X

Omicron Variant: 'ఒమిక్రాన్‌'పై గుడ్‌ న్యూస్.. ప్రపంచమా ఊపిరి పీల్చుకో.. డెల్టా కంటే డేంజరస్ కాదట!

డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఒమిక్రాన్ అంత ప్రమాదకరం కాదని భారత్‌కు చెందిన ఇద్దరు వైద్య నిపుణులు తెలిపారు.

FOLLOW US: 

ఒమ్రికాన్ వేరియంట్‌పై తీవ్ర భయాందోనలు నెలకొన్నాయి. ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాలు ఒమ్రికాన్ భయంతో ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇలాంటి వేళ ఒమిక్రాన్ వేరియంట్‌ షాకింగ్ నిజాలు చెప్పారు ఉత్తర్‌ప్రదేశ్‌ కొవిడ్ అడ్వైజరీ కమిటీ ఛైర్‌పర్సన్ డా. ఆర్‌కే. ధీమాన్. 

ఒమిక్రాన్ వేరియంట్ సోకిన దక్షిణాఫ్రికాకు చెందిన ఎంతోమంది బాధితుల రిపోర్టులను తాను క్షుణ్ణంగా పరిశీలించినట్లు ధీమాన్ వెల్లడించారు. ఆ నివేదికల ప్రకారం ఒమిక్రాన్.. డెల్టా వేరియంట్ కంటే ప్రమాదకరం కాదని ధీమాన్ స్పష్టం చేశారు. అయితే వ్యాప్తి మాత్రం ఎక్కువ అని పేర్కొన్నారు.

ఆ ఇద్దరు..

డా. ధీమాన్‌తో పాటు, ఐసీఎమ్‌ఆర్ ఎపిడెమియోలజిస్ట్ చీఫ్ డా. సమీరన్ పాండా.. దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ వ్యాప్తి, లక్షణాలపై పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనల ప్రకారం ఒమిక్రాన్ వ్యాప్తి వేగంగా ఉన్నప్పటికీ ఇది డెల్టా వైరస్ కంటే ప్రమాదకరంకాదని తేల్చారు. అంతేకాకుండా ఈ వేరియంట్ సోకిన వారు ఆసుపత్రిలో చేరే పరిస్థితులు కూడా చాలా తక్కువన్నారు. మరణాల శాతం కూడా తక్కువే ఉండటం ఊరట కలిగించే విషయమన్నారు. అయితే ఈ వైరస్‌పై ఇంకా పరిశోధనలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఒమిక్రాన్ వేరియంట్‌పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

ఆక్సిజన్ లెవల్..

" ఒమిక్రాన్ కంటే డెల్టా వైరస్ చాలా ప్రమాదకరం. దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ వేరియంట్ సోకిన రోగులు చాలా కంగారు పడుతున్నారు. కానీ అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారి ఆక్సిజన్ లెవల్స్ సాధారణంగానే ఉంటున్నాయి. డెల్టా వైరస్‌లా ఒకేసారి ఆక్సిజన్ స్థాయి పడిపోవడం లాంటి పరిస్థితులు లేవు.                                                      "
-డా. ధీమాన్, ఉత్తర్‌ప్రదేశ్‌ కొవిడ్ అడ్వైజరీ కమిటీ ఛైర్‌పర్సన్

ఒక్క కేసు కూడా లేదు..

డెల్టా వేరియంట్ వచ్చిన కొత్తలో మరణాల రేటు గణనీయంగా పెరిగిందని, కానీ ఒమిక్రాన్ విషయంలో అలా లేదని ధీమాన్ అన్నారు. డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ ఎంతమాత్రం ప్రమాదకరం కాదని ఆయన స్పష్టం చేశారు. భారత్‌లో ఇప్పటివరకు ఒక్క ఒమిక్రాన్ వేరియంట్ కేసు కూడా నమోదు కాలేదని గుర్తు చేశారు. ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు.

కంగారు పడొద్దు..

" డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఒమిక్రాన్ సోకిన వారిలో ఆరోగ్య పరిస్థితి సాధారణంగానే ఉంటుంది. డెల్టా వేరియంట్ లాంటి పరిస్థితులు మాత్రం లేవు. అయితే అక్కడి రిపోర్టులు చూస్తే మాత్రం వ్యాప్తి ఉందని అర్థమవుతోంది. కానీ అంత ప్రమాదకరం కాదని తెలుస్తోంది. కనుక ప్రజలు అనవసరమైన వదంతులు నమ్మి కంగారు పడొద్దు. ఇది చాలా ప్రమాదకరం అని చెప్పడానికి ఏం లేదు. అయితే ఇది వేగంగా వ్యాప్తి చెందుతోన్న కారణంగా కరోనా నిబంధనలు మాత్రం పాటించాలి.                                           "
-డా. సమీరన్ పాండా, ఐసీఎమ్‌ఆర్ ఎపిడెమియోలజిస్ట్ చీఫ్ 

Also Read: Worlds Expensive City: ఈ నగరం చాలా కాస్ట్‌లీ!.. వెళ్తే జేబులో డబ్బులు ఖాళీ!

Also Read: Omicron Travel Rules: భారత్‌కు వస్తున్నారా? అయితే ఈ 10 పాయింట్లు పక్కా గుర్తుంచుకోండి!

Also Read: Petrol Price: తగ్గిన పెట్రోల్ ధరలు.. వాహనదారులకు బంపర్ ఆఫర్.. వ్యాట్ తగ్గించిన సర్కార్

Also Read: Govt on Farmers Protests: 'ప్చ్.. రైతులు చనిపోయారా? మాకు తెలియదే.. పరిహారం ఎలా ఇస్తాం?'

Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 8,954 కరోనా కేసులు నమోదు, 267 మంది మృతి

Also read: నాలుగు రోజులుగా సిరివెన్నెల ప్రాణం నిలిచింది ‘ఎక్మో’పైనే... ఎక్మో అంటే? అదెలా ఆయన ప్రాణాలు నిలిపింది?

Also read: అన్నం తింటే బరువు పెరుగుతామని భయమా... వండే స్టైల్ మార్చండి, బరువు తగ్గుతారు

Also Read: కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్... మొదటి ఫోటో విడుదల చేసిన పరిశోధకులు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి
Tags: omicron variant not deadly dangerous as Delta hospital admission Omicron Variant news

సంబంధిత కథనాలు

New Covid Omicron Variant BA.2 :  ఉఫ్.. ఒమిక్రానూ పిల్లల్ని పుట్టించేస్తోంది.. బ్రిటన్, డెన్మార్క్‌ను గడగడలాడిస్తున్న కొత్త వేరియంట్ BA.2 !

New Covid Omicron Variant BA.2 : ఉఫ్.. ఒమిక్రానూ పిల్లల్ని పుట్టించేస్తోంది.. బ్రిటన్, డెన్మార్క్‌ను గడగడలాడిస్తున్న కొత్త వేరియంట్ BA.2 !

Covid Update: దేశంలో మళ్లీ మూడు లక్షలు దాటిన కేసులు.. అదే స్థాయిలో ఒమిక్రాన్ కేసులు పెరుగుదల

Covid Update: దేశంలో మళ్లీ మూడు లక్షలు దాటిన కేసులు.. అదే స్థాయిలో ఒమిక్రాన్ కేసులు పెరుగుదల

Budget 2022 Healthcare Sector Expectations: కరోనా నేర్పిన గుణపాఠం! బడ్జెట్‌లో 'బూస్టర్‌ డోస్‌' తప్పదు!!

Budget 2022 Healthcare Sector Expectations: కరోనా నేర్పిన గుణపాఠం!  బడ్జెట్‌లో 'బూస్టర్‌ డోస్‌' తప్పదు!!

Covid Update: దేశంలో కరోనా విజృంభణ.. కొత్తగా 3.5 లక్షల కేసులు నమోదు

Covid Update: దేశంలో కరోనా విజృంభణ.. కొత్తగా 3.5 లక్షల కేసులు నమోదు

వ్యాక్సిన్ వద్దంటూ.. చెట్టెక్కి కూర్చున్నాడు, వీడియో వైరల్

వ్యాక్సిన్ వద్దంటూ.. చెట్టెక్కి కూర్చున్నాడు, వీడియో వైరల్

టాప్ స్టోరీస్

Shyam SinghaRoy: నానిని పెళ్లి చేసుకోమని అడిగిన వేశ్య.. వీడియో చూశారా..? 

Shyam SinghaRoy: నానిని పెళ్లి చేసుకోమని అడిగిన వేశ్య.. వీడియో చూశారా..? 

Moto Tab G70 LTE Sale: మోటొరోలా బడ్జెట్ ట్యాబ్లెట్ సేల్ నేడే.. ధర తక్కువే!

Moto Tab G70 LTE Sale: మోటొరోలా బడ్జెట్ ట్యాబ్లెట్ సేల్ నేడే.. ధర తక్కువే!

HBD Namrata Mahesh Ghattamaneni: నమ్రతా శిరోద్కర్ గురించి ఈ విషయాలు తెలుసా..

HBD Namrata Mahesh Ghattamaneni: నమ్రతా శిరోద్కర్ గురించి ఈ విషయాలు తెలుసా..

Groom Slaps Bride: వధువును కొట్టిన వరుడు.. అదే ముహూర్తానికి కజిన్‌ను పెళ్లాడిన యువతి

Groom Slaps Bride: వధువును కొట్టిన వరుడు.. అదే ముహూర్తానికి కజిన్‌ను పెళ్లాడిన యువతి