Work From Home: WFH చేస్తున్నారా! కేంద్రం కొత్త రూల్స్ తీసుకొస్తోంది తెలుసా?
ఇంటి నుంచి పనిచేస్తున్న ఉద్యోగులకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలు రూపొందించనుంది. విద్యుత్, ఇంటర్నెట్ వంటి ఖర్చులను యజమాని చేత ఇప్పించేందుకు సిద్ధమవుతోందని తెలిసింది.
వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఉద్యోగులకు శుభవార్త! ఇంటి నుంచి పనిచేస్తున్న ఉద్యోగులకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలు రూపొందించనుంది. విద్యుత్, ఇంటర్నెట్ వంటి ఖర్చులను యజమాని చేత ఇప్పించేందుకు సిద్ధమవుతోందని తెలిసింది. ఈ సరికొత్త పని విధానానికి సంబంధించి లీగల్ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశంగా తెలుస్తోంది.
కొవిడ్-19 వ్యాప్తితో దేశవ్యాప్తంగా చాలా కంపెనీలు ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసే సౌకర్యం కల్పించాయి. కొన్ని సంస్థలు మానవ వనరులను బాగానే చూసుకుంటున్నా మరికొన్ని ఇబ్బందులు పెడుతున్నాయి. ఇంటి వద్దే ఉంటున్నారు కదా అని ఎక్కువ గంటలు పని చేయించుకుంటున్నాయి! అలాగే ఇంటర్నెట్, విద్యుత్ ఖర్చులు, ఇతర అలవెన్సులు ఇవ్వడం లేదు. ఇలాంటి వాటి నుంచి ఉద్యోగులకు రక్షణగా చట్టబద్ధ నిబంధనలు రూపొందించనున్నారు.
వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగుల కోసం ఓ చట్టబద్ధ విధానం రూపొందించేందుకు కేంద్రం దృష్టి సారించిందని ఓ సీనియర్ ప్రభుత్వ అధికారి తెలిపారు. ఈ మేరకు ఉన్నత స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని వివరించారు. మున్ముందు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగ విధానం మరింత విస్తరించే అవకాశం ఉండటమే ఇందుకు కారణమని పేర్కొన్నారు.
కరోనా మహమ్మారి నేపథ్యంలో మున్ముందు పని విధానాలు ఎలా మారతాయో తెలియజేసేందుకు, ఉద్యోగులు, యజమానులకు ఎక్కువ ప్రయోజనాలు కల్పించేందుకు అవసరమైన సూచనలు చేసేందుకు ఓ కన్సల్టెన్సీని ప్రభుత్వం నియమించింది. సేవల రంగానికి సంబంధించి ఈ ఏడాది జనవరిలోనే ప్రభుత్వం ఓ స్టాండింగ్ ఆర్డర్ ఇచ్చింది. పని గంటలు, సేవల విధివిధానాలు చర్చించుకొని రూపొందించుకోవాలని సూచించింది.
ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలు ఇప్పటికే ఈ విధానాన్ని విస్తృతంగా అమలు చేస్తున్నాయి. ఇప్పుడు మిగిలిన రంగాల్లో విస్తరించేందుకు ప్రభుత్వం సమగ్ర పని విధానం రూపొందించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే విదేశాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ నిబంధనలపై నిబంధనలు రూపొందించిన సంగతి తెలిసిందే. కార్యాలయానికి దూరంగా పనిచేస్తున్న ఉద్యోగులకు రక్షణ కల్పిస్తున్నాయి.
Also Read: Multi bagger stock: రూ.లక్ష పెట్టుబడికి రూ.21 లక్షల లాభం ఇచ్చిన షేరు!
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!
Also Read: Gold-Silver Price: మరోసారి పెరిగిన బంగారం ధర.. వెండి నిలకడగా.. నేటి తాజా ధరలివీ..
Also Read: LIC Policy: రోజుకు 73 పెట్టుబడితో మెచ్యూరిటీకి రూ.10 లక్షలు పొందొచ్చు!
Also Read: WhatsApp : 2 కోట్ల మంది అకౌంట్ పీకేసిన వాట్సాప్ ! ఎందుకు..? ఏమిటి? ఎలా ?