Spirituality : ఒక్కో గ్రహ దోషానికి ఒక్కో గణపయ్య, మీరు ఇంట్లో ఎలాంటి వినాయకుడు ఉన్నాడు!
ఆదిదంపతుల తనయుడైన గణనాథుడిని పూజిస్తే...తలపెట్టిన కార్యం ఏదైనా విఘ్నాలు లేకుండా పూర్తవుతుందని భక్తుల విశ్వాసం. అయితే ఒక్కో గ్రహం దోషాన్ని నివారించేందుకు ఒక్కో గణపతిని పూజిస్తారని మీకు తెలుసా...
విఘ్నాధిపతి అయిన వినాయకుడిని పూజిస్తే తలపెట్టిన పనిలో ఎలాంటి అడ్డంకులు ఉండవంటారు పండితులు. కేవలం విజయం కోసం మాత్రమే కాదు గ్రహదోష నివారణకు కూడా గణపయ్యను పూజించడం కూడా ఓ పరిష్కారం అని చెబుతారు. అయితే అనారోగ్య సమస్యలన్నింటికీ మందు ఒక్కటే ఉండదు కదా..అలాగే మీకున్న గ్రహదోషాన్ని బట్టి గణనాథుడిని ఆరాధించాలి. నవగ్రహాల్లో ఏ గ్రహ దోషం ఉన్నా కింద పేర్కొన్న విధంగా వినాయకుడిని ఆరాధిస్తే ఆ ప్రభావం తగ్గుతుంది.
- సూర్యదోష నివారణకు ఎర్రచందనంతో చేసిన గణపతిని పూజించాలి
- చంద్ర దోష నివారణకు వెండి లేక పాలరాయితో చేసిన వినాయకుడిని పూజించాలి
- కుజదోష నివారణకు రాగితో చేసిన వినాయకుడిని పూజిస్తే ఫలితం ఉంటుంది
- బుధ దోష నివారణకు మరకత గణపతిని అర్చించాలి
- గురు దోష నివారణకు పసుపు,చందనం లేదా బంగారంతో చేసిన గణపతిని కొలవాలి
- శుక్ర దోష నివారణకు స్ఫటిక గణపతికి ఆరాధించాలి
- శని దోష నివారణకు నల్లరాయిపై చెక్కిన గణపతిని పూజించాలి
- రాహు గ్రహ దోషానికి మట్టితో చేసిన గణపతిని పుజిస్తే ఫలితం ఉంటుంది
- కేతు గ్రహ దోష నివారణకు తెల్ల జిల్లేడుతో చేసిన గణపతిని పూజించాలి
- ఎర్రచందనంతో చేసిన గణపతిని పూజించడం వల్ల అనారోగ్య సమస్యలు ఉండవు
- పగడపు గణపతిని పూజించడం వల్ల అప్పుల బాధలు తొలగిపోతాయి
- పాలరాయితో చేసిన గణపతిని పూజిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది
- సమస్యలు తొలగిపోవాలంటే శ్వేతార్క గణపతిని పూజించాలి
- స్ఫటిక గణపతిని పూజిస్తే సుఖశాంతులను ప్రసాదిస్తాడు
Also Read: రాహు మహర్ధశ ప్రభావాన్ని తగ్గించే ఆలయం
గణేశ ద్వాదశనామ స్తోత్రమ్
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ |
ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వవిఘ్నోపశాంతయేః || 1 ||
అభీప్సితార్థ సిధ్యర్థం పూజితో యః సురాసురైః |
సర్వవిఘ్నహరస్తస్మై గణాధిపతయే నమః || 2 ||
గణానామధిపశ్చండో గజవక్త్రస్త్రిలోచనః |
ప్రసన్నో భవ మే నిత్యం వరదాతర్వినాయక || 3 ||
సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః |
లంబోదరశ్చ వికటో విఘ్ననాశో వినాయకః || 4 ||
ధూమ్రకేతుర్గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః |
ద్వాదశైతాని నామాని గణేశస్య తు యః పఠేత్ || 5 ||
విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ విపులం ధనమ్ |
ఇష్టకామం తు కామార్థీ ధర్మార్థీ మోక్షమక్షయమ్ || 6 ||
విధ్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా |
సంగ్రామే సంకటే చైవ విఘ్నస్తస్య న జాయతే || 7 ||
|| ఇతి ముద్గలపురాణోక్తం శ్రీగణేశద్వాదశనామస్తోత్రం సంపూర్ణమ్ ||
Also Read: ఈ అమ్మవారికి కుంకుమ పెట్టి ఏదైనా కోరుకుంటే 41 రోజుల్లో నెరవేరతుందట