By: ABP Desam | Updated at : 07 Dec 2021 05:34 PM (IST)
ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ ఐడియా
టెలికాం ఆపరేటర్లు జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా కొన్ని రోజుల క్రితమే ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను పెంచారు. పరిశీలిస్తే అన్ని కంపెనీలు స్ట్రీమింగ్ ప్రయోజనాలు తగ్గించినట్టు కనిపిస్తోంది. పైగా రోజుకు 3జీబీ డేటా అందించే వార్షిక ప్లాన్ల ధరలను ఎక్కువ చేశారు. అయితే కొన్ని వార్షిక ప్లాన్లు మాత్రం ప్రయోజనాలు అందిస్తున్నాయి.
ముగ్గురు ప్రైవేటు టెలికాం ఆపరేటర్లలో జియోదే ఖరీదైన వార్షిక ప్లాన్‌గా కనిపిస్తోంది. రూ.4199కి 365 రోజుల వ్యాలిడిటీతో రోజుకు ఒక 3 జీబీ డేటాను అందిస్తోంది. అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితం. అన్ని జియో యాప్స్‌ను ఉచితంగా వాడుకోవచ్చు. జియో రూ.3119 వార్షిక ప్లాన్‌లో రోజుకు 2జీబీ అందిస్తున్నారు. అదనంగా మరో 10 జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ కాల్స్, 100 ఎస్‌ఎంఎస్‌లు, జియో యాప్స్ ఇస్తున్నారు. రూ.2879 ప్లాన్‌లోనూ వ్యాలిడిటీ 365 రోజులు, 100 ఎస్‌ఎంఎస్‌లు, యాప్స్ వాడుకోవచ్చు.
ఎయిర్‌టెల్ కూడా 365 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 3జీబీ డేటా ప్లాన్లు అందిస్తోంది. ఇవి రూ.1799 నుంచి రూ.2999 మధ్య ఉన్నాయి. వీటికి అదనంగా 24జీబీ డేటా, రోజుకు 2జీబీ డేటాను ఇస్తోంది. ఈ అన్ని ప్లాన్లలో రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు ఇస్తున్నారు. ఈ రెండు ప్లాన్లు ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్, అపోలో 24I7, ఉచిత ఆన్‌లైన్ కోర్సులు, క్యాష్‌బ్యాక్, ఫాస్టాగ్‌పై క్యాష్‌బ్యాక్, ఫ్రీ హెలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ వంటివి ఇస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+హాట్‌స్టార్ వంటి ఓటీటీ ఆఫర్లు అందిస్తున్నారు.
వొడాఫోన్ ఐడియా రూ.1799 నుంచి రూ.2899 మధ్య వార్షిక ప్లాన్లు ప్రకటించింది. 24 జీబీ డేటా, రోజుకు 1.5జీబీ డేటా ప్రయోజనాలు ఇందులో ఉన్నాయి. అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, 365 రోజుల వ్యాలిడిటీ అందిస్తోంది. ఇక రూ.3099 ప్లాన్‌లో 365 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 1.5 జీబీ డేటా, డిస్నీ+హాట్‌స్టార్ ప్రయోజనాలను అందిస్తున్నారు. బింగే ఆల్‌నైట్, వీకెండ్ రోలోవర్ డేటా బెనిఫిట్, వి మూవీస్, టీవీ, నెలకు జీబీ అదనపు డేటా ఇస్తున్నారు. డిస్నీ + హాట్‌స్టార్ ప్రయోజనాలు అందించే ప్లాన్లలో వి ఎలాంటి మార్పులు చేయలేదు.
Also Read: LIC Policy: రోజుకు 73 పెట్టుబడితో మెచ్యూరిటీకి రూ.10 లక్షలు పొందొచ్చు!
Also Read: Work From Home: WFH చేస్తున్నారా! కేంద్రం కొత్త రూల్స్ తీసుకొస్తోంది తెలుసా?
Also Read: LIC Insurance Premium: ఈపీఎఫ్‌వో నుంచి ఎల్‌ఐసీ ప్రీమియం చెల్లించొచ్చు తెలుసా..! వివరాలు ఇవే!
Also Read: GST Update: ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్‌టీ తగ్గింపు.. ఎవ్వరూ అడగట్లేదన్న కేంద్రం!
Also Read: Gold-Silver Price: నేడు స్థిరంగా బంగారం ధర.. వెండి స్వల్పంగా పెరుగుదల.. మీ ప్రాంతంలో నేటి ధరలివీ..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Gold-Silver Prices Today 13 Mar: గుండె గాభరా పెంచుతున్న గోల్డ్ - ఏపీ, తెలంగాణలో ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
Holi Gifts: హోలీ నాడు ఈ ప్రత్యేక బహుమతులు ఇవ్వండి, ఇంప్రెస్ చేయండి - ఇవన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీ
EPFO: EDLI స్కీమ్‌లో 3 కీలక మార్పులు, ప్రతి ఒక్క ఉద్యోగికి ఇవి చాలా ముఖ్యం
New Currency Notes: మార్కెట్లోకి కొత్త 100, 200 రూపాయల నోట్లు - పాత నోట్లను రద్దు చేస్తారా?
Airtel-Starlink Deal: స్టార్‌లింక్‌తో చేతులు కలిపిన ఎయిర్‌టెల్ - నేరుగా మీ ఇంటికే సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్!
Group-3 Results: గ్రూప్-3 ఫలితాలు విడుదల, అభ్యర్థుల మార్కుల వివరాలు అందుబాటులో - డైరెక్ట్ లింక్ ఇదే
Amaravati Latest News:ఏప్రిల్‌లో ఏపీ రానున్న ప్రధానమంత్రి మోదీ - నవ నగరాల నిర్మాణ శంకుస్థాపనకు హాజరు
Janasena Formation Day: పిఠాపురంలో పెరిగిన జోష్, జయకేతనం సభకు భారీగా తరలివస్తున్న జనసైనికులు
Chandra Babu Latest News: గ్రూప్ పాలిటిక్స్ వద్దు- వైసీపీ నేతలకు దూరంగా ఉండండి, టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్