Eng vs Ind Test Series Fifth Day | విజయమో..పరాజయమో...సిరీస్ అంతా పోరాడిన భారత్ | ABP Desam
ఈ రోజు ఇంగ్లండ్, భారత్ ల మధ్య ఐదో టెస్ట్ మ్యాచ్ ఫలితం తేలనుంది. అది కూడా ఐదో రోజే తేలనుంది. జనరల్ గా టీ20 జమానా మొదలయ్యాక...ప్రత్యేకించి ఐపీఎల్ ఊపందుకున్నాక టెస్ట్ క్రికెట్ మీద ఇంట్రెస్ట్ తో పాటు మ్యాచ్ లు ఆడే రోజులు తగ్గిపోయాయి. ఇదివరకూ టెస్ట్ అంటే బ్యాటర్లు, బౌలర్ల ప్రతిభకు వేదికతో పాటు సహనానికి పరీక్షలా ఉండేవి. కానీ ఫాస్ట్ పేస్ జనరేషన్ మొదలయ్యాక..పిచ్ లను హోం గ్రౌండ్ లను తమకు అనూకలంగా మార్చుకునే ఆప్షన్లు పెరిగి రెండు రోజులు మూడు రోజులకే టెస్టులు ముగిసే రోజులు పెరిగాయి. ఇక్కడే మరో విషయం ఏంటంటే మన ఆటగాళ్లు విదేశీ పిచ్ లపై ఆడటానికి వణికిపోవటంతో మ్యాచ్ ల ఫలితాలు కూడా త్వరగానే వచ్చేసేవి. కానీ ఈ సారి లెక్క వేరు. ఇవాళ జరుగుతున్న ఐదో టెస్ట్ కూడా ఐదో రోజే ఫలితం తేలనుంది. గెలుపు ఓటములు పక్కన పెడితే భారత్ ఓ విదేశీ పిచ్ పై ఈ స్థాయిలో పోరాట పటిమను ప్రదర్శించటం గొప్ప విషయం. ఇప్పటికే సిరీస్ లో రెండు టెస్టులు ఇంగ్లండ్ గెలుచుకుంటే...ఓ టెస్టు భారత్ వశమైంది. మరో టెస్టు డ్రా గా ముగిసింది. సో ఇవాళ జరిగే ఐదో టెస్ట్ తో ఫలితం తేలుతుంది. భారత్ సిరీస్ ను డ్రా చేసుకోవటమా...లేదా 1-3 తేడాతో ఇంగ్లండ్ కు కోల్పోవటమా. ఏం జరిగినా కానీ ఐదు టెస్టుల ఫలితాలను ఐదో రోజే తెలిసేలా చేయటం మాత్రం భారత్ సాధించిన ఘనతగా చెప్పుకోవాలి. హౌం గ్రౌండ్ లో బాజ్ బాల్ స్టైల్ ఏంటో చూపించి బిల్డప్పు ఇద్దామనుకున్న ఇంగ్లండ్ ఆట కట్టించింది మన యంగ్ టీమ్ ఇండియా.





















