By: ABP Desam | Updated at : 05 Dec 2021 11:32 AM (IST)
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్,
సురక్షితమైన పెట్టుబడి సాధనాల కోసం వెతికేవారు మొదట ఎంచుకొనేది ఫిక్స్‌డ్ డిపాజిట్లే! కాస్త ఎక్కువ వడ్డీ ఎవరిస్తున్నారోనని చాలామంది శోధిస్తుంటారు. ఈ మధ్య కాలంలో కొన్ని బ్యాంకులు ఎఫ్‌డీలపై వడ్డీరేట్లను సవరించాయి. గతంలో కన్నా కొద్దిగా ఎక్కువ వడ్డీ ఇస్తున్నాయి.
చాలామంది ప్రైవేటు, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వడ్డీరేట్లను పోల్చి చూసుకొని నిర్ణయాలు తీసుకుంటారు. అలాంటి వారికోసమే హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఎస్‌బీఐ బ్యాంకులు రూ.2 కోట్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లకు ఎంత వడ్డీరేటు ఇస్తున్నారో, కాల పరిమితి వంటి వివరాలను మీ కోసం అందిస్తున్నాం.
నిజానికి రానురానూ వడ్డీరేట్లు తగ్గిపోతున్నాయి. ఒకప్పుడు ఎఫ్‌డీలపై 9%, 8% వడ్డీ ఇచ్చేవి. ఇప్పుడా రేటు 6కు తగ్గిపోయింది. హెచ్‌డీఎఫ్‌సీ గరిష్ఠంగా ఐదేళ్ల నుంచి పదేళ్ల కాలపరిమితికి గరిష్ఠంగా 5.50 శాతం వడ్డీ అందిస్తోంది. సీనియర్ సిటిజన్ అయితే 6.25 శాతంగా ఉంది. ఇక ఎస్‌బీఐ మాత్రం గరిష్ఠంగా 5.40 శాతం వడ్డీరేటు అందిస్తుండటం గమనార్హం. ఐసీఐసీఐ బ్యాంకు కూడా కాస్త ఫర్వాలేదు. ఎక్కువ కాలపరిమితి ఎఫ్‌డీపై 5.50 శాతం వడ్డీరేటు ఇస్తోంది.
బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ వంటి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఎఫ్‌డీ వడ్డీ రేట్లు పెంచుతున్నట్టు కొన్నాళ్ల క్రితమే ప్రకటించాయి. 30 బేసిస్ పాయింట్ల మేరకు వడ్డీని పెంచాయి. దాంతో ప్రైవేటు బ్యాంకులు వడ్డీలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. వచ్చే వారంలో ఆర్‌బీఐ ద్వైమాసిక విధాన సమీక్షకు ముందు వడ్డీరేట్లు పెంచడం గమనార్హం.
Also Read: ATM Transaction Charges: కస్టమర్లకు బ్యాంకుల షాక్..! ఏటీఎం లావాదేవీల ఫీజు పెంపు
Also Read: HDFC FD Interest Rates: ఎఫ్‌డీ చేస్తున్నారా..? హెచ్‌డీఎఫ్‌సీ వడ్డీరేట్లు పెంచింది మరి
Also Read: Audi Q7: ఆడీ కొత్త కారు వచ్చేస్తుంది.. మరింత ఆకర్షణీయంగా!
Also Read: India Post Payment Bank: లిమిట్ దాటి డబ్బు జమ చేసినా.. తీసినా.. పోస్టాఫీసులో రుసుము తప్పదు!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Latest Gold-Silver Price 30 September 2023: పసిడి పతనం కంటిన్యూస్ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
Rs 2000 Notes: రూ.2 వేల నోట్లను మార్చుకోవడానికి ఈ రోజే లాస్ట్ డేట్, ఈ గడువు పొడిగిస్తారా?
Petrol-Diesel Price 30 September 2023: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
Lost Pan Card: పోయిన పాన్ కార్డ్ కోసం మళ్లీ అప్లై చేయడం చాలా ఈజీ, ఈ సింపుల్ స్టెప్స్ పాటించండి
Small Savings Rate Hike: ఐదేళ్ల RDలపై మరింత ఎక్కువ వడ్డీ, మిగిలిన స్కీమ్‌లపైనా కీలక నిర్ణయం
Chandrababu Naidu Arrest : చంద్రబాబు మాజీ పీఎస్ సస్పెండ్ - అమెరికాకు వెళ్లి తిరిగిరాలేదన్న ప్రభుత్వం !
IND Vs ENG: ఇంగ్లండ్‌పై టాస్ గెలిచిన టీమిండియా - మొదట బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్!
30 వచ్చేసింది కాంగ్రెస్‌లో వైఎస్‌ఆర్‌టీపీ విలీనం లేనట్టేనా! షర్మిల నెక్స్ట్ స్టెప్ ఏంటీ?
జగన్ ప్లాన్ సక్సెస్ అయినట్టేనా!- ప్రజాసమస్యలు వదిలేసి కేసుల చుట్టే టీడీపీ చర్చలు
/body>