Breaking News Telugu Live Updates: ఢిల్లీ బ్రోకర్ గాళ్లు చంచల్ గూడ జైల్లో ఉన్నారు - కేసీఆర్
Breaking News Telugu Live Updates: ఏపీ, తెలంగాణ బ్రేకింగ్ న్యూస్ లైవ్ అప్‌డేట్స్ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం
LIVE

Background
KCR Speech: వడ్లు కొనరు కానీ ఎమ్మెల్యేలను కొనేందుకు వస్తరా? - కేసీఆర్
’’మా పంట కొనాలని వడ్లు కొనాలని అడిగితే స్పందించరు కానీ, రూ.వందల కోట్లు సంచులు పట్టుకొని ఎమ్మెల్యేలను కొనాలని వస్తరా? ఈ బీజేపీకి బుద్ధి చెప్పాలా? వద్దా? మీరంతా ఆలోచించాలి. వీటన్నింటికీ మీరు జవాబు చెప్పకపోతే వాళ్లు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తరు. మేం చేసేది ఏమీ ఉండదు. గ్యాస్ రేటు పెరిగింది.. పెట్రోల్ రేట్లు పెరిగాయి.. జీఎస్టీ ఎస్తున్నారని మనం కొట్లాడాలి. కత్తి ఒకరి చేతిలో పెట్టి యుద్ధాన్ని ఇంకొకడ్ని చేయమంటే చేస్తడా? ఎవరి చేతిలో కత్తి పెడతవో.. వాడు మన మెడ కోసేస్తడు. కాబట్టి, కత్తి ఒకడి చేతిలో పెట్టి యుద్ధాన్ని మరొకరిని చేయమంటే సమంజసం కాదు. ప్రజల ఆస్తులు కాపాడే పార్టీలను మీరు గౌరవిస్తే అందరం మంచిగుంటదని గమనించాలి.’’ అని కేసీఆర్ అన్నారు.
CM KCR: మునుగోడు ప్రజలు మనసుపెట్టి ఆలోచించండి - కేసీఆర్
‘‘ఇతరుల్ని సంతలో పశువుల్లా కొని ప్రభుత్వాలను కూలగొడుతున్న అరాచకం ప్రస్తుతం ఉంది. మోదీ రెండు సార్లు ప్రధానిగా పనిచేశారు. ఆర్ఎస్ఎస్ కు చెందిన ప్రతినిధులు హైదరాబాద్ కు వచ్చి ఇప్పుడు చంచల్ గూడ జైలులో ఉన్నారు. దీనిపైన విచారణ జరగాలి. మనం మౌనంగా ఉంటే అదే మనకు శాపం అవుతుంది. ప్రతి పౌరుడు, ప్రతి యువకుడు దీన్ని తీవ్రంగా తీసుకోవాలి. కాబట్టి, మునుగోడులో ఉన్న అందరూ మనసుపెట్టి ఆలోచించండి. మీ ఊరు పోయి చర్చించుకోండి’’ అని కేసీఆర్ అన్నారు.
KCR Speech: ఢిల్లీ బ్రోకర్ గాళ్లు చంచల్ గూడ జైల్లో ఉన్నారు - కేసీఆర్
‘‘హైదరాబాద్ నుంచి నాతో పాటు నలుగురు తెలంగాణ బిడ్డలు నాతో పాటు వచ్చారు. నిన్నా మొన్నా ఢిల్లీ బ్రోకర్ గాళ్లు పార్టీ మారాలని వంద కోట్లు ఇస్తే వారిని ఎడమ కాలు చెప్పుతో కొట్టారు. మేం అమ్ముడు పోబోమని, తెలంగాణ బిడ్డలమని, తెలంగాణ ఆత్మగౌరవ బావుటాను హిమాలయాలంత ఎత్తు ఎగరేశారు. తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, నాగర్ కర్నూల్ అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్థన్, కొత్తగూడెం పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు లాంటివారు మన రాజకీయాలకు కావాలి. జాతి, దేశ గౌరవాన్ని కాపాడారు. అంగట్లో పశువుల్లాగా అమ్ముడుపోకుండా రూ.వంద కోట్లిచ్చినా గడ్డిపోచగా విసిరికొట్టారు.’’ అని కేసీఆర్ అన్నారు.
CM KCR in Munugode: చండూరుకు చేరుకున్న సీఎం కేసీఆర్
మునుగోడు నియోజకవర్గం చండూరు మండలం బంగారిగడ్డలో టీఆర్‌ఎస్ పార్టీ నిర్వహిస్తున్న బహిరంగ సభా వేదిక వద్దకు సీఎం కేసీఆర్ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో కేసీఆర్ బంగారిగడ్డకు చేరుకున్నారు. కేసీఆర్ వెంట ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు కూడా ఉన్నారు.
రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టు బాగోతం కాంగ్రెస్ బట్టబయలు
ఆధారాలతో సహా బహిర్గతం చేసిన కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మీ, కుమారుడు సంకీర్త రెడ్డి వాటాలున్న కంపనీకి భారీగా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కాంట్రాక్టులు ఇచ్చిందని ఆరోపించారు. రాజగోపాల్ రెడ్డికి చెందిన సుశి సంస్థతో బీజేపీ క్విడ్-ప్రోకో డీల్ కుదుర్చుకుoది. ఝార్ఖండ్ లో ఉన్న Chandragupt బొగ్గు గనులను రాసిచ్చింది.
ఒప్పoద ప్రక్రియ జాప్యాన్ని గ్రహించిన రాజగోపాల్ రెడ్డి, బీజేపీని సంప్రదించి 2022న తుది ఒప్పoదం చేసుకున్నారు. మీడియా సమావేశంలో ఈ విషయాన్ని బహిరంగ పరిచిన కాంగ్రెస్ నేతలు మధుయాష్కీ, పొన్నం తదితరులు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

