![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Horoscope Today 22 August 2022: ఈ రాశులవారు ఖర్చులు నియంత్రించకపోతే ఇబ్బంది పడతారు, ఆగస్టు 22 రాశిఫలాలు
Horoscope 22nd August : ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు
![Horoscope Today 22 August 2022: ఈ రాశులవారు ఖర్చులు నియంత్రించకపోతే ఇబ్బంది పడతారు, ఆగస్టు 22 రాశిఫలాలు Horoscope Today 22 August 2022 Horoscope 22 August 2022 Rasi Phalalu astrological prediction for Gemini, Leo, Capricorn, Libra and Other Zodiac Signs Horoscope Today 22 August 2022: ఈ రాశులవారు ఖర్చులు నియంత్రించకపోతే ఇబ్బంది పడతారు, ఆగస్టు 22 రాశిఫలాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/21/f9cc3b0c5509e19cee85c0cd98a08ea61661095885700217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Horoscope Today 22nd August 2022
మేషం
ఏదో తెలియని టెన్షన్ మిమ్మల్ని వెంటాడుతుంది. మరో ఉద్యోగ అవకాశం మీకు వస్తుంది కానీ ప్రస్తుతం పాత దాంట్లోనే కొనసాగడం మంచిది. స్నేహితులతో సంతోష సమయం గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మునుపటి కన్నా మెరుగ్గా ఉంటుంది. పిల్లల కెరీర్లో వచ్చే సమస్యలు మీ ఆందోళనకు కారణమవుతాయి. బాధ్యతల నుంచి తప్పించుకోవద్దు.
వృషభం
ఈ రోజంతా మీరు ఉత్సాహంగా ఉంటారు. ఏ పనైనా చేసేందుకు ఉత్సాహం చూపిస్తారు. అయితే మీ పని కన్నా ఇతరుల వ్యవహారాలపై ఎక్కువ దృష్టి సారిస్తారు..ఇలా చేయడం మీకు అంత మంచిది కాదు.ఆర్థిక పరిస్థితి అస్థిరంగా ఉంటుంది. అనవసర ఖర్చులను పరిగణలోకి తీసుకోండి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలంటే మీ మాటతీరు మార్చుకోవాలి.
మిథునం
ఈ రోజు మీ ఖర్చులు పెరుగుతాయి. మీరు పనిచేసే రంగంలో మంచి విజయాన్ని సాధిస్తారు. పెరుగుతున్న ఖర్చులు మీకు సమస్యగా మారుతాయి. పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కుటుంబంలో ఒకరి భవిష్యత్ కి సంబంధించి నిర్ణయం తీసుకునేముందు వారి అభిప్రాయం కూడా పరిగణలోకి తీసుకోండి. అప్పులు ఇచ్చే ప్రయత్నం అస్సలు చేయొద్దు. రాజకీయాల్లో ఉన్నవారికి మంచి సమయం.
కర్కాటకం
ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. కోర్టుకు సంబంధించిన వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు విజయం సాధిస్తారు. విదేశాల్లో చదువుకోవాలి అనుకునేవారికి ఇదే మంచి సమయం. కొన్ని విషయాల్లో మీ అజాగ్రత్త వల్ల అది పెద్ద ఇబ్బందులకు దారితీస్తుంది. చిన్నదా పెద్దదా అన్నది అనవసరం..భవిష్యత్ కోసం పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం..
Also Read: ఒక్కో గ్రహ దోషానికి ఒక్కో గణపయ్య, మీరు ఇంట్లో ఎలాంటి వినాయకుడు ఉన్నాడు!
సింహం
ఈ రోజు మీరు మీ స్నేహితులు, బంధువులతో ఏదో ఒక విషయంలో అనవసర డిస్కషన్లో చిక్కుకోవచ్చు. కుటుంబంలో ఆధ్యాత్మిక కార్యక్రమం ఏదైనా నిర్వహిస్తారు. పిల్లల వైపు నుంచి కొంత మానసిక ఒత్తిడిని కలిగి ఉంటారు. ప్రణాళికలను జాగ్రత్తగా పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.. లేకుంటే అదే పెద్ద వ్యాధికి దారితీసే అవకాశం ఉంది.
