Tirupati Crime News: తిరుపతిలో కంటైనర్ కిందకు దూసుకెళ్లిన కారు, ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం
Andhra Pradesh News | తిరుపతి జిల్లాలో అతివేగంగా దూసుకొచ్చిన కారు కంటైనర్ ను ఢీకొట్టి, దాని కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందడంతో విషాదం నెలకొంది.

Tirupati News Today | తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు జరిగింది. కంటైనర్ కిందకు కారు దూసుకెళ్లిన ఘటనలో ఐదుగురు మృతిచెందారు. పాకాల మండలం తోటపల్లి వద్ద పూతలపట్టు - నాయుడుపేట జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన కారు కంటైనర్ కిందకు దూసుకెళ్లడంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
ప్రమాదం జరిగిన చోటే ఐదుగురు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. స్థానికులు నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలిస్తున్నారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, 9 ఏళ్ల బాబు, ఇద్దరు పురుషులు, ఉన్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారని పోలీసులు గుర్తించారు.























