Joe Root Compliments Siraj | సిరాజ్, పంత్ లపై జో రూట్ ప్రశంసలు | ABP Desam
ఇంగ్లండ్ కు లెజండరీ బ్యాటర్ గా ఎదుగుతున్న జో రూట్ సచిన్ రికార్డులపైనా కన్నేశాడు. ఐదో టెస్టులోనూ సెంచరీ బాదేసి టెస్ట్ కెరీర్ లో 39వ శతకాన్ని కంప్లీట్ చేశాడు. మ్యాచ్ ఫలితాన్ని ఐదో రోజు దాకా తీసుకువెళ్లిన రూట్..బ్రూక్ తో కలిసి టీమిండియా డామినెన్స్ ను కంప్లీట్ గా అడ్డుకున్నాడు. అయితే మ్యాచ్ తర్వాత మీడియాతో మాట్లాడుతూ జో రూట్...మహ్మద్ సిరాజ్ పై ప్రశంసలు కురిపించాడు. ఆడుతున్నంత సేపు సిరాజ్ బంతితో పాటు నోటికి పనిచెప్పటంపై మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన రూట్..సిరాజ్ కోపం అంతా నటన అన్నాడు. తనను తను అగ్రెసివ్ గా ఉంచుకోవటం కోసం అలా వేరే జట్టు ఆటగాళ్లపై అగ్రెషన్ చూపిస్తాడని కానీ అదంతా గ్రౌండ్ లో ఉన్నంత వరకే అన్నాడు రూట్. సిరాజ్ రియల్ వారియర్ అని...కంప్లీట్ ఫిట్నెస్ ప్రతీ మ్యాచ్ ఆడుతూ టీమిండియా టెస్ట్ క్రికెట్ కు తన బౌలింగ్ తో ఎనలేని సేవలను అందిస్తున్నాడని కొనియాడాడు రూట్. సిరాజ్ లాంటి ఆటగాడు తమ టీమ్ లో ఉండాలని ప్రతీ జట్టు కోరుకుంటుందని చెప్పిన రూట్...ఇంగ్లండ్ బౌలర్ క్రిస్ వోక్స్ ను రిషభ్ పంత్ తో పోల్చాడు. ప్రస్తుతం చేతి గాయం కారణంగా కట్టుతో కనిపిస్తున్న క్రిస్ వోక్స్...ఐదో టెస్టులో మిగిలిన 35పరుగులను పూర్తి చేసే క్రమంలో అవసమరైతే బ్యాటింగ్ కి కూడా వస్తాడని చెప్పాడు రూట్. పంత్ ఎలాగైతే కాలు విరిగినా కూడా గ్రౌండ్ లోకి దిగి బ్యాటింగ్ చేశాడో అలాగే వోక్స్ కూడా తన టీమ్ కోసం నిలబడే మనిషి అని చెప్పాడు రూట్. చూడాలి మరి వోక్స్ సాయంతో ఇంగ్లండ్ మిగిలిన 35పరుగులు పూర్తి చేస్తుందా...లేదా ఉన్న నాలుగు వికెట్లు కోల్పోయి సిరీస్ ను 2-2 తో డ్రా చేసుకుంటుందా అని.





