కన్య
ఈ రోజు మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మంచి సంపాదనా అవకాశం పొందుతారు. ఉద్యోగంతో పాటూ పార్ట్ టైం వర్క్ కూడా చేస్తారు. వ్యాపారం చేసేవారు ఎవ్వర్నీ గుడ్డిగా నమ్మేయకండి. ప్రతికూల ఆలోచనలు మనసులోంచి తీసెయ్యడం మంచిది. తల్లినుంచి ప్రేమను పొందుతారు. మీకు మీ కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు ఉంటుంది.
తులా
ఈ రోజు విద్యార్థులకు మంచి రోజు...అవసరం లేని విషయాలన్నీ పక్కనపెట్టేసి వారి చదువుపై దృష్టిసారిస్తారు కానీ మనస్సులో కుటుంబం గురించి ఆందోళన చెందుతారు. ప్రేమికులకు టెన్షన్ పెరుగుతుంది. ఉద్యోగులు కార్యాలయంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.
వృశ్చికం
ఈ రోజు మీరు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాల్సిన రోజు. వ్యాపారంలో లావాదేవీలను చాలా జాగ్రత్తగా జరిగేలా చూడాలి. పాత స్నేహితులతో మీ సమస్య గురించి చర్చిస్తారు. ఆగిపోయిన కొన్ని ప్రణాళికలను మళ్లీ పట్టాలెక్కిస్తారు. గతంలో కన్నా మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది.
Also Read: ఈ అమ్మవారికి కుంకుమ పెట్టి ఏదైనా కోరుకుంటే 41 రోజుల్లో నెరవేరతుందట
ధనస్సు
ఈ రోజంతా మీరు సంతోషంగా ఉంటారు. ఏదో కొత్త శక్తి మిమ్మల్ని ఆవహిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో అద్భుతమైన సమయాన్ని గడుపుతారు. ఉద్యోగులు, వ్యాపారులు మీ నిర్ణయాలు మీరు తీసుకోండి. తల్లిదండ్రులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.
మకరం
ఈ రోజు మీకు ఖచ్చితంగా ఫలవంతంగా ఉంటుంది. వ్యాపారం చేసే వ్యక్తులకు ఈ రోజు మంచిది...ఆదాయాన్ని పెంచుకోవడానికి కొన్ని కొత్త పద్ధతులపై దృష్టి పెడతారు. ప్రేమ సంబంధాలు అంతగా కలసిరావు. మీ భాగస్వామితో ఓ విషయంపై వాదిస్తారు. ఉద్యోగులు తమ మాటతీరుతో జూనియర్లతో బాగా పనిచేయించగలుగుతారు. అనవసర ఖర్చులను తగ్గించుకోవాలి.
కుంభం
ఈ రోజు మీ గౌరవం పెరుగుతుంది. వ్యాపారంలో లాభదాయక పరిస్థితులు ఉంటాయి. ఇతర ఆదాయ వనరులను కూడా పొందవచ్చు. వివాదాల్లో చిక్కుకున్న వాటినుంచి బయటపడేందుకు స్నేహితుడి సహాయం తీసుకుంటారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. భాగస్వామ్య వ్యాపారం కలిసొస్తుంది.
మీనం
ఈ రోజు మీకు మిశ్రమ రోజుగా ఉంటుంది. మీరు మీ కుటుంబ సభ్యులపై పూర్తి శ్రద్ధ పెడతారు..వారి చిన్న చిన్న అవసరాలను కూడా చూసుకుంటారు. విద్యార్థులు చదువుపై ఏకాగ్రత పెట్టలా. కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగులు, వ్యాపారులకు పెద్దగా మార్పులుండవు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)