EPF Interest Credit: ఈపీఎఫ్‌వో 8.5% వడ్డీ చెల్లించింది.. మీకు ఎంతొచ్చిందో ఇలా చెక్ చేసుకోండి!
ఈపీఎఫ్‌వో 2020-21 ఆర్థిక ఏడాదికి సంబంధించిన 8.5 శాతం వడ్డీని చందాదారుల ఖాతాల్లో జమ చేసింది. 22.55 కోట్ల ఖాతాల్లో డబ్బులను జమ చేశామని సంస్థ వెల్లడించింది.
ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (EPFO) 2020-21 ఆర్థిక ఏడాదికి సంబంధించిన 8.5 శాతం వడ్డీని చందాదారుల ఖాతాల్లో జమ చేసింది. 22.55 కోట్ల ఖాతాల్లో డబ్బులను జమ చేశామని సంస్థ వెల్లడించింది. '2020-21 ఏడాదికి గాను 8.5 శాతం వడ్డీని 22.55 కోట్ల మంది ఖాతాల్లో జమ చేశాం' అని ఈపీఎఫ్‌వో ట్వీట్ చేసింది.
గతంలో ఉద్యోగులకు ఈపీఎఫ్‌వో శుభవార్త చెప్పిన సంగతి తెలిసిందే. వడ్డీరేటుకు సంబంధించి 2021, అక్టోబర్ 30న ఉత్తర్వులు జారీ చేసింది. 'ఉద్యోగ భవిష్య నిధి పథకం నిబంధనల ప్రకారం 2020-21 ఏడాదికి 8.50 శాతం వడ్డీ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం, కార్మిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది' అని వెల్లడించింది.
ఇలా తెలుసుకోండి
ఎస్‌ఎంఎస్: మీ ఈపీఎఫ్‌వో ఖాతాలో ఎంత డబ్బుందో తెలుసుకొనేందుకు సులభ మార్గం సందేశం పంపించడం. మీ ఫోన్లో EPFOHO UAN ENG అని 7738299899 నంబర్‌కు ఎస్‌ఎంఎస్ చేయాలి.
మిస్డ్ కాల్: నమోదిత సభ్యులు 011-22901406 నంబర్‌కు మిస్‌డ్ కాల్ ఇవ్వడం ద్వారా ఖాతాలోని మొత్తం తెలుసుకోవచ్చు. ఒకసారి మిస్‌డ్ కాల్ ఇవ్వగానే మీ పీఎఫ్ బ్యాలెన్స్ ఎంతుందో ఒక సందేశం వస్తుంది.
వెబ్‌సైట్: నేరుగా ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్‌కు వెళ్లి ఖాతాలో బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.
ఉమాంగ్ యాప్: కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఉమాంగ్ యాప్ ద్వారా మీ పీఎఫ్ పాస్‌బుక్ చూడొచ్చు. ఓటీపీ ద్వారా ఈ యాప్‌లో లాగిన్ అవ్వొచ్చు. యాప్‌లోకి వెళ్లాక ఈపీఎఫ్‌వోపై క్లిక్ చేస్తే చాలు. ఉద్యోగి సేవలకు తీసుకెళ్తుంది. అక్కడ వ్యూ పాస్‌బుక్‌పై క్లిక్ చేస్తే ఓటీపీ అడుగుతుంది. దానిని ఎంటర్ చేస్తే ఖాతాలోని మొత్తం వివరాలు కనిపిస్తాయి.
22.55 crore accounts have been credited with an interest of 8.50% for the FY 2020-21. @LabourMinistry @esichq @PIB_India @byadavbjp @Rameswar_Teli
— EPFO (@socialepfo) December 6, 2021
Also Read: LIC Policy: రోజుకు 73 పెట్టుబడితో మెచ్యూరిటీకి రూ.10 లక్షలు పొందొచ్చు!
Also Read: Work From Home: WFH చేస్తున్నారా! కేంద్రం కొత్త రూల్స్ తీసుకొస్తోంది తెలుసా?
Also Read: LIC Insurance Premium: ఈపీఎఫ్‌వో నుంచి ఎల్‌ఐసీ ప్రీమియం చెల్లించొచ్చు తెలుసా..! వివరాలు ఇవే!
Also Read: GST Update: ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్‌టీ తగ్గింపు.. ఎవ్వరూ అడగట్లేదన్న కేంద్రం!
Also Read: Gold-Silver Price: నేడు స్థిరంగా బంగారం ధర.. వెండి స్వల్పంగా పెరుగుదల.. మీ ప్రాంతంలో నేటి ధరలివీ..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి