Aung San Suu Kyi Jailed: : అంగ్ సాన్ సూకీకి నాలుగేళ్ల జైలు శిక్ష ..మయన్మార్ కోర్టు తీర్పు !
మయన్మార్ ప్రజాస్వామ్య నేత ఆంగ్ సాన్ సూకీకి కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. సైనిక తిరుగుబాటు కారణంగా ఆమె ఫిబ్రవరిలో పదవిని కోల్పోయారు. అప్పట్నుంచి నిర్బంధంలోనే ఉన్నారు.
మయన్మార్ ప్రజాస్వామ్య నేత ఆంగ్ సాన్ సూకీ అక్కడి కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రతినిధి ఒకరు అంతర్జాతీయ మీడియాకు వెళ్లడించారు. ప్రస్తుతం సూకీ వయసు 76 ఏళ్లు. మిలటరీకి వ్యతిరేకంగా అసమ్మతిని ప్రేరేపించినందుకు, కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ ఈ నాలుగేళ్ల శిక్ష విధించినట్లుగా సైనిక పాలకులు తెలిపారు. సూకీకి సెక్షన్ 505(బి) కింద రెండేళ్లు, ప్రకృతి విపత్తు చట్టం ప్రకారం మరో రెండేళ్ల జైలుశిక్ష కోర్టు విధించారు.
#BREAKING Myanmar's Suu Kyi jailed for four years: govt spokesman pic.twitter.com/hnEXvgYNwX
— AFP News Agency (@AFP) December 6, 2021
Also Read : కాసేపట్లో పెళ్లి.. వాంతి చేసుకున్న పెళ్లి కుమార్తె.. చివరకు వరుడు ఏమన్నాడంటే..
ప్రకృతి వైపరీత్యాల చట్టం ఉల్లంఘన, హింసకు ప్రేరేపించడం వంటి అంశాల్లో సూకీపై 11కేసులు ఉన్నాయి. వీటిలో కొన్ని కేసుల్లో దోషిగా చాలా కాలం జైల్లో ఉండాల్సి ఉంటుంది. ప్రజాస్వామ్యయుతంగా జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి మయన్మార్ ప్రభుత్వాన్ని నడుపుతున్న అంగ్ సాన్ సూకీ ప్రభుత్వాన్ని సైనిక తిరుగుబాటు ద్వారా కూల్చేసి జైల్లో పెట్టారు. ఇప్పుడు అధికారికంగా కోర్టు ద్వారా శిక్షించారు.
Also Read: Breastfeed: విమానంలో పిల్లి పిల్లకు రొమ్ము పాలిచ్చిన మహిళ.. ప్రయాణికులు షాక్
మయన్మార్‌ను కొన్ని దశాబ్దాల పాటు పాలించిన కఠినమైన సైనికాధికారులను అంగ్ సాన్ సూకీ సవాల్ చేశారు. ఆమె దీర్ఘ కాలం హౌస్ అరెస్ట్ లోనే ఉన్నారు. సూకీ 1989 - 2010 వరకు నిర్బంధంలోనే గడిపారు. సైనిక పాలనలో ఉన్న మియన్మార్‌లో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలని ఆమె చేసిన వ్యక్తిగత పోరాటం ఆమెకు, అణచివేత ముంగిట శాంతియుతంగా పోరాడుతున్న అంతర్జాతీయ వ్యక్తిగా గుర్తింపు తెచ్చి పెట్టింది. నోబెల్ శాంతి బహుమతి కూడా వచ్చింది.
Also Read: Pak's Serbia Agency: ఇమ్రాన్ ఖాన్ రాజ్యంపై 'కట్టప్పల' తిరుగుబాటు.. పాక్ పరువు తీసిన ఉద్యోగులు!
సుదీర్ఘ పోరాటం తర్వాత 2015లో జరిగిన ప్రజాస్వామ్య ఎన్నికలలో ఆమె నేతృత్వం వహించిన నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీ విజయం సాధించింది. 2020లో జరిగిన ఎన్నికలలో ఆమె పార్టీ భారీ మెజారిటీతో గెలిచింది. ఈ ఎన్నికలలో ఆమె పార్టీకి 2015 కంటే ఎక్కువ సంఖ్యలో ఓట్లు వచ్చాయి. అయితే, ఆ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని సైన్యం ఆరోపించింది.కొత్తగా ఎన్నికైన పార్లమెంటు దిగువ సభ సభ్యులు తొలిసారిగా సమావేశం కావాల్సి ఉన్న రోజునే అరెస్ట్ చేశారు. అప్పట్నుంచి ఆమె జైల్లో ఉన్నా రు.
Also Read: Omicron Variant: ఒమిక్రాన్‌పై షాకింగ్ నిజాలు.. డెల్టా కంటే ఆ విషయంలో మూడు రెట్లు ఎక్కువట!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి