Omicron Travel Rules: భారత్‌కు వస్తున్నారా? అయితే ఈ 10 పాయింట్లు పక్కా గుర్తుంచుకోండి!

భారత్ వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది కేంద్రం. వీటిని కచ్చితంగా అమలు చేయాలని తెలిపింది.

FOLLOW US: 

దేశానికి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు సరికొత్త మార్గదర్శకాలను ప్రకటించింది భారత్. ముఖ్యంగా ''ముప్పు''గా పేర్కొన్న దేశాల నుంచి వద్దే వారు తప్పకుండా ఈ మార్గదర్శకాలను పాటించాలని తెలిపింది. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వచ్చిన తర్వాత అంతర్జాతీయ ప్రయాణికులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు దిల్లీ విమానాశ్రయం ట్వీట్ చేసింది. 

" ఒమ్రికాన్ 'ముప్పు' ఉన్న దేశాల నుంచి 4 విమానాల్లో మొత్తం 1013 ప్రయాణికులు అన్ని ఫార్మాలటీస్ పూర్తి చేసుకుని దిల్లీకి చేరారు. వీరంతా రేపిడ్ పీసీఆర్ టెస్ట్, ఆర్‌టీపీసీఆర్ టెస్ట్ చేయించుకున్నవారే.                                                 "
- దిల్లీ విమానాశ్రయం

ఇప్పటివరకు దేశంలో ఒక్క ఒమ్రికాన్ వేరియంట్ కేసు కూడా నమోదుకాలేదని ప్రభుత్వ ప్రకటించింది. 'ముప్పు' ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కచ్చితంగా ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షలు చేయించాలని కేంద్రం ప్రభుత్వం తెలిపింది.

ఐరోపా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, బంగ్లాదేశ్, బోస్త్‌వానా, చైనా, మారిషస్, న్యూజిలాండ్, జింబాబ్వే, సింగపూర్, హాంకాంగ్, ఇజ్రాయెల్ దేశాలు ప్రస్తుతం ఒమ్రికాన్ ''ముప్పు'' దేశాలుగా పేర్కొన్నారు. 

మార్గదర్శకాలు..

1. భారత్‌ వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులు కచ్చితంగా నెగెటివ్ ఆర్‌టీ-పీసీఆర్ రిపోర్టుతో స్వీయ ధ్రువీకరణ పత్రాని సువిధా పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి. ప్రయాణానికి 72 గంటల ముందు ఈ పరీక్ష చేయించుకోవాలి. 

2. ''ముప్పు'' దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కచ్చితంగా ఆర్‌టీ-పీసీఆర్ పరీక్ష నిర్వహించాలి. ఆ పరీక్ష ఫలితాలు వచ్చేవరకు వారు విమానాశ్రయం నుంచి వెళ్లే అవకాశం లేదు. 

3. 'ముప్పు' దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు తమ కరోనా పరీక్ష ఫలితాలు వచ్చే వరకు విమానాశ్రయంలోనే ఉండేందుకు సిద్ధంగా ఉండాలి. కనక్టింగ్ ఫ్లైట్స్‌ను బుక్ చేసుకోకూడదు. 

4. కొత్త మార్గదర్శకాల ప్రకారం.. 'ముప్పు' దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కరోనా పరీక్షలో నెగెటివ్ రిపోర్టు వస్తే వాళ్లు 7 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలి. 8వ రోజు మరోసారి టెస్ట్ చేయించుకోవాలి. ఆ తర్వాత ఏడు రోజుల పాటు తమ ఆరోగ్యంపై పర్యవేక్షణ చేసుకోవాలి. 

5. ఒకవేళ పాజిటివ్ వస్తే బాధితుడు.. ప్రత్యేక ఐసోలేషన్‌ కేంద్రంలో ఉండాలి. ఆ శాంపిల్‌ను జినోమిక్ టెస్టింగ్‌కు పంపిస్తారు. ఒకవేళ రోగి జినోమిక్ శాంపిల్ ఒమ్రికాన్ వేరియంట్ నెగెటివ్ వస్తే ఫిజీషియన్ సలహా మేరకు డిశ్ఛార్జి చేస్తారు. ఒక వేళ ఒమ్రికాన్ పాజిటివ్ అయితే కఠిన ఐసోలేషన్ సహా చికిత్సను మొదలుపెడతారు. 

6. పాజిటివ్‌గా తేలిన వారికి దగ్గరగా ఉన్నవారు కచ్చితంగా వ్యవస్థీకృత క్వారంటైన్‌లో లేదా హోం క్వారంటైన్‌లో ఉండాలి. వీరిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పర్యవేక్షించాలి. 

7. ఆర్‌టీ-పీసీఆర్ పరీక్ష చేయించుకునే ఒక్కో ప్రయాణికుడు రూ.1700 చెల్లించాలి. ఆర్‌టీ-పీసీఆర్ పరీక్ష, పరీక్ష ఫలితాలు వచ్చేవరకు అవసరమైన ఆహారం, తాగు నీరు కోసం ఈ డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.

8. వివిధ దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల్లో 2 శాతం మందికి రేండమ్‌గా ఆర్‌టీ-పీసీఆర్ పరీక్ష చేస్తారు. 

9. 'ముప్పు' దేశాలు నుంచి కాకుండా ఇతర దేశాల నుంచి వచ్చేవారు విమానాశ్రయం నుంచి వెళ్లిపోవచ్చు. అయితే తరువాతి 14 రోజుల పాటు తమ ఆరోగ్యాన్ని స్వీయ పర్యవేక్షణ చేసుకోవాలి. 

10. 'ముప్పు' దేశాల నుంచి ముంబయి ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికులంతా కచ్చితంగా ఏడు రోజుల వ్యవస్థీకృత క్వారంటైన్ పాటించాలి. రెండు, నాలుగు, ఏడో రోజు మొత్తం మూడు ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలి. పరీక్ష ఫలితాలు నెగెటివ్ వచ్చిన తర్వాత మాత్రమే వారిని వెళ్లేందుకు అవకాశం ఉంది. 

Also Read: Petrol Price: తగ్గిన పెట్రోల్ ధరలు.. వాహనదారులకు బంపర్ ఆఫర్.. వ్యాట్ తగ్గించిన సర్కార్

Also Read: Govt on Farmers Protests: 'ప్చ్.. రైతులు చనిపోయారా? మాకు తెలియదే.. పరిహారం ఎలా ఇస్తాం?'

Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 8,954 కరోనా కేసులు నమోదు, 267 మంది మృతి

Also read: నాలుగు రోజులుగా సిరివెన్నెల ప్రాణం నిలిచింది ‘ఎక్మో’పైనే... ఎక్మో అంటే? అదెలా ఆయన ప్రాణాలు నిలిపింది?

Also read: అన్నం తింటే బరువు పెరుగుతామని భయమా... వండే స్టైల్ మార్చండి, బరువు తగ్గుతారు

Also Read: కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్... మొదటి ఫోటో విడుదల చేసిన పరిశోధకులు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి
Published at : 01 Dec 2021 03:39 PM (IST) Tags: COVID-19 Omicron omicron variant Travel guidelines international travellers

సంబంధిత కథనాలు

BreastMilk: బాలింతలకు పాలు బాగా పడాలంటే కొన్ని చిట్కాలు ఇవిగో...

BreastMilk: బాలింతలకు పాలు బాగా పడాలంటే కొన్ని చిట్కాలు ఇవిగో...

Tea: టీలో బెల్లం వేసుకుని తాగుతున్నారా? ఆయుర్వేదం వద్దని చెబుతోంది

Tea: టీలో బెల్లం వేసుకుని తాగుతున్నారా? ఆయుర్వేదం వద్దని చెబుతోంది

Eye Problems: కంటి చూపు అకస్మాత్తుగా మసకబారుతోందా? ఇది ఆ ముప్పుకు సంకేతం!

Eye Problems: కంటి చూపు అకస్మాత్తుగా మసకబారుతోందా? ఇది ఆ ముప్పుకు సంకేతం!

Tingling: తిమ్మిర్లు ఎక్కువ వస్తున్నాయా? అయితే ఈ సమస్యలు ఉన్నాయేమో చెక్ చేసుకోండి

Tingling: తిమ్మిర్లు ఎక్కువ వస్తున్నాయా? అయితే ఈ సమస్యలు ఉన్నాయేమో చెక్ చేసుకోండి

Heart Failure: పెళ్లి కాని వ్యక్తులు గుండె వైఫల్యంతో మరణించే ప్రమాదం ఎక్కువ, కొత్త పరిశోధన ఫలితం

Heart Failure: పెళ్లి కాని వ్యక్తులు గుండె వైఫల్యంతో మరణించే ప్రమాదం ఎక్కువ, కొత్త పరిశోధన ఫలితం

టాప్ స్టోరీస్

WT20 Challenge 2022: లేడీ సెహ్వాగ్‌ థండర్స్‌ ముందు సాగని హర్మన్‌ మెరుపుల్‌!

WT20 Challenge 2022: లేడీ సెహ్వాగ్‌ థండర్స్‌ ముందు సాగని హర్మన్‌ మెరుపుల్‌!

GT vs RR, Qualifier 1: హార్దిక్‌నే వరించిన టాస్‌ - రాజస్థాన్‌ తొలి బ్యాటింగ్‌

GT vs RR, Qualifier 1: హార్దిక్‌నే వరించిన టాస్‌ - రాజస్థాన్‌ తొలి బ్యాటింగ్‌

Major: 'మేజర్' సినిమాకి స్టాండింగ్ ఒవేషన్ - సెన్సార్ టాక్ ఇదే

Major: 'మేజర్' సినిమాకి స్టాండింగ్ ఒవేషన్ - సెన్సార్ టాక్ ఇదే

KTR In Davos: తెలంగాణలో ఐదు వందల కోట్ల రూపాయలతో ఆశీర్వాద్ పైప్స్ తయారీ ప్లాంట్ - విదేశాలకు ఎగుమతి చేసేలా ప్లానింగ్

KTR In Davos: తెలంగాణలో ఐదు వందల కోట్ల రూపాయలతో ఆశీర్వాద్ పైప్స్ తయారీ ప్లాంట్ - విదేశాలకు ఎగుమతి చేసేలా ప్లానింగ్