By: ABP Desam | Updated at : 15 Jan 2023 06:24 PM (IST)
Edited By: jyothi
ఉట్నూర్ లో ఉచిత దుప్పట్ల పంపిణీ - తండోపతండాలుగా తరలివచ్చిన జనం
Adilabad News: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో సంక్రాంతి పండుగ సందర్భంగా జడ్పీ ఛైర్మన్ రాథోడ్ జనార్ధన్ దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అయితే స్థానికంగా ఉన్న 2 వేల మంది నిరుపేద ప్రజలకు దుప్పట్లను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరీ బాయి, మాజీ ఎంపీ గోడం నగేష్ లు హాజరయ్యారు. ముందుగా ఉట్నూరు పట్టణంలో డప్పు వాయిద్యాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తాలో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ర్యాలీగా ఫంక్షన్ హాలుకు చేరుకొని దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక ఉట్నూరు పట్టణ వాసులతో పాటు ఉట్నూర్ మండలంలోని మారుమూల గ్రామాలకు చెందిన నిరుపేదలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఎమ్మెల్యే జోగు రామన్న, కుమ్ర ఈశ్వరీబాయి చేతుల మీదుగా ఉచితంగా దుప్పట్లు పంపిణీ చేశారు.
ఈ క్రమంలోనే అనంతరం ఒక్కసారిగా పెద్ద ఎత్తున జనాలు ఫంక్షన్ హాల్లోకి దూసుకొని వచ్చారు. దుప్పట్ల కోసం ఎగబడ్డారు. తండోపతండాలుగా వస్తున్న జనాలకు సర్దిచెప్తూనే దుప్పట్లు అందిస్తూ పంపించారు. దీంతో కాసేపు అక్కడ గందరగోళ వాతావరణం ఎర్పడింది. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ.. జడ్పీ ఛైర్మన్ రాథోడ్ జనార్ధన్ తెలంగాణ ఉద్యమంలో జేఎసి కన్వీనర్ గా ఉండి.. స్వరాష్ట్ర సాధన కోసం పోరాటం చేశారని తెలిపారు. అప్పటి నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు సాయంగా నిలుస్తున్నారని చెప్పారు. ఏటా వేసవిలో అంబలి పంపిణీ కార్యక్రమం చేపడుతున్నారని వివరించారు. జడ్పీ ఛైర్మన్ కాకముందు గత జడ్పీటీసీ ఎన్నికల్లో బరిలోకి దిగి నార్నూర్ జడ్పీటీసీగా గెలిచి ముఖ్యమంత్రి కేసిఆర్ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ల సహకారంతో నేడు జడ్పీ ఛైర్మెన్ గా ఎదిగారని గుర్తు చేశారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఆయన ప్రజల కోసం అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు.
ఇక ఈ ప్రాంతంలోకి కొత్త బిచ్చగాళ్ళు వాచ్చరంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త బిచ్చగాళ్లు పొద్దెరగరన్నట్లుగా.. కొంతమంది ఎన్నికలు రాకముందే ప్రచారం మొదలు పెట్టారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో మాజీ ఎంపీగా, మాజీ ఎమ్మెల్యేగా, మాజీ జడ్పీ చైర్మెన్ గా పనిచేసి ప్రజలకు ఏం చేయలేదని, అలాంటి వాళ్లు సీఎం కేసిఆర్ ను హేలన చేస్తూ మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే జోగు రామన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారికి ప్రజలే బుద్ది చెబుతారని అన్నారు. జడ్పీ ఛైర్మన్ రాథోడ్ జనార్థన్ మాట్లాడుతూ.. మనం ఈ భూమిపై ఎందుకు వచ్చాం, జీవితంలో అందరితో కలిసి బతకాలి నలుగురికి సేవను అందించాలి అని, ఓ పాట పాడుతూ చెప్పారు. మనం చేసే పనిలో కృషి ఉండాలి, ఆ కృషిలో ఎంతో ఫలితం ఉంటుందని వివరించారు. అలాగే భక్తి కార్యక్రమాలతో పాటు ప్రజలకు నిరుపేదలకు సేవ చేయడమే తమ పని అని, ఈ సేవను ఎల్లప్పుడూ కొనసాగిస్తూనే ఉంటానని వెల్లడించారు.
Rajagopal Reddy: ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్దంగా ఉండాలి - కార్యకర్తలతో మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
ఇది జాతీయ బడ్జెట్టా ! కొన్ని రాష్ట్రాల బడ్జెట్టా, వాళ్లకు టైమ్ దగ్గర పడింది: ఎమ్మెల్సీ కవిత
Nizamabad: నందిపేట్ సర్పంచ్ ఆత్మహత్యాయత్నంతో రచ్చ కెక్కుతున్న నిధుల పంచాయితీ !
Nizamabad News: దక్షిణ మధ్య రైల్వేలో నిజామాబాద్ జంక్షన్ కీలకం - కేంద్ర బడ్జెట్ లో ఈసారైనా న్యాయం జరిగేనా!
Telangana CS Shanti Kumari: కంటి వెలుగు, పోడు పట్టాలు, టీచర్ల బదిలీలపై సీఎస్ శాంతి కుమారి సమీక్ష
YSRCP Tensions : వైఎస్ఆర్సీపీలో ఈ అలజడి ఎందుకు ? ఇంటలిజెన్స్ అత్యుత్సాహమే కొంప ముంచుతోందా ?
Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?
KCR Political strategy : గవర్నర్తో రాజీ - బడ్జెట్ పై సైలెన్స్ ! బీజేపీపై కేసీఆర్ దూకుడు తగ్గిందా ?
K Viswanath : హిందీలోనూ విశ్వనాథ్ హిట్టే, ఆయన 'స్వయంకృషి' - ఓ తీరని కోరిక