By: ABP Desam | Updated at : 06 Dec 2021 11:32 AM (IST)
Edited By: Ramakrishna Paladi
ఎల్ఐసీ
జీవిత బీమా మార్కెట్లో భారతీయ జీవిత బీమా సంస్థ (LIC)కి తిరుగులేదు. ఇప్పటికే ఎన్నో రకాల పాలసీలను కస్టమర్లకు అందిస్తోంది. ఈ మధ్య కాలంలో కంపెనీ అందిస్తోన్న సరికొత్త 'జీవన్ ఆనంద్' పాలసీతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మరణానంతర ప్రయోజనాలు అందించడమే కాకుండా మెచ్యూరిటీ సమయంలో ఎక్కువ రాబడి పొందేందుకు వీలుంది.
ఎల్‌ఐసీ సరికొత్త జీవన్ ఆనంద్ పాలసీ నాన్ లింక్‌డ్, జీవిత బీమా ప్రణాళిక. స్టాక్ మార్కెట్‌తో సంబంధం లేదు. ఈ పాలసీ తీసుకొనేందుకు
ఎల్ఐసీ జీవన్ ఆనంద్ పాలసీని ఎవరైనా తీసుకోవచ్చు. ఈ పాలసీ కింద కనిష్ఠ బీమా మొత్తం రూ.లక్ష. గరిష్ఠ పరిమితి లేదు. ఎంతైనా చేసుకోవచ్చు. రెండేళ్ల పాటు ప్రీమియం కట్టిన తర్వాత పాలసీని సరెండర్ చేసుకొనే అవకాశం ఉంది. అప్పటి గరిష్ఠ సరెండర్ విలువను బట్టి డబ్బు వస్తుంది. అంతేకాకుండా రుణ సదుపాయం కూడా అందిస్తున్నారు. సరెండర్ విలువ 90 శాతం వరకు రుణం అందిస్తారు.
దురదృష్టవశాత్తు పాలసీదారు మరణిస్తే నామినీకి బీమా మొత్తంపై 125 శాతం డబ్బు లేదా ఏడు రెట్లు వార్షిక ప్రీమియం అందిస్తారు. పాలసీ గడువు ముగిసిన తర్వాత మరణిస్తే నామినీకి బీమా మొత్తం, ఇతర ప్రయోజనాలూ దక్కుతాయి.
మెచ్యూరిటీ సమయంలో పాలసీదారుడికి బీమా మొత్తంతో పాటు రివర్షనరీ బోనసులు, తుది అదనపు బోనస్ లభిస్తుంది. ఉదాహరణకు 24 ఏళ్ల వయసులో 21 ఏళ్ల గడువుతో రూ.5 లక్షల మొత్తానికి జీవన్ ఆనంద్ పాలసీ తీసుకుంటే ఏటా రూ.26,815 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అంటే రోజుకు రూ.73.50 అన్నమాట. మొత్తంగా 21 ఏళ్లకు మీరు రూ.5.63 లక్షలు పెట్టుబడి పెడతారు. మెచ్యూరిటీ సమయంలో బోనస్‌లతో కలిపి రూ.10.33 లక్షలు లభిస్తాయి.
Also Read: India Post Payment Bank: లిమిట్ దాటి డబ్బు జమ చేసినా.. తీసినా.. పోస్టాఫీసులో రుసుము తప్పదు!
Also Read: Stock Market Update: ఈ 100 స్మాల్‌క్యాప్ స్టాక్స్ 10-122% పెరిగాయి తెలుసా!
Also Read: Rapido: ర్యాపిడోకు తెలంగాణ హైకోర్టు షాక్! ఆ ప్రకటన తక్షణమే నిలిపేయాలని ఆదేశం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Gold-Silver Prices Today: జాబ్స్ దెబ్బకు భారీగా తగ్గిన గోల్డ్ రేటు - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
Latest Gold-Silver Prices Today: ఒక్కసారిగా పడిపోయిన పసిడి రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
SGB Scheme: పసిడిలో పెట్టుబడికి గోల్డెన్ ఛాన్స్ - త్వరలోనే మరో 2 విడతల్లో సావరిన్ గోల్డ్ బాండ్స్
SBI Scheme: తక్కువ టైమ్‌లో గ్యారెంటీగా భారీ వడ్డీ వచ్చే ఎస్‌బీఐ స్పెషల్ స్కీమ్
Gold-Silver Prices Today: పెరిగింది కొండంత, తగ్గేది గోరంత - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
Revanth Reddy KCR: కోలుకొని అసెంబ్లీకి రావాలని కేసీఆర్‌ను కోరా, ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన సీఎం రేవంత్
Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!
Telangana News: రాష్ట్రంలోని 54 కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలు రద్దు, ఉత్తర్వులు జారీ
Navy Day: విశాఖలో ఆకట్టుకున్న నేవీ డే విన్యాసాలు - ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్
/body>