APSRTC Recruitment: ఏపీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్.. 1500కు పైగా పోస్టులకు నోటిఫికేషన్.. పది పాసైన వారికి అవకాశం
Driver Jobs in APSRTC | ఏపీఎస్ ఆర్టీసీ డ్రైవర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అన్ కాల్ డ్యూటీ ఆధారంగా వీరి జాబ్ ఉంటుంది. టెన్త్ పాసై డ్రైవింగ్ అనుభవం ఉంటే సరిపోతుంది.

APSRTC Driver Recruitment 2025 | అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో APSRTC కొత్తగా డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్లైన్ అప్లికేషన్ అవసరం లేకుండానే డైరెక్ట్‌గా డిపోకి వెళ్లి డ్రైవింగ్ టెస్టుకు హాజరై పోస్టుకు ఎంపిక అవ్వవచ్చు అని అధికారులు తెలిపారు. ఆగస్టు 15 నుంచి ప్రక్రియ మొదలవుతుంది. రాత పరీక్ష లేదు, టెన్త్ క్లాస్ పాసైతే చాలు. డాక్యుమెంట్లతో సమీప డిపోకి వెళ్లండి. ప్రాక్టికల్ స్కిల్స్ ఉంటే ఎంపికవుతారు.
APSRTC Recruitment 2025 ముఖ్యమైన వివరాలు:
- పోస్టు పేరు: డ్రైవర్
- విభాగం: APSRTC
- ఖాళీల సంఖ్య: 1500కు పైగా
- పని ప్రదేశం: ఏపీ రాష్ట్రవ్యాప్తంగా
- అర్హత: కనీసం 10వ తరగతి పాస్ అవ్వాలి
- ఏజ్ లిమిట్: 22 నుంచి 35 ఏళ్లు (SC/ST/BC/EWS అభ్యర్థులకు 5 ఏళ్ల వయో సడలింపు, ఎక్స్ సర్విస్ మెన్‌కు 45 ఏళ్ల వరకు)
- అనుభవం: 18 నెలల డ్రైవింగ్ అనుభవం ఉండాలి
- డ్యూటీ రకం: ఆన్-కాల్లు (తప్పనిసరిగా అవసరమైనప్పుడు మాత్రమే పిలుస్తారు)
- జీతం: APSRTC రూల్స్ ప్రకారం
అప్లికేషన్ ప్రారంభం తేదీ: ఆగస్టు 15, 2025
APSRTC Jobs 2025 అర్హతలు
ఈ డ్రైవర్ ఉద్యోగాలకు అప్లై చేయడానికి మీకు ఈ అర్హతలు ఉండాలి:
విద్యార్హత: కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి.
వయస్సు పరిమితి: జనరల్ అభ్యర్థులు: 22–35 ఏళ్లు
రిజర్వ్డ్ కేటగిరీలకు: గరిష్ఠ వయస్సు 40 ఏళ్లు
ఎక్స్ సర్విస్ మెన్‌కు: 45 ఏళ్ల వరకు
డ్రైవింగ్ అనుభవం:
కనీసం 18 నెలల హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ అనుభవం అవసరం. HMV లైసెన్స్ ఉండాలి.
ఫిజికల్ స్టాండర్డ్స్:
కనీస హైట్: 160 సెం.మీ (5.2 అడుగులు)
ఆరోగ్యంగా ఉండాలి. తెలుగు చదవడం, అర్థం చేసుకోవడం వచ్చాలి
APSRTC Recruitment 2025 అవసరమైన డాక్యుమెంట్లు
డిపోకి వెళ్లేటప్పుడు ఈ సర్టిఫికెట్లు తప్పనిసరిగా తీసుకెళ్లాలి:
- 3 పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు
- డేటాఫ్ బర్త్ సర్టిఫికెట్
- 10వ తరగతి మెమో
- HMV డ్రైవింగ్ లైసెన్స్ (వ్యాలిడ్ అయి ఉండాలి)
- ఫిట్‌నెస్ సర్టిఫికేట్ (RTO నుంచి పొందినది)
- కుల సర్టిఫికెట్ (ఉంటే మాత్రమే)
- ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్ (ఉంటే మాత్రమే)
ఎంపిక ప్రక్రియ
ఈ ఉద్యోగం కోసం ఎలాంటి రాసే పరీక్ష ఉండదు. కింది మూడు దశల ఆధారంగా ఎంపిక జరుగుతుంది. మొదట డ్రైవింగ్ టెస్ట్, తరువాత ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, చివరగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి డ్రైవర్ పోస్టులకు ఎంపిక చేస్తారు.
డ్రైవింగ్ టెస్ట్: ట్రాన్స్‌పోర్ట్ అధికారులు మీ డ్రైవింగ్ స్కిల్స్ చెక్ చేస్తారు.
ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్: హైట్, ఆరోగ్యానికి సంబంధించిన ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తారు.
డాక్యుమెంట్ వెరిఫికేషన్: మీరు సమర్పించిన డాక్యుమెంట్లను జాగ్రత్తగా పరిశీలిస్తారు.
ఎంపికైన అభ్యర్థుల వివరాలు డిపోలో రిజిస్టర్ చేసి అవసరమైనప్పుడు ఉద్యోగానికి పిలుస్తారు.
అప్లికేషన్ ప్రాసెస్ – ఎలా అప్లై చేయాలి?
ఈ ఉద్యోగానికి ఆన్లైన్ అప్లికేషన్ అవసరం లేదు. మీరు చేయాల్సిందల్లా:
- మీకు దగ్గరలో ఉన్న APSRTC డిపోకి వెళ్లడం
- అవసరమైన అన్ని డాక్యుమెంట్లు తీసుకెళ్లడం
- అక్కడే డ్రైవింగ్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, డాక్యుమెంట్ల వెరిఫికేషన్ పూర్తి చేయడం
రాత పరీక్ష లేదు, పది పాసైతే చాలు
- 10వ తరగతి అర్హతతో మంచి అవకాశాలు
- ఆన్లైన్ అప్లికేషన్ అవసరం లేదు
- రూరల్ అభ్యర్థులకు పెద్ద ప్లస్
- రాసే పరీక్ష లేదు – నేరుగా స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక
- ప్రభుత్వ సంస్థలో పని చేసే అవకాశంతో భద్రత కలదు
గమనిక
ఇది పర్మనెంట్ ఉద్యోగం కాదు – “ఆన్ కాల్ డ్యూటీ” ఆధారంగా ఉంటుంది
ఎంపికైన తర్వాత ఎప్పుడు అవసరం వచ్చినా పని చేయడానికి పిలుస్తారు
మహిళల ఉచిత ప్రయాణ పథకానికి సహకారంగా ఈ నియామకాలు జరుగుతున్నాయి
ఎంపికైన అభ్యర్థులకు జీతం APSRTC చట్టాలకు అనుగుణంగా చెల్లించనున్నారు.






















