WhatsApp : 2 కోట్ల మంది అకౌంట్ పీకేసిన వాట్సాప్ ! ఎందుకు..? ఏమిటి? ఎలా ?
భారతీయుల అకౌంట్లను ఇష్టారాజ్యంగా వాట్సాప్ డిలీట్ చేస్తోంది. నిబంధనలను అతిక్రమించారన్న పేరుతో ఆరు నెలల్లో రెండు కోట్ల అకౌంట్లను డిలీట్ చేసింది.
ఆరు నెలల్లో రెండు కోట్ల మంది భారతీయులు తమ వాట్సాప్ అకౌంట్‌ను కోల్పోయారు. వారంతటకు వారు ఆ యాప్‌ను డిలీట్ చేసుకోలేదు. వారు వాడకుండా వాట్సాపే బ్యాన్ చేసింది. బ్లాక్ చేసింది. అక్టోబర్ నెలలో 20 లక్షల 69 వేల అకౌంట్లను నిషేధించింది. సెప్టెంబర్‌లో సుమారు 30 లక్షల ఖాతాలను ఈ యాప్ తొలగించింది. ఇలా నెలకు 20, 30 లక్షలకు తగ్గకుండా అకౌంట్‌లను బ్యాన్ చేస్తోంది. ఇప్పటికి రెండు కోట్లు దాటిపోయాయి.
Also Read : అంగ్ సాన్ సూకీకి నాలుగేళ్ల జైలు శిక్ష ..మయన్మార్ కోర్టు తీర్పు !
వాట్సాప్ ఎందుకు ఇలా చేస్తోందంటే.. అభ్యంతరకర ప్రవర్తన పేరుతో, అందిన ఫిర్యాదుల మేరకు అకౌంట్లను సమీక్షించి నిషేధం విధించినట్లు వాట్సాప్ యాజమాన్య సంస్థ మెటా చెబుతోంది. వీటి ద్వారా ఎలాంటి సమాచారం వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది. అబ్యూజ్ డిటెక్షన్ టెక్నాలజీని ఉపయోగించి ఈ చర్యలు చేపట్టామని అందుకే బ్యాన్ చేశామని అంటోంది. ఒక అకౌంట్‌ను క్రియేట్ చేసుకున్న దగ్గరి నుంచి, దాని కార్యకలాపాలు, ఇతర గ్రూపులో వ్యవహరించిన తీరు, ఫీడ్‌బ్యాక్, రిపోర్టులు..ఇతర అకౌంట్‌లు బ్లాక్ చేయడం తదితర అంశాల్ని పరిగణనలోకి తీసుకుని చర్యలు తీసుకుంటున్నట్లుగా వాట్సాప్ చెబుతోంది.
Also Read : కాసేపట్లో పెళ్లి.. వాంతి చేసుకున్న పెళ్లి కుమార్తె.. చివరకు వరుడు ఏమన్నాడంటే..
ఒక అకౌంట్‌పై 500 ఫిర్యాదులు వస్తే ఆ అకౌంట్‌ను రద్దు చేసినట్లు వాట్సాప్ చెబుతోంది. భారత్‌లో ఐటీ రూల్స్ 2021 అమలులోకి వచ్చాక ఇక్కడి అకౌంట్లపై ఎక్కువగా పరిశీలన జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. గ్రీవెన్స్ చానెల్‌తో పాటు రకరకాల టూల్స్ సాయంతో ఇబ్బంది కరమైన అకౌంట్లను తొలగిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఇండియాలో ఉన్న పరిస్థితుల కారణంగా ఎక్కువగా రాజకీయ జోక్యంతో కొంతమంది కీలక వ్యక్తుల వాట్సాప్‌లను కూడా బ్లాక్ చేస్తున్నట్లు విమర్శలు ఎదుర్కోంటోంది. తాము ఎటువంటి అతిక్రమణలకు పాల్పడకున్నా... తమ అకౌంట్లు డిలీట్ అవుతుండడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Breastfeed: విమానంలో పిల్లి పిల్లకు రొమ్ము పాలిచ్చిన మహిళ.. ప్రయాణికులు షాక్
వాట్సాప్ అనేది ప్రతి ఒక్కరికి ఇప్పుడు తప్పనిసరి అయింది. ఈ మెసెజింగ్ యాప్‌ను చదువు రాని వాళ్లు కూడా ఉపయోగిస్తున్నారు. అయితే ఎక్కువ మంది ఫేక్ న్యూస్ తో పాటు అభ్యంతరకర సమాచారం షేర్ చేసుకోవడానికి ఉపయోగిస్తూండటంతో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. అందుకే వాట్సాప్ కీలక చర్యలు తీసుకుంటోంది.
Also Read: Pak's Serbia Agency: ఇమ్రాన్ ఖాన్ రాజ్యంపై 'కట్టప్పల' తిరుగుబాటు.. పాక్ పరువు తీసిన ఉద్యోగులు!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి