతో అల్లకల్లోలంగా మారిన సముద్రం... బలమైన ఈదురు గాలులకు ఒడ్డుకు సురక్షితంగా చేరుతామో లేదో అన్న సందేహం. ఇంతలోనే రెండు బోట్లులో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో దిక్కుతోచని అగమ్యగోచరంలో ఉన్న 14 మంది మత్స్యకారులను నడిసంద్రంలో ఆగిపోయిన బోట్లను తీరానికి సురక్షితంగా తీసుకువచ్చారు.  అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు, కోస్టల్‌ మెరైన్‌ ఎస్పీ రవివర్మ పర్యవేక్షణలో ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌, ఓడలరేవు కోస్టల్‌ సెక్యూరిటీ పోలీస్‌, అల్లవరం పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది సంయుక్తంగా కలిసి మొత్తం మీద సముద్రంలో చిక్కుపోయిన రెండు బోట్లును మత్స్యకారులను సురక్షితంగా తీరానికి చేర్చారు..

భైరవపాలెంకు 7.6 నాటికన్‌ మైళ్ల దూరంలో... 
ఈనెల 16న కాకినాడ పోర్టు నుంచి సముద్రంలోకి ఏడుగురు మత్స్యకారులు 4996 అను నెంబరు గల బోటు మీద వేటకు వెళ్లారు. వీరిలో గుర్రాల రాము, చొల్లంగి అప్పారావు, చెక్కా శివాజి, దాసరి దుర్గ, గరికన బుజ్జి, గోశాల మణికంఠ, వాంక సత్తిబాబు వీరంతా పోర్టు ఏరియాకు చెందిన వారు కాగా మరో బోటులో దూడ చిన్నా, గరికిన సింహాద్రి, దూడ కూర్మారావు, దూడ కూర్మారావు, దూడ అప్పారావు, తిక్కాడ శ్రీను, దూడ నల్లబ్బాయి, ఉమ్మిడి నూకరాజు వీరంతా కలిసి మరో బోటులో సముద్రంలోకి వేటకు వెళ్లారు. అల్పపీడనం ప్రభావంతో సముద్రంలో వేట సాగించవద్దన్న హెచ్చరికల నేపథ్యంలో తిరిగి వచ్చేందుకు వేర్వేరుగా సిద్ధపడ్డారు. ఇదిలా ఉంటే తిరిగి వచ్చేద్దామనుకున్న ఈ రెండు బోట్లు వేర్వేరుగా 19న మరమ్మత్తులు గురవ్వడంతో అగమ్యగోచర పరిస్థితిలోకి వెళ్లారు. 

పోర్టు సిబ్బందికి ఈ సమాచారం అందించారు. అయితే వారు ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో సాయంత్రం సెల్‌ఫోన్‌ ద్వారా ఓడలరేవు కోస్టల్‌ సెక్యూరిటీ పోలీసులకు సమాచారం అందించారు. విశాఖ పట్నంలోని కోస్టల్‌ మెరైన్‌ ఎస్పీ రవివర్మకు తెలిపారు. 

ఒకటి కాకినాడకు మరొకటి ఓడలరేవుకు సురక్షితంగా...
నడి సముద్రంలో పాడై చిక్కుపోయిన 14 మంది మత్స్యకారులు నడిసంద్రంలో బిక్కుబిక్కుమంటూ గడిపిన పరిస్థితి తలెత్తింది. జీపీఎస్‌ ద్వారా కాట్రేనికోన మండలం కొత్తపాలెం వద్ద భైరవపాలెంకు 7.6 నాటికన్‌ మైళ్ల దూరంలో రెండు బోట్లు ఉన్నట్లు నిర్ధారణ చేసుకున్న తరువాత కాకినాడ నుంచి కోస్టు గార్డు సిబ్బంది ఒక బోటు, ఓడలరేవు నుంచి మరో బోటును పంపించారు. కొమరగిరిపట్నం గ్రామానికి చెందిన కొపనాతి శంకర్‌ను సహాయం కోరిన కోస్టల్‌ సెక్యూరిటీ పోలీసులు ఆయన ద్వారా ఓ బోటును, చిక్కుకున్న మత్స్యకారునలు ఓడలరేవు తీరానికి సురక్షితంగా తీసుకువచ్చారు. కోస్ట్‌గార్డు సిబ్బంది ద్వారా మరో బోటును కాకినాడ పోర్టుకు సురక్షితంగా చేర్చారు. 

30 గంటలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..పాడైన రెండు బోట్లులో 14 మంది మత్స్యకారులు వేర్వేరు ప్రాంతాల్లో నడిసంద్రంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని 30 గంటలు గడిపిన పరిస్థితి తలెత్తింది. కోస్టుగార్డు సిబ్బంది ద్వారా ఓ బోటు కాకినాడ పోర్టు తీరానికి సురక్షితంగా చేరుకోగా మరో బోటు ఓడలరేవు వైపుకు వీరిని తీసుకువచ్చింది. 

రెస్క్యూ చేసిన బోటు ఓడలరేవు నదీసాగర సంగమం వద్దకు చేరుకుంటున్న క్రమంలో అలల ఉద్ధృతికి బోటుకు ఉన్న కొయ్యకర్ర అదుపుతప్పి గుర్రాల రాముమీద పడడంతో గాయాలపాలయ్యాడు. గరికన బుజ్జి అనే వ్యక్తి అలల ధాటికి బోటు నుంచి సముద్రంలో జారి పడిపోయాడు.. సమయస్ఫూర్తితో వ్యవహరించిన బోటు యజమాని కొపనాతి శంకర్‌ ఓ తాడుకు డబ్బా కట్టి సముద్రంలోకి విసరడంతో అదిపట్టుకోగా లాక్కుని వచ్చి తిరిగి బోటులో ఎక్కించుకుని సురక్షితంగా తీరానికి తీసుకువచ్చారు. మెరైన్‌ సీఐ ఎంవీఎస్‌ఎన్‌ మూర్తి, ఎస్సై జి.విలియమ్స్‌ సకాలంలో స్పందించకుండా ఉంటే తామంతా బతికేవాళ్లం కాదని మత్స్యకారులు కృతజ్ఞతలు తెలిపారు.

Also Read: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
Look Back 2024: అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Embed widget