CM KCR: బొగ్గు గనుల వేలం ఆపండి.. ప్రధానికి లేఖ రాసిన సీఎం కేసీఆర్
సింగరేణి కార్మికులు ఇచ్చిన సమ్మె నోటీసుపై సీఎం కేసీఆర్ రియాక్ట్ అయ్యారు. సింగరేణి బొగ్గు గనుల వేలం ప్రక్రియ నిలిపివేయాలని ప్రధానికి లేఖ రాశారు.
సింగరేణిలో చేపట్టబోయే నాలుగు గనుల వేలం ప్రక్రియను నిలిపివేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్రమోదీని కోరారు. ఈమేరకు పూర్తి వివరాలతో లేఖ రాశారు. కోల్స్ బ్లాక్స్ వేలాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే సింగరేణి కార్మికులు నోటీసులు ఇచ్చారు. వేలం ప్రక్రియ వెనక్కి తీసుకోకపోతే సమ్మె తప్పదని హెచ్చరించాయి. గురువారం నుంచి మూడు రోజుల పాటు సమ్మెకు సిద్ధమయ్యాయి. ఈ నేేపథ్యంలోనే ప్రధానికి సీఎం కేసీఆర్ లేఖ రాశారు.
ప్రతి సంవత్సరం 65 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులోని థర్మల్ పవర్ స్టేషన్ల బొగ్గు అవసరాలను తీర్చడంలో సింగరేణి కీలక భూమిక పోషిస్తోందని సీఎం లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో గరిష్ట విద్యుత్ డిమాండ్ జూన్ 2014లో 5,661 మెగావాట్లు ఉండగా, 2021 మార్చి నాటికి 13,688 మెగావాట్లకు పెరిగిందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో విద్యుత్ ఉత్పత్తికి నిరంతరాయంగా బొగ్గు సరఫరా చేయడం చాలా కీలకమని సీఎం కేసీఆర్ తెలిపారు.
సింగరేణి బొగ్గు అవసరాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం అనేక మైనింగ్ లీజులు మంజూరు చేసిందన్న ముఖ్యమంత్రి.. అందుకు కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ కూడా ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు. కేంగ్ర బొగ్గు మంత్రిత్వశాఖ ట్రాంచ్ 13 కింద వేలం వేసేందుకు ప్రతిపాదించిన జీబీఆర్‌ఓసీ-3, శ్రావన్‌పల్లి ఓసీ, కోయగూడెం ఓసీ-3, కేకే-6 యూజీ బ్లాక్‌ల వేలం వల్ల సింగరేణి పరిధిలోని బొగ్గు అవసరాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో 4 కోల్ బ్లాక్స్ వేలాన్ని నిలిపివేసేలా కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖను ఆదేశించాల్సిందిగా సీఎం కేసీఆర్.. ప్రధాన మంత్రిని కోరారు. ఈ బ్లాక్‌లను సింగరేణికే కేటాయించేలా చూడాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.
Also Read: పెరిగిన బంగారం ధర.. రూ.600 ఎగబాకిన వెండి.. మీ ప్రాంతంలో ఇవాల్టి ధరలు ఇవీ..
Also Read: ఆర్ఆర్ఆర్.. అంతసేపా.. ఇద్దరు హీరోలంటే ఆ మాత్రం ఉంటది!
Also Read: కనక వర్షం ! ఏడాదిలో లక్షను కోటి చేసిన మల్టీబ్యాగర్ స్టాక్ ఇది.!
Also Read: IPOs This Week: డబ్బుల వర్షమే..! ఈ వారం ఐపీవోకు 4 కంపెనీలు ..! వివరాలు ఇవే
Also Read: EPF Interest Credit: ఈపీఎఫ్‌వో 8.5% వడ్డీ చెల్లించింది.. మీకు ఎంతొచ్చిందో ఇలా చెక్ చేసుకోండి!
Also Read: Airtel vs Jio vs VI Plans: జియో, ఎయిర్‌టెల్, విలో ఏ ప్లాన్‌కు ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయంటే!
Also Read: 2000 Note : రూ. 2 వేల నోటు త్వరలోనే కనుమరుగు ! ఎవరికీ తెలియకుండానే కేంద్రం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి