Corona Cases: దేశంలో కొత్తగా 8,954 కరోనా కేసులు నమోదు, 267 మంది మృతి
దేశంలో కొత్తగా 8,954 కరోనా కేసులు నమోదుకాగా 267 మంది మృతి చెందారు.
దేశంలో నిన్నటితో పోలిస్తే కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 8,954 కరోనా కేసులు నమోదుకాగా 267 మంది మృతి చెందారు. ఒక్కరోజే 10,207 మంది వైరస్‌ను జయించారు. కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 99,023కు చేరింది.
COVID19 | India reports 8,954 new cases, 267 deaths & 10,207 recoveries in the last 24 hours; Active caseload at 99,023: Ministry of Health and Family Welfare
— ANI (@ANI) December 1, 2021
Total Vaccination : 1,24,10,86,850 pic.twitter.com/VCefgxVg3n
- మొత్తం కేసులు: 3,45,79,228
- మొత్తం మరణాలు: 4,69,247
- యాక్టివ్ కేసులు: 99,023
- మొత్తం కోలుకున్నవారు: 3,40,28,506
టీకాల పంపిణీ
మంగళవారం ఒక్కరోజే 80,98,716 కొవిడ్ టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో మొత్తం టీకాల పంపిణీ.. 1,24,10,86,850 కు చేరింది.
ఒమిక్రాన్ భయాలు..
ఒమిక్రాన్ వేరియంట్‌పై అత్యంత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేశ్ భూషణ్.. ఈ రోజు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో సమావేశమయ్యారు. ఒమిక్రాన్ వేరియంట్ కట్టడిపై పలు సూచనలు చేశారు.
కేంద్రం సూచనలు..
- కరోనా నిర్ధరణ పరీక్షలు వేగవంతం చేయాలి.
- కరోనా నిర్ధరణ అయితే ఆ శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలకు పంపించాలి.
- ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, హోం ఐసోలేషన్ వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలి.
- కరోనా టెస్టింగ్, వ్యాక్సినేషన్ కార్యక్రమం, మౌలిక వైద్యవసతులు తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలి.
Also read: అన్నం తింటే బరువు పెరుగుతామని భయమా... వండే స్టైల్ మార్చండి, బరువు తగ్గుతారు
Also Read: కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్... మొదటి ఫోటో విడుదల చేసిన పరిశోధకులు