Sanju Samson Record: వార్న్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ శాంసన్.. అత్యధిక విజయాలు అందించిన సారథిగా ఘనత
రాయల్స్ కెప్టెన్ సంజూ అరుదైన ఘనత సాధించాడు. ఆ జట్టుకు ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా నిలిచాడు. దీంతో ఆసీస్ దిగ్గజ కెప్టెన్ షేన్ వార్న్ రికార్డు కనుమరుగై పోయింది.

IPL 2025 Samson Vs Shane Warne: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ రికార్డులకెక్కాడు. ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన రాయల్స్ కెప్టెన్ గా సంజూ నిలిచాడు. శనివారం పంజాబ్ కింగ్స్ పై 50 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. దీంతో రాయల్స్ కు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్ గా సంజూ నిలిచాడు. సంజూ కెప్టెన్సీలో రాయల్స్ సాధించిన 32వ విజయం తాజాది కావడం విశేషం. 2021 నుంచి కెప్టెన్ గా బాధ్యత వహిస్తున్న సంజూ.. ఇప్పటివరకు రాయల్స్ కు 32 మ్యాచ్ ల్లో విజయం సాధించగా, 29 మ్యాచ్ ల్లో పరాజయం పాలైంది. ఇక సంజూ నాయకత్వంలో 2021లో రన్నరప్ గా నిలిచింది. అలాగే గతేడాది ప్లే ఆఫ్స్ కు కూడా చేరింది. ఇప్పటివరకు ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ షేన్ వార్న్ 31 విజయాలను అందించాడు. తాజాగా పంజాబ్ పై విజయంతో సంజూ ఈ రికార్డును అధిగమించాడు.
Sanju Samson as CAPTAIN has won more matches for Rajasthan Royals than any other players in their history surpassing Shane Warne record 💗
— Sanju Samson Fans Page (@SanjuSamsonFP) April 5, 2025
Our SkippeRR 🫡 pic.twitter.com/WvzNPWYzyc
వరుసగా రెండో విజయం..
ఇక ఈ సీజన్ లో తొలి మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, రెండో మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడిపోయాక, అద్భుతంగా పుంజుకుంది. వరుసగా చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ పై విజయం సాధించింది. ఇక తొలి మూడు మ్యాచ్ లకు కెప్టెన్ గా దూరమైన సంజూ.. పంజాబ్ మ్యాచ్ తో రెగ్యులర్ గా కెప్టెన్ సంజూ కూడా అందుబాటులోకి వచ్చాడు. దీంతో లీగ్ లో ఒకదశలో అట్టడుగు స్థానంలో నిలిచిన పంజాబ్.. తాజాగా ఏడో స్థానానికి ఎగబాకింది.
— Lucknow Super Giants (@LucknowIPL) April 5, 2025
రోహిత్ చెమక్కులు..
మరోవైపు ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ.. తాజాగా మైదానంలో సరదాగా గడిపిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ ముగిశాక మైదానంలో తిరుగుతూ, లక్నో జట్టు యజమాని సంజీవ్ గోయెంకా వద్దకు రోహిత్ వచ్చాడు. అతనితో మాట్లాడుతుండగా, అదే సమయంలో శార్దూల్ ఠాకూర్ వచ్చాడు. అతడిని చూడగానే లార్డ్ ఉండగా మీకు చింత వద్దని నవ్వుతూ చెప్పాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. ఇక శార్దూల్ ను అభిమానులు ముద్దుగా లార్డ్ అని, మ్యాన్ విత్ గోల్డెన్ హేండ్ అని పిలుచుకుంటారనే సంగతి తెలిసిందే.
మరోవైపు ఈ సీజన్లో ముంబై కూడా అంతంతమాత్రంగానే ఆడుతోంది. నాలుగు మ్యాచ్ లాడిన ముంబై.. కేవలం ఒక్క మ్యాచ్ లోనే విజయం సాధించింది. మిగతా మూడు మ్యాచ్ ల్లో ఓడి పాయింట్ల పట్టికలో ఎనిమిదవ స్థానంలో నిలిచింది. గతేడాది అట్టడుగు స్థానంలో ఐపీఎల్ ను ముగించిన ముంబై.. ఈసారి కనీసం ప్లే ఆఫ్స్ కు చేరుకోవాలని భావిస్తోంది.




















