Pak's Serbia Agency: ఇమ్రాన్ ఖాన్ రాజ్యంపై 'కట్టప్పల' తిరుగుబాటు.. పాక్ పరువు తీసిన ఉద్యోగులు!
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై సొంత అధికారులే తిరుగుబాటు ప్రకటించారు. తమకు జీతాలు ఎందుకు చెల్లించడం లేదని ట్విట్టర్‌లో ప్రశ్నించారు
అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాకిస్థాన్ సర్కార్‌కు సొంత ప్రభుత్వ ఉద్యోగుల నుంచే అవమానాలు ఎదురవుతున్నాయి. ఏకంగా దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పైనే ఉద్యోగులు వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా సెర్బియాలోని పాకిస్థాన్ ఎంబసీ ఇమ్రాన్ ఖాన్‌పై వ్యంగ్యంగా ఓ ట్వీట్ చేసింది. తమకు మూడు నెలల నుంచి జీతాలు ఎందుకు చెల్లించలేదని ఇమ్రాన్ ఖాన్‌ను ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
ఈ ట్వీట్‌తో పాటు ఓ వీడియోను కూడా షేర్ చేశారు. 'మీరు ఆందోళన చెందవద్దు' అనే ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను ట్రోల్ చేస్తున్నట్లు ఈ వీడియో ఉంది. నిత్యావసర సరుకులు, ఔషదాల ధరలూ భారీగా పెరిగిన వైనాన్ని ప్రస్తావిస్తూ పాకిస్తాన్ ప్రభుత్వంపై ఆ వీడియోలో విమర్శలు ఉన్నాయి. అంతేకాదు, ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం దేశాన్ని అధఃపాతాళానికి తీసుకెళ్తున్నదని ఆ వీడియో పేర్కొంది.
అదే ట్విట్టర్ హ్యాండిల్ నుంచి వెంటనే మరో ట్వీట్ కూడా వచ్చింది. 'సారీ ఇమ్రాన్ ఖాన్.. నాకు మరో అవకాశం లేకపోయింది' అనే అర్థంతో ఆ ట్వీట్ ఉంది. సెర్బియా దేశంలోని పాకిస్థాన్ ఎంబసీ చేసిన ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో దుమారం రేపాయి. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై సొంత అధికారులే తిరుగుబాటు చేయడంపై నెటిజన్లు జోకులు వేస్తున్నారు.
దీంతో వెంటనే పాకిస్తాన్ ప్రభుత్వ అధికారులు సర్దుబాటు పనిలో పడ్డారు. నష్ట నివారణ చర్యలు చేపట్టారు. ఆ ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయిందని, దానిపై దర్యాప్తు ప్రారంభించినట్టు అధికారులు తెలిపారు.
Also Read: Omicron Variant: ఒమిక్రాన్‌పై షాకింగ్ నిజాలు.. డెల్టా కంటే ఆ విషయంలో మూడు రెట్లు ఎక్కువట!
Also Read: Corona Cases: ఒమిక్రాన్ భయాల వేళ ఊరట.. దేశంలో 10 వేలకు దిగువనే కొత్త కేసులు
Also Read: దేశంలోకి 'ఒమిక్రాన్' ఎంట్రీ.. అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరిక
Also Read: Omicron Variant: 'ఒమిక్రాన్'పై గుడ్ న్యూస్.. ప్రపంచమా ఊపిరి పీల్చుకో.. డెల్టా కంటే డేంజరస్ కాదట!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి