CID ACP Pradyuman: 'CID' ACP 'ప్రద్యుమన్' రోల్‌కు ఎండ్ కార్డ్ - షాక్‌లో ఫ్యాన్స్.. ఆ ఫోటోతో ఎంత పొరపాటు జరిగిందో తెలుసా?
CID Web Series: ఫేమస్ క్రైమ్ థ్రిల్లర్ టీవీ షో 'సీఐడీ'లో ఏసీపీ ప్రద్యుమన్ రోల్‌కు ఎండ్ కార్డ్ పడింది. ఈ విషయాన్ని సోనీ టీవీ అధికారికంగా ధ్రువీకరించింది. దీంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.

ACP Pradyuman Role Ends In CID Web Series: ఏసీపీ ప్రద్యుమన్ (ACP Pradyuman).. ఈ పేరు వింటేనే ప్రేక్షకుల మదిలో గుర్తొచ్చేది ఫేమస్ క్రైమ్ థ్రిల్లర్ షో 'సీఐడీ'. 1998లో ప్రారంభమైన ఈ టీవీ షో 2018 వరకూ మొత్తం 1,547 ఎపిసోడ్స్ ఏకధాటిగా ప్రసారమై మంచి థ్రిల్లింగ్ పంచింది. దీనికి కొనసాగింపుగా కొద్ది నెలల క్రితమే 'సీఐడీ 2' కూడా ప్రారంభమైంది.
ఆ రోల్‌కు ఎండ్ కార్డ్
ఈ షోలో ప్రధాన పాత్ర ఏసీపీ ప్రద్యుమన్‌కు ఎండ్ కార్డ్ పడింది. ఈ రోల్‌లో ప్రముఖ నటుడు శివాజీ సతమ్ (Shivaji Satam) అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. తాజా ఎపిసోడ్‌లో డేంజరస్ క్రిమినల్ బార్బోజా (టిగ్మాన్షు ధులియా)ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు చూపించారు. అతను ACPని తన వలలో బంధించి పేలుడులో చంపినట్లుగా తెలుస్తోంది. దీంతో ప్రద్యుమన్ చనిపోయారా? అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు తలెత్తాయి.
ధ్రువీకరించిన సోనీ టీవీ
షోలో ఏసీపీ ప్రద్యుమన్ చనిపోతారంటూ వస్తోన్న వార్తలపై సోనీ టీవీ స్పష్టత ఇచ్చింది. ఆయన రోల్ ముగిసినట్లే అంటూ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేసింది. 'ACP ప్రద్యుమన్ ప్రేమపూర్వక జ్ఞాపకార్థం.. ఎప్పటికీ మరిచిపోలేని నష్టం.' అంటూ ట్వీట్ చేయడంతో ఆ రోల్‌కు ఎండ్ కార్డ్ పడినట్లేనని స్పష్టం అయ్యింది. అంతే కాకుండా 'ఒక యుగం ముగింపు. ACP ప్రద్యుమన్ (1998 - 2025)' అంటూ ఫోటో షేర్ చేసింది.
In the loving memory of ACP Pradyuman… A loss that will never be forgotten 💔#CIDReturns #RIPACP #CID2 #SonyTV pic.twitter.com/VqJMw4k7uH
— sonytv (@SonyTV) April 5, 2025
ఫ్యాన్స్ ఆగ్రహం
దీనిపై సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రోల్ ఎంతో ఫేమస్ అని.. మంచి ఏసీపీ సార్‌కు ఇలా చేయడం ఏంటంటూ కామెంట్స్ చేస్తున్నారు. 'ఈ పోస్ట్ నిజంగా మా హృదయాలను విచ్ఛిన్నం చేసింది.' అని ఒకరు 'ఇది ఏసీపీ ప్రద్యుమన్‌కు రిప్ కాదు. సీఐడీకి RIP' అంటూ మరొకరు కామెంట్ చేశారు. మీరు ఓ వారసత్వాన్నే సమాధి చేశారంటూ తీవ్ర ఆగ్రహంతో తమ ఆక్రోశాన్ని ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్లు తెలిపారు.
కొత్త సీజన్ ఇప్పుడే ప్రారంభమైందని అతని రోల్ ఎందుకు చంపుతారని చాలా మంది ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. 'మీరు ఏసీపీ ప్రద్యుమన్‌ను ఎందుకు చంపుతారు. అది కేవలం ఒక రోల్ కాదు. మన జీవితాల్లో ఒక భాగం.' అంటూ ఎమోషనల్ పోస్టులు పెడుతున్నారు.
Also Read: విజయ్ దేవరకొండ 'కింగ్ డమ్' టీజర్‌కు ముగ్గురు స్టార్ హీరోస్ - అసలు స్టోరీ ఏంటో చెప్పిన విజయ్
ఎంత పొరపాటో..?
ఈ షోలో ఏసీపీ ప్రద్యుమన్ పాత్ర ముగిసిందంటూ చిత్రీకరించిన తీరుపై చాలామంది నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పోస్ట్ చూసిన వారు నిజంగా 'శివాజీ సతమ్' చనిపోయారనుకుని చాలా పొరబడ్డారు. అయితే, ఆ రోల్‌కు ముగింపు అని తెలుసుకుని షాక్ అయ్యారు. 'షో నుంచి శివాజీ సర్ వెళ్లిపోవాలనుకున్నా.. అతనికి గౌరవంగా వీడ్కోలు చెప్పేవారు. కానీ ఇలా చేయడం కరెక్ట్ కాదు.' అంటూ కామెంట్స్ చేశారు.
శివాజీ విరామం తీసుకోవాలనుకున్నారా?
'సీఐడీ'లో తన రోల్ ముగుస్తుందంటూ వచ్చిన వార్తలపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో శివాజీ సతం కీలక వ్యాఖ్యలు చేశారు. దాని గురించి తనకు ఏమీ తెలియదని.. తాను కొంత కాలం విరామం తీసుకున్నానని అన్నారు. 'ఈ షోలో ఏం జరుగుతుందో నిర్మాతలకు తెలుసు. నేను ప్రతీదాన్ని నా సొంతంగా తీసుకోవడం నేర్చుకున్నా. నా ట్రాక్ అయిపోయిందో లేదో నాకు చెప్పలేదు.' అని తెలిపారు.
కొత్త ఏసీపీ ఎవరంటే?
ఇక ఏసీపీ ప్రద్యుమన్ రోల్‌కు ఎండ్ కార్డ్ పడిన క్రమంలో ఆయన రోల్ ఎవరు చేస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఓ ప్రముఖ నటుడు కొత్త ఏసీపీగా నటించనున్నట్లు తెలుస్తోంది. మరి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ప్రస్తుతం 'సీఐడీ 2' టీవీ షో ప్రముఖ ఓటీటీ సోనీ లివ్‌తో పాటు నెట్ ఫ్లిక్స్‌లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ షోలో షోలో శివాజీ సతమ్, దయానంద్ శెట్టి, ఆదిత్య శ్రీవాస్తవ తదితరులు ప్రధాన పాత్రలు పోషించగా.. శివాజీ రోల్ ముగిసింది. ఈ షోకు దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉండగా.. ఓ క్రైమ్ కేస్‌ను సీఐడీ ఎంత చాకచక్యంగా సాల్వ్ చేస్తుందో ఇందులో చూపించారు.






















