అన్వేషించండి

CM Chandrababu at VIT: నా నిర్ణయాల ఫలితంగా తెలంగాణ నెంబర్ వన్ అయింది, గర్వంగా ఉందన్న ఏపీ సీఎం చంద్రబాబు

Andhra Pradesh News | గతంలో ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్న సమయంలో హైదరాబాద్ సిటీని డెవలప్ చేశానని, అప్పుడు తీసుకున్న నిర్ణయాల ఫలితంగా తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ 1 అయిందన్నారు.

Chandrababu Visits VIT at Amaravati | అమరావతి: 2047కి తలసరి ఆదాయం 55 లక్షల రూపాయాలు, 2.4 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ తయారవుతుందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అందులో విద్యార్థులు, యువత మీ పాత్ర ఏంటి, మీరు ఏ స్థాయికి వెళ్లాలని అనుకుంటున్నారో.. కలలు కనడంతో పాటు వాటిని నెరవేర్చుకునేందుకు కృషి చేయాలని సూచించారు. అమరావతిలోని విట్‌ వర్సిటీలో అభివృద్ధి పనులను ప్రారంభించారు ఏపీ సీఎం చంద్రబాబు. కొందరు డబ్బుల్లేవని అభివృద్ధి, సంక్షేమాన్ని ఆపేస్తుంటారు. కానీ మనం సంపద సృష్టించి సంక్షేమం, అభివృద్ధిని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. విట్ యూనివర్సిటీలో స్టార్టప్ కంపెనీల కోసం సోమవారం నాడు వీ లాంచ్‌ప్యాడ్ ను చంద్రబాబు ప్రారంభించారు.

సాధారణ కుటుంబాల నుంచి వచ్చి అసాధారణ ఫలితాలు

ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. జాతిపిత గాంధీజీ, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, దివంగత సీఎం ఎన్టీఆర్, నేను సాధారణ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చినా ఉన్నత స్థానాలకు ఎదిగాం. రతన్ టాటా సైతం చిన్నతనంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. విద్యార్థులు తమ సమాజంలో ఉన్నతమైన వారిగా నిలిచేందుకు సంకల్పించుకుని, అందుకు తగ్గట్లుగా కృషి చేయాలని సూచించారు.

కాలేజీ రోజుల్లోనే నా కెరీర్ డిసైడ్ చేసుకున్న

నా జీవితం ఎలా ఉండాలని చదువుకున్న రోజుల్లో ఆలోచించాను. తనకు ఐఏఎస్ సెట్ అవుతుందని అందరూ సూచించారు. నేను సరిగ్గా చదవలేను. చదువు మీద ఇంట్రెస్ట్ ఉన్నా.. గంటల తరబడి చదవడం ఇష్టం ఉండేది కాదు. ఇది నాకు సెట్ కాదని అప్పటి మా వైస్ ఛాన్స్‌లర్‌కు స్పష్టం చేశా. అనుకున్నట్లుగానే 1978లో ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించాను. నేను ప్రభుత్వంలోకి వస్తే.. ఐఏఎస్ అధికారులకు దిశా నిర్దేశం చేయవచ్చు అనుకున్నాను. నా జీవితంలో సరిగ్గా అదే జరిగింది. వ్యాపారం, ఉద్యోగం చేయవచ్చు కానీ బతకడం కోసం రాజకీయాలు ఎవరూ చేయవద్దు అనేది నా సూచన. పారదర్శకత, నీతి నిజాయితీ ఉండాలంటే రాజకీయాలను బతుకుదెరువు చేసుకోకూడదు. అందుకే 1991లో సంస్కరణలు వచ్చాయి. 1992లో హెరిటేజ్ సంస్థ స్థాపించా. నా సతీమణి నారా భువనేశ్వరి ఎంతో శ్రమించి సంస్థను అభివృద్ధి చేశారు. 

తెలంగాణ నెంబర్ 1 అయినందుకు సంతోషంగా ఉంది

ఒకప్పుడు తక్కువ సమయంలోనేే హైదరాబాద్ నగరాన్ని డెవలప్ చేశాను. కానీ ఇప్పుడు ఆ ప్రాంతం తెలంగాణలో ఉంది. ఆనాడు నేను తీసుకున్న నిర్ణయాల ఫలితంగా హైదరాబాద్ ఉన్న కారణంగా దేశంలో తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఓ తెలుగు రాష్ట్రం నెంబర్ వన్ అయినందుకు తెలుగు వాడిగా గర్వపడుతున్నాను. ప్రపంచంలో పలు దేశాల్లో తెలుగు వాళ్లు ఉన్నారు. వారు ఎక్కడున్నా అగ్ర స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు.

మే 2న ప్రధాని నరేంద్ర మోదీ అమరావతికి వస్తున్నారని, ఆయన చేతుల మీదుగా రాజధాని అమరావతి పునఃప్రారంభం కాబోతోందని చంద్రబాబు పేర్కొన్నారు. గతంలో ఐటీ విప్లవం తీసుకొచ్చాం. ఇప్పుడు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్‌ టెక్నాలజీని ప్రమోట్‌ చేస్తున్నానని చెప్పారు. విద్యార్థులు కేవలం ఉద్యోగాల కోసం చూడవద్దు, కొత్త టెక్నాలజీ, సరికొత్త ఆవిష్కరణలు తీసుకురావాలని సూచించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: గుంటూరులో మహిళపై హిజ్రాల దాడి -హోంమంత్రి అనిత సీరియస్
గుంటూరులో మహిళపై హిజ్రాల దాడి -హోంమంత్రి అనిత సీరియస్
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Rains In AP And Telangana: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sonam Wangchuk:సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
US Iran War Updates 2026: ఏడో రోజూ ఇరాన్‌కు కాళరాత్రి! అమెరికా బాంబుల వర్షం! హోర్మూజ్‌ జలసంధిలో హైటెన్షన్!
ఏడో రోజూ ఇరాన్‌కు కాళరాత్రి! అమెరికా బాంబుల వర్షం! హోర్మూజ్‌ జలసంధిలో హైటెన్షన్!
The Odyssey Box Office Collection Day 1: ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Prashant Kadiyam: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
కుప్పం vs మంగళగిరి: మా నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది - నారా లోకేష్
కుప్పం vs మంగళగిరి: మా నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది - నారా లోకేష్
What Is Stair Test For Heart Blockage: మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసమా? సాధారణ అలసట అనుకుంటే ప్రమాదమే!
మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసమా? సాధారణ అలసట అనుకుంటే ప్రమాదమే!
YS Jagan Digital Politics: డిజిటల్ లూప్‌లో వైఎస్సార్‌సీపీ - ఫీల్డ్ వదిలి యాప్స్‌ను నమ్ముకుంటే రాజకీయాల్లో రాత మారుతుందా?
డిజిటల్ లూప్‌లో వైఎస్సార్‌సీపీ - ఫీల్డ్ వదిలి యాప్స్‌ను నమ్ముకుంటే రాజకీయాల్లో రాత మారుతుందా?
సోనమ్‌ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం - ఆరోగ్యం క్షీణించంతో ఆసుపత్రికి తరలింపు 
సోనమ్‌ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం - ఆరోగ్యం క్షీణించంతో ఆసుపత్రికి తరలింపు 
Embed widget