అన్వేషించండి

Gauri Vrat 2022 Puja Vidhi: శ్రావణమాసంలోనే కాదు ఆషాడ మాసంలోనూ ఆ ఐదు రోజులూ గౌరీ పూజ చేస్తారు

జూన్ 30న ప్రారంభమైన ఆషాడం జులై 28 వరకు ఉంటుంది. సాధారణంగా ఆషాడాన్ని శూన్య మాసం అంటారు. అందుకే ఎలాంటి శుభకార్యాలు తలపెట్టరు. కానీ ఈ నెలలో ఎన్నో పండుగలు, వ్రతాలున్నాయి. గౌరీ వ్రతం కూడా ఈ నెలలోనే....

జూలై 9 గౌరీ వ్రతం ప్రారంభం
గౌరీ వ్రతం అనేది పార్వతీ దేవికి అంకితం చేసిన ఉపవాస వ్రతం. ఆషాడ మాసంలో గౌరీవ్రతాన్ని ఐదు రోజుల పాటూ నిర్వహిస్తారు. మంచి భర్త రావాలంటూ ఆడపిల్లలు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ ఉత్సవాలు ఆషాఢ ఏకాదశి తిథి రాగానే ప్రారంభమై ఆషాడ పూర్ణిమతో ముగుస్తాయి. అంటే ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్థశి, పౌర్ణమి..ఈ ఐదు రోజులు వ్రతం సాగుతుంది. గౌరీ వ్రతాన్ని అమ్మాయిలు మాత్రమే కాదు వివాహిత స్త్రీలు కూడా చేసుకోవచ్చు. 

ఈ ఏడాది ఏకాదశి తిథి  - జులై 09, 2022 సాయంత్రం 04:39 గంటల నుంచి జులై 10, 2022 మధ్యాహ్నం 02:13 గంటల వరకు 
గౌరీ వ్రతాన్ని గుజరాత్ రాష్ట్రంలో ఘనంగా జరుపుకుంటారు. జులై 9న ప్రారంభమయ్యే గౌరీ వ్రతం జులై 13న ముగుస్తుంది. 

Also Read: పుట్టింట్లో అవమానాన్ని భరించలేక అగ్నిలో దూకిన పార్వతి, పరమేశ్వరుడు ఏం చేశాడంటే

గౌరీ వ్రతాన్ని ఎందుకు ఆచరించాలి
అనుకూలమైన జీవిత భాగస్వామిని ఇమ్మని అమ్మను కోరుతూ అవివాహిత స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. పార్వతీ దేవి శివుడిని పెళ్లిచేసుకునేందుకు తీవ్రమైన తపస్సు చేసింది. అందుకే పార్వతీదేవిని తలుచుకుంటూ గౌరీ వ్రతం చేసిన ఆడపిల్లలకు అర్థనారీశ్వరుడి లాంటి భర్త లభిస్తాడని విశ్వాసం.

గౌరీ వ్రతం ఎలా జరుపుకోవాలి
వ్రతం ఆచరణ ఐదు రోజులే అయినప్పటికీ కొందరు మహిళలు 7 నుంచి 9 రోజుల పాటూ నిత్యం ఉపవాసం ఉంటారు. గోధుమలు, పాలు, ఆవునెయ్యితో తయారు చేసిన ప్రసాదం స్వీకరిస్తారు. వ్రతం చేసేవారు మొదటి రోజు మట్టికుండలో గోధుమ గింజలు విత్తుతారు. వ్రతం చివరి రోజు రాత్రంతా జాగరణ చేసి అమ్మవారి సేవలో తరిస్తారు. వ్రతం ఆచరించిన అన్ని రోజులూ గోధుమ గింజలకు నీళ్లు పోస్తారు. వ్రతం  పూర్తయ్యేసరికి అవి మొలకెత్తుతాయి. అప్పుడు తమ ఉపవాశాన్ని విరమిస్తారు.

Also Read: అమ్మవారి శరీరంలో 18 భాగాలు పడిన ప్రదేశాలివే, ఒక్కటి దర్శించుకున్నా పుణ్యమే

అర్థనారీశ్వర అష్టకం (ఉపమన్యు కృతం) ardhanareeswara ashtakam

అంభోధరశ్యామలకున్తలాయై
తటిత్ప్రభాతామ్రజటాధరాయ ।
నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ
నమః శివాయై చ నమః శివాయ ॥ 

ప్రదీప్తరత్నోజ్వలకుణ్డలాయై
స్ఫురన్మహాపన్నగభూషణాయ ।
శివప్రియాయై చ శివప్రియాయ
నమః శివాయై చ నమః శివాయ ॥ 

మన్దారమాలాకలితాలకాయై
కపాలమాలాఙ్కితకన్ధరాయై ।
దివ్యామ్బరాయై చ దిగమ్బరాయ
నమః శివాయై చ నమః శివాయ ॥

కస్తూరికాకుఙ్కుమలేపనాయై
శ్మశానభస్మాత్తవిలేపనాయ ।
కృతస్మరాయై వికృతస్మరాయ
నమః శివాయై చ నమః శివాయ ॥ 

పాదారవిన్దార్పితహంసకాయై
పాదాబ్జరాజత్ఫణినూపురాయ ।
కలామయాయై వికలామయాయ
నమః శివాయై చ నమః శివాయ ॥ 

ప్రపఞ్చసృష్ట్యున్ముఖలాస్యకాయై
సమస్తసంహారకతాణ్డవాయ ।
సమేక్షణాయై విషమేక్షణాయ
నమః శివాయై చ నమః శివాయ ॥

ప్రఫుల్లనీలోత్పలలోచనాయై
వికాసపఙ్కేరుహలోచనాయ ।
జగజ్జనన్యై జగదేకపిత్రే
నమః శివాయై చ నమః శివాయ ॥ 

అన్తర్బహిశ్చోర్ధ్వమధశ్చ మధ్యే
పురశ్చ పశ్చాచ్చ విదిక్షు దిక్షు ।
సర్వం గతాయై సకలం గతాయ
నమః శివాయై చ నమః శివాయ ॥ 

అర్ధనారీశ్వరస్తోత్రం ఉపమన్యుకృతం త్విదమ్ ।
యః పఠేచ్ఛృణుయాద్వాపి శివలోకే మహీయతే ॥ 

॥ ఇతి ఉపమన్యుకృతం అర్ధనారీశ్వరాష్టకమ్ ॥

Also Read: ఏడు జన్మలకు గుర్తుగా ఏడు ద్వారాలు, అజ్ఞానాన్ని పోగొట్టి ముక్తిని ప్రదర్శించే శక్తి స్వరూపం

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh: ఏపీ ప్రజలకు శుభవార్త- రైతుబజార్లలో తక్కువ ధరలకే కందిపప్పు, బియ్యం విక్రయం: నాదెండ్ల మనోహర్
ఏపీ ప్రజలకు శుభవార్త- రైతుబజార్లలో తక్కువ ధరలకే కందిపప్పు, బియ్యం విక్రయం: నాదెండ్ల మనోహర్
Siddharth: ఆ కండోమ్ యాడ్ నాదే, మాకు అలా చేయమని ఏ సీఎం చెప్పలేదు - హీరో సిద్ధార్థ్ సీరియస్
ఆ కండోమ్ యాడ్ నాదే, మాకు అలా చేయమని ఏ సీఎం చెప్పలేదు - హీరో సిద్ధార్థ్ సీరియస్
TGPSC JL Results: టీజీపీఎస్సీ 'జేఎల్' పరీక్ష ఫలితాలు విడుదల, సబ్జెక్టులవారీగా జనరల్ ర్యాంకింగ్ జాబితాలు ఇలా
టీజీపీఎస్సీ 'జేఎల్' పరీక్ష ఫలితాలు విడుదల, సబ్జెక్టులవారీగా జనరల్ ర్యాంకింగ్ జాబితాలు ఇలా
Pawan Kalyan: పిఠాపురం నుంచే ప్రయోగాత్మకంగా అమలు - డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
పిఠాపురం నుంచే ప్రయోగాత్మకంగా అమలు - డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Korean Actor Ma Dong-seok with Prabhas in Spirit Movie |Sandeep Reddy vanga ఏం ప్లాన్ చేస్తున్నాడో.!Abhishek Sharma's Maiden T20I Century | మ్యాచ్ ఏదైనా కొట్టుడు ఆపని అభిషేక్ శర్మ | ABP DesamBobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh: ఏపీ ప్రజలకు శుభవార్త- రైతుబజార్లలో తక్కువ ధరలకే కందిపప్పు, బియ్యం విక్రయం: నాదెండ్ల మనోహర్
ఏపీ ప్రజలకు శుభవార్త- రైతుబజార్లలో తక్కువ ధరలకే కందిపప్పు, బియ్యం విక్రయం: నాదెండ్ల మనోహర్
Siddharth: ఆ కండోమ్ యాడ్ నాదే, మాకు అలా చేయమని ఏ సీఎం చెప్పలేదు - హీరో సిద్ధార్థ్ సీరియస్
ఆ కండోమ్ యాడ్ నాదే, మాకు అలా చేయమని ఏ సీఎం చెప్పలేదు - హీరో సిద్ధార్థ్ సీరియస్
TGPSC JL Results: టీజీపీఎస్సీ 'జేఎల్' పరీక్ష ఫలితాలు విడుదల, సబ్జెక్టులవారీగా జనరల్ ర్యాంకింగ్ జాబితాలు ఇలా
టీజీపీఎస్సీ 'జేఎల్' పరీక్ష ఫలితాలు విడుదల, సబ్జెక్టులవారీగా జనరల్ ర్యాంకింగ్ జాబితాలు ఇలా
Pawan Kalyan: పిఠాపురం నుంచే ప్రయోగాత్మకంగా అమలు - డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
పిఠాపురం నుంచే ప్రయోగాత్మకంగా అమలు - డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
Terrorist Attack: జమ్మూ కాశ్మీర్‌లో ఆర్మీ కాన్వాయ్ లక్ష్యంగా ఉగ్రదాడి, నలుగురు జవాన్లు మృతి
జమ్మూ కాశ్మీర్‌లో ఆర్మీ కాన్వాయ్ లక్ష్యంగా ఉగ్రదాడి, నలుగురు జవాన్లు మృతి
Anakapally Police: అనకాపల్లి బాలిక హత్య నిందితుడిపై పోలీసుల రివార్డ్! ఆచూకీ చెప్తే నగదు బహుమతి
అనకాపల్లి బాలిక హత్య నిందితుడిపై పోలీసుల రివార్డ్! ఆచూకీ చెప్తే నగదు బహుమతి
Spirit Movie: ‘స్పిరిట్’లో విలన్‌ ఫిక్స్ - ప్రభాస్‌తో తలపడనున్న కొరియన్ స్టార్ హీరో
‘స్పిరిట్’లో విలన్‌ ఫిక్స్ - ప్రభాస్‌తో తలపడనున్న కొరియన్ స్టార్ హీరో
Trains Diverted: ప్రయాణికులకు బిగ్ అలర్ట్ - ఆ తేదీల్లో ఈ రైళ్లు విజయవాడకు రాకుండా దారి మళ్లింపు
ప్రయాణికులకు బిగ్ అలర్ట్ - ఆ తేదీల్లో ఈ రైళ్లు విజయవాడకు రాకుండా దారి మళ్లింపు
Embed widget