Marriage: కాసేపట్లో పెళ్లి.. వాంతి చేసుకున్న పెళ్లి కుమార్తె.. చివరకు వరుడు ఏమన్నాడంటే..
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్య ఘట్టం. అలాంటి పెళ్లిలో అనుకోని జరిగితే ఎలా ఉంటుంది?
పెళ్లంటే.. మధుర జ్ఞాపకాలే కాదు. కొన్నిసార్లు చేదు జ్ఞాపకాలు కూడా ఉంటాయి. అందరూ కలిసి తలా ఓ చెయ్యి వేస్తే పర్లేదు. పని అంతా.. పెళ్లి కుమార్తె, పెళ్లి కొడుకే.. పైన వేసుకుంటే.. వచ్చే అనర్థాలు అన్నీ ఇన్నీ కావు. పెళ్లి చేసుకునే సమయంలో జాగ్రత్త అవసరం.. లేకుంటే.. ఆ జ్ఞాపకాలు జీవితాంతం అలానే ఉంటాయి. పెళ్లంటే.. గుర్తుపెట్టుకోవాల్సినవి కాకుండా.. అనవసరమైనవి మైండ్ లోకి వస్తాయి. ఈ పెళ్లి తంతు చూస్తే.. ఇదంతా ఎందుకు చెప్పినట్టు అర్థం అవుతుంది.
అమెరికాలో ఓ జంట పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంది. వాళ్లే హోలీ లిన్నియా-కోలెండా డార్నెల్. తేదీ కూడా ఫీక్సయింది. ఇక అంతా హడావుడి స్టార్ట్ అయింది. డేట్ దగ్గరకు పడుతున్న కొద్ది.. వాళ్లిద్దరికి టెన్షన్ మెుదలైంది. పెళ్లి పనులు వాళ్లే దగ్గర ఉండి మరి చేసుకున్నారు. రేపు పెళ్లి అనగా.. ఇవాళ కూడా వాళ్లు తీరిక లేకుండా పని చేశారు. అంతలా పని చేశాక.. ఇక ఆరోగ్యంపై ఎఫెక్ట్ పడటం సాధారణమే. హోలికి పెళ్లి రోజు మార్నింగ్ అదే జరిగింది. ఆమెకు అలసటగా అనిపించింది. తనకు ఓపిక లేదని.. తనకు కాబోయే భర్త కోలెండాకు వివరించింది. పెళ్లి సంబరంలో ఉన్న అతడు.. హోలీ చెప్పిన విషయాన్ని లైట్ తీసుకున్నాడు.
కాసేపట్లో పెళ్లి.. ఇప్పుడు పెళ్లిని వాయిదా వేయడం కరెక్ట్ కాదని.. రెడీ అయి పెళ్లి చేసుకునే ప్లేస్ కి వెళ్లింది. అప్పటికే ఆమె ఆరోగ్యం బాగాలేక.. ఓ వైపు పెళ్లి జరుగుతుండగానే.. హోలీకి కళ్లు తిరిగాయి. సడెన్ గా కిందపడుతుండగా.. కాబోయే భర్తు పట్టుకుని.. కింద కూర్బొబెట్టి.. ఆమె ముఖం మీద నీళ్లు చల్లారు. స్పృహలోకి వచ్చి.. ఇలా కళ్లు తెరుస్తుందో లేదో.. వాంతి చేసుకుంది.
హోలీకి కాస్త ఫ్యాన్ గాలి తగిలేలా చేయాలని.. అనుకుంది సోదరి. ఆమె దగ్గర ఉన్న పిల్లాడని హోలీ చేతికి ఇచ్చింది. ఆ బుడ్డొడు.. అదే టైమ్ లో హోలీపై మల విసర్జన చేశాడు. దీంతో పెళ్లి కుమార్తెకి మరింత చిరాకు అనిపించింది. ఎలాగోలా.. పెళ్లి తంతు కంప్లీట్ చేసుకుని.. హస్పిటల్ వెళ్లారు. హోలీకి లో బీపీ, రక్తహీనతతో ఉందని.. అందుకే పెళ్లి జరుగుతుండగా పడిపోయిందని డాక్టర్లు చెప్పారు. రెస్ట్ లేకుండా పని చేయడం, నీళ్లు తాగకుండా ఉండటం కారణంగా డీహైడ్రేషన్‌కు గురై వాంతి చేసుకున్నట్లు వెల్లడించారు.
పెళ్లి గురించి మాకు ఎదురైన అనుభవాలు గుర్తు చేసుకుంటే.. చాలా చిరాకుగా అనిపిస్తుందని హోలీ దంపతులు చెబుతున్నారు. ఇక ముందట వేరే వాళ్లకు అయినా.. ఇలాంటి వాటి గురించి చెప్పాలని వరుడు అంటున్నాడు.
Also Read: Breastfeed: విమానంలో పిల్లి పిల్లకు రొమ్ము పాలిచ్చిన మహిళ.. ప్రయాణికులు షాక్
Also Read: Pak's Serbia Agency: ఇమ్రాన్ ఖాన్ రాజ్యంపై 'కట్టప్పల' తిరుగుబాటు.. పాక్ పరువు తీసిన ఉద్యోగులు!
Also Read: Omicron Variant: ఒమిక్రాన్‌పై షాకింగ్ నిజాలు.. డెల్టా కంటే ఆ విషయంలో మూడు రెట్లు ఎక్కువట!