Multi bagger stock: రూ.లక్ష పెట్టుబడికి రూ.21 లక్షల లాభం ఇచ్చిన షేరు!
కేవలం 12 నెలల్లోనే ఈ షేరు ధర 300 శాతం ర్యాలీ చేసింది. ఏడాదిలోనే రూ.590 నుంచి రూ.2,539కి చేరుకుంది. ఇంకా పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ ఏడాది చాలా కంపెనీలు మల్టీ బ్యాగర్లుగా అవతరించాయి! ఇన్వెస్టర్ల డబ్బులను రెట్టింపు చేశాయి. సంపదను మరింత వృద్ధి చేశాయి. గుజరాత్ ఫ్లోరో కెమికల్స్ లిమిటెడ్ (GFL) స్టాక్ అలాంటిదే. కేవలం 12 నెలల్లోనే ఈ షేరు ధర 300 శాతం ర్యాలీ చేసింది. ఏడాదిలోనే రూ.590 నుంచి రూ.2,539కి చేరుకుంది.
ఏడాది క్రితం ఈ షేరులో రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే ఇప్పుడు రూ.21.5 లక్షలు చేతికి వచ్చేవి. రూ.27,000 కోట్ల మార్కెట్ విలువ గల ఈ కంపెనీ షేరు ధర 5, 20, 50, 100, 200 రోజుల మూవింగ్ యావరేజెస్‌కు పైనే చలిస్తోంది. శుక్రవారం ఈ షేరు ధర పది శాతం పెరిగి ఆల్‌టైం గరిష్ఠమైన రూ.2,539కి చేరుకుంది. ఇంతలా ఎగిసినా రూ.3,086 టార్గెట్ పెట్టుకొని పెట్టుబడి పెట్టొచ్చని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ చెబుతోంది.
'ఫ్లోరోపాలిమర్స్ రంగంలో జీఎఫ్‌ఎల్‌కు మంచి ఉనికి ఉంది. బ్యాటరీ, సోలార్ ప్యానెల్, గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో ఫ్లోరోపాలిమర్స్‌కు డిమాండ్ ఎక్కువగా ఉంది. జీఎఫ్‌ఎల్ ఇంకా విస్తరించేందుకు ప్రణాళికలు చేపట్టడంతో షేరు ధర పెరిగేందుకు అవకాశం ఉంది' అని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ తెలిపింది.
2021, సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో జీఎఫ్‌ఎల్ రూ.207 కోట్ల నికర లాభం నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో ఇది రూ.79 కోట్లే కావడం గమనార్హం. ఆపరేషన్స్ రాబడి 56 శాతం పెరిగి రూ.964 కోట్లకు చేరుకుంది. ఈపీఎస్ రూ.7.21 నుంచి రూ.18.66కు పెరిగింది. చివరి మూడు త్రైమాసికాల్లోనూ పాజిటివ్ రిజల్టునే నమోదు చేసింది.
Also Read: India Post Payment Bank: లిమిట్ దాటి డబ్బు జమ చేసినా.. తీసినా.. పోస్టాఫీసులో రుసుము తప్పదు!
Also Read: Stock Market Update: ఈ 100 స్మాల్‌క్యాప్ స్టాక్స్ 10-122% పెరిగాయి తెలుసా!
Also Read: Gold-Silver Price: పసిడి ప్రియులకు షాక్! బంగారం ధర పైపైకి.. వెండి కూడా అంతే.. నేటి తాజా ధరలివీ..
Also Read: Rapido: ర్యాపిడోకు తెలంగాణ హైకోర్టు షాక్! ఆ ప్రకటన తక్షణమే నిలిపేయాలని ఆదేశం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి