IND Vs NZ First Semi-Final Score Updates: వరల్డ్ కప్ ఫైనల్ చేరిన టీమిండియా, కివీస్ పై 70 రన్స్ తేడాతో ఘన విజయం
IND Vs NZ First Semi Final In World Cup 2023: టీమిండియా, న్యూజిలాండ్ మ్యాచ్‌కు సంబంధించిన స్కోర్ లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజ్‌ను రిఫ్రెష్ చేస్తూ ఉండండి.
LIVE
Background
IND Vs NZ First Semi-Final Score Updates : ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023(ODI World Cup 2023)లో భాగంగా ముంబై(Mumbai)లోని వాంఖడే(Wankhede) స్టేడియంలో భారత్(Team India ), న్యూజిలాండ్(New Zealand) జట్ల మధ్య తొలి సెమీఫైనల్ మ్యాచ్(First Semi Final Match) జరగనుంది. కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లీ(Virat Kohli), శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer), జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah), మహ్మద్ షమీ (Mohammed Shami) అద్భుత ప్రదర్శనతో లీగ్ దశలో భారత్ నంబర్ వన్ స్థానానికి చేరుకుంది. ఇప్పుడు ఈ ఐదుగురు ఆటగాళ్లు మరో గొప్ప ప్రదర్శన చేసి ఫైనల్‌కు దూసుకెళ్లే వ్యూహంతో టీమిండియా ఉంది. కివీస్‌ను మరోసారి మట్టి కరిపించి టైటిల్‌కు మరో మెట్టు దగ్గరగా చేరుకోవాలనుకుంటోంది.
రోహిత్ శర్మ: ఈ ప్రపంచకప్ లో కెప్టెన్ ముందు ఎలా పోరాడాలో రోహిత్ శర్మ చూపించాడు. రోహిత్ శర్మ ఓపెనింగ్ ఆటతో లీగ్ దశలో పెద్ద జట్లపై భారత్ సునాయాసంగా విజయం సాధించింది. ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ ఇప్పటి వరకు 55.85 సగటు, 121.50 స్ట్రైక్ రేట్‌తో 503 పరుగులు చేశాడు. ఈ ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ అత్యధికంగా 24 సిక్సర్లు కొట్టాడు.
టీమిండీయాలో ఈ ఆటగాళ్లే కీలకం
విరాట్ కోహ్లీ: ఈ ప్రపంచకప్‌లో భారత్ మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికుల హృదయాలను విరాట్ కోహ్లీ గెలుచుకున్నాడు. ప్రపంచకప్‌లో 49వ సెంచరీ సాధించి సచిన్ టెండూల్కర్ రికార్డును విరాట్ కోహ్లీ సమం చేశాడు. విరాట్ కోహ్లీ 9 మ్యాచ్‌ల్లో 7 ఇన్నింగ్స్‌లలో 50కి పైగా పరుగులు చేశాడు. ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ 99.00 సగటుతో 594 పరుగులు చేశాడు.
శ్రేయస్ అయ్యర్: అయ్యర్ ఆశించిన విధంగా టోర్నమెంట్‌ను స్టార్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు అయ్యర్ ఫామ్‌లోకి వచ్చి భారత్‌కు నాలుగో నంబర్ సమస్యను పరిష్కరించాడు. గత మూడు ఇన్నింగ్స్‌లలో అయ్యర్ ప్రతిసారీ 70కి పైగా పరుగులు చేశాడు. ప్రపంచకప్‌లో అయ్యర్ 421 పరుగులు చేశాడు.
జస్ప్రీత్ బుమ్రా: టీమ్ఇండియాకు వరల్డ్ కప్‌లో అతిపెద్ద ఆటగాడిగా నిరూపించుకుంటున్న ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అది జస్ప్రీత్ బుమ్రా. గాయం కారణంగా ఏడాది పాటు జట్టుకు దూరమైన తర్వాత కూడా బుమ్రా తనకు పోటీ లేదని ప్రపంచకప్ వేదికపై నిరూపించాడు. ప్రపంచకప్‌లో బుమ్రా అత్యధిక డాట్ బాల్స్ వేయడమే కాకుండా 17 వికెట్లు పడగొట్టాడు.
మహ్మద్ షమీ: లీగ్ దశలో తొలి నాలుగు మ్యాచుల్లో షమీకి టీమిండియా ఆడే అవకాశం ఇవ్వలేదు. కానీ షమీకి అవకాశం వచ్చినప్పుడు తనను పక్కన పెట్టి చేసిన తప్పును యాజమాన్యానికి తెలియజేశాడు. తొలి మ్యాచ్‌లోనే షమీ 5 వికెట్లు పడగొట్టాడు. తర్వాతి మ్యాచ్‌లో షమీ 4 వికెట్లు తీయగా, మరుసటి మ్యాచ్ లో షమీ మళ్లీ 5 వికెట్లు తీశాడు. షమీ 5 మ్యాచుల్లో 16 వికెట్లు పడగొట్టడంతో ప్రత్యర్థి జట్టు బ్యాట్స్‌మెన్‌ను కకావికలం చేశాడు.
పేసర్ మహ్మద్ షమీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్
కీలకమైన నాకౌట్ మ్యాచ్ లో పేసర్ మహ్మద్ షమీ భారత బౌలింగ్ ను నడిపించాడు. మ్యాచ్ చేజారిపోతుందనిపించగా షమీ వరుస విరామాల్లో వికెట్లు తీశాడు. 9.5 ఓవర్లలో 57 రన్స్ ఇచ్చి 7 వికెట్లు తీసిన షమీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది. షమీ దెబ్బకు 398 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన కివీస్ 327 పరుగులకే ఆలౌటైంది. దాంతో 2019 వరల్డ్ కప్ సెమీస్ ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకున్నట్లయింది.
వరల్డ్ కప్ ఫైనల్ చేరిన టీమిండియా, కివీస్ పై 70 రన్స్ తేడాతో ఘన విజయం
టీమిండియా వరల్డ్ కప్ ఫైనల్ చేరింది. తొలి సెమీఫైనల్లో కివీస్ పై రోహిత్ సేన 70 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది.
న్యూజిలాండ్ టార్గెట్ 398 పరుగులు కాగా, 48.5 ఓవర్లలో 327 పరుగులకే కివీస్ ఆలౌటైంది. 1983, 2003, 2011 తరువాత మరోసారి భారత క్రికెట్ టీమ్ వన్డే వరల్డ్ కప్ ఫైనల్లోకి ప్రవేశించింది.
8వ వికెట్ కోల్పోయిన కివీస్, శాంట్నర్ ఔట్
సిరాజ్ వేసిన 48వ ఓవర్లో శాంట్నర్ ఔటయ్యాడు. రోహిత్ క్యాచ్ పట్టడంతో శాంట్నర్ పెవిలియన్ బాట పట్టాడు.
7వ వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్
న్యూజిలాండ్ టార్గెట్ 398 పరుగులు కాగా, 47వ ఓవర్లో 5 పరుగులు వచ్చాయి. కివీస్ 7 వికెట్ల నష్టానికి 313 పరుగులు చేసింది. శాంట్నర్ 8, సౌథీ 4 రన్స్ తో ఉన్నారు.
5వ వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్
5వ వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్. ఫిలిప్స్ 41 ఔట్ చేసిన బుమ్రా. ఆల్ రౌండర్ జడేజా పట్టిన క్యాచ్ తో కివీస్ 5వ వికెట్ కోల్పోయి మ్యాచ్ భారత్ చేతిలోకి వచ్చింది.