Free Bus Scheme: రాష్ట్రంలో మహిళలకు గుడ్ న్యూస్ - ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి కీలక ప్రకటన
Andhrapradesh News: రాష్ట్రంలో నెలలోగా మహిళలకు ఆర్టీసీ ద్వారా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆదివారం సచివాలయం నాలుగో బ్లాక్ ఛాంబర్‌లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
Minister Ramprasadreddy Key Update On Free Bus Scheme: రాష్ట్రంలో మహిళలకు గుడ్ న్యూస్. నెలలోగా మహిళలకు ఆర్టీసీ ద్వారా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం (Free Bus Scheme) కల్పిస్తామని మంత్రి రామ్‌ప్రసాద్ రెడ్డి (Ramprasad Reddy) తెలిపారు. సచివాలయం నాలుగో బ్లాక్‌లోని ఛాంబర్‌లో ఆయన రవాణా, క్రీడల శాఖల మంత్రిగా ఆదివారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆర్టీసీ సిబ్బందికి మెరుగైన శిక్షణ ఇచ్చే ట్రైనింగ్ సెంటర్ల ఏర్పాటుపై ఆయన తొలి సంతకం చేశారు. అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడారు. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలవుతోన్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అమలు తీరుపై సమీక్షిస్తామని.. ఎదురయ్యే సవాళ్లపై చర్చిస్తున్నట్లు చెప్పారు. ఆర్టీసీలో ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో క్రీడా వసతులు మెరుగుపరుస్తామని.. ప్రతిభ కనబరిచే క్రీడాకారులను ప్రోత్సహిస్తామని తెలిపారు. తనకు కీలక శాఖలు కేటాయించిన సీఎం చంద్రబాబుకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
Also Read: Trains Cancelled: ప్రయాణికులకు షాకింగ్ న్యూస్ - ఆగస్ట్ 11 వరకూ పలు రైళ్లు రద్దు, ఈ రూట్లలోనే!