Chris Woakes Single Hand Batting | పంత్ ఇన్నింగ్స్ మర్చిపోక ముందే క్రిస్ వోక్స్ పోరాట స్ఫూర్తి | ABP Desam
క్రిస్ వోక్స్. ఇంగ్లండ్ కు సీనియర్ బౌలర్. ఆల్మోస్ట్ విరాట్ కొహ్లీ అండర్ 19 టైమ్ బ్యాచ్ మేట్ అయిన క్రిస్ వోక్స్ ఇప్పటికీ ఇంగ్లండ్ కు పేస్ బౌలర్ గా సేవలు అందిస్తూనే ఉన్నాడు. ఈ రోజు ఐదో టెస్టులో ఈ 36ఏళ్ల బౌలర్...బ్యాట్ తో చూపించిన తెగువకు ఎవరైనా సలాం కొట్టాల్సిందే. ఐదో టెస్టు మొదటి ఇన్నింగ్స్ జరుగుతున్నప్పుడు వోక్స్ గాయపడ్డాడు. బంతిని బౌండరీకి వెళ్లకుండా ఆపే క్రమంలో డైవ్ చేసిన క్రిస్ వోక్స్ భుజం డిస్ లొకేట్ కావటంతో మొదటి ఇన్నింగ్స్ లో ఇంక బౌలింగ్ చేయలేదు..బ్యాటింగ్ కి కూడా దిగలేదు. సెకండ్ భారత్ ఇన్నింగ్స్ తర్వాత ఇంగ్లండ్ ముందు 374పరుగుల లక్ష్యం ఉంది. బ్రూక్, రూట్ సెంచరీలతో ఈజీగా గెలిచేసేలా కనిపించిన మ్యాచ్ భారత పేసర్లు సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ దుమ్మురేపటంతో ఉత్కంఠభరితంగా మారిపోయింది. ఐదో రోజు గెలవాలంటే 35 పరుగులు చేయాలన్నప్పుడు బరిలోకి దిగిన జేమీ స్మిత్, జోష్ టంగ్, ఓవర్టన్ అవుట్ అయిపోవటంతో వోక్స్ బ్యాటింగ్ కి దిగక తప్పలేదు. భుజం గూడు తప్పిపోవటంతో హ్యాండ్ బెల్ట్ వేసుకున్న క్రిస్ వోక్స్ ఒంటి చేత్తోనే బ్యాటింగ్ చేసేందుకు క్రీజులోకి రావటం అందరినీ కదిలించి వేసింది. అందుకే వోక్స్ కు క్రికెట్ అభిమానుల నుంచి స్టాండింగ్ ఒవేషన్ లభించింది. అట్కిన్సన్ స్ట్రైకింగ్ వోక్స్ కి రాకుండా షాట్లు ప్రయత్నించినా...రన్నింగ్ చేసే సమయంలో భుజం కదులుతూ ఉండటంతో వోక్స్ తీవ్రంగా ఇబ్బంది పడుతూ కనిపించాడు. అయినా కూడా పట్టు వదలకుండా పరిగెట్టాడు. ఒక్క బాల్ కూడా ఫేస్ చేయకపోయినా అసలు చెయ్యి పని చేయని పరిస్థితుల్లో వోక్స్ తన జట్టు ఇంగ్లండ్ కోసం బ్యాటింగ్ కి దిగటం...అందరి మనసులను గెలుచుకుంది.





















