అన్వేషించండి

Software Jobs: సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు, ఫ్రెషర్లకు గుడ్‌న్యూస్.. 45 వేల మందిని రిక్రూట్‌ చేయనున్న క్యాప్‌జెమిని

Capgemini India plans to hire 40,000 to 45,000 employees this year CEO Ashwin Yardiసాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు, ఫ్రెషర్లకు గుడ్‌న్యూస్.. 45 వేల మందిని రిక్రూట్‌ చేయనున్న క్యాప్‌జెమిని

Capgemini Recruitment | న్యూఢిల్లీ: ఐటీ రంగంలో అనిశ్చితి నెలకొంది. ఇటీవల అతిపెద్ద ఐటీ సర్వీస్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) 2 శాతం ఉద్యోగులను ఈ ఆర్థిక సంవత్సరంలో తొలగించనున్నట్లు ప్రకటించింది. దాంతో ప్రపంచ వ్యాప్తంగా 12000 సాఫ్ట్ వేర్ ఉద్యోగులు జాబ్స్ కోల్పోయి రోడ్డున పడనున్నారు. ఓవరాల్‌గా 24 వేల మంది ఉద్యోగాలు కోల్పోనున్నారని ఐటీ సెక్టార్‌లో ఆందోళన మొదలైన తరుణంలో క్యాప్‌జెమిని సంస్థ వారికి ఊరట కలిగించే వార్త చెప్పింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 40000 నుంచి 45,000 వరకు ఉద్యోగాలు భర్తీ చేయాలని భావిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

ఇతర ఐటీ కంపెనీలకు భిన్నంగా క్యాప్‌జెమిని
భారత ఐటీ రంగంలో భారీ తొలగింపుల సమయంలో క్యాప్‌జెమిని ఇండియా 2025లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు నియామ కాలు చేపడతామని సంస్థ శుభవార్త చెప్పింది. ఐటీ రంగంలో నియామకాలలో సవాళ్లు ఎదుర్కొంటున్న సమయంలో రిక్రూట్‌మెంట్ విషయాన్ని క్యాప్‌జెమిని సీఈవో అశ్విన్ యార్డి తెలిపారు. ఇతర ఐటీ దిగ్గజాల తరహాలో లేఆఫ్స్ మాట ఎత్తకుండా కొత్తగా నియామకాలు చేపడతామని చెప్పడంతో ఐటీ ఉద్యోగులు, ఫ్రెషర్స్ క్యాప్‌జెమిని వైపు చూస్తున్నారు. 

క్యాప్‌జెమిని తాజా నియామకాలలో 35- 40 ఎక్స్‌పీరియన్స్ ఉద్యోగులను కూడా రిక్రూట్ చేసుకుంటారని ది హిందూ బిజినెస్‌లైన్ నివేదిక పేర్కొంది. ఏఐ లాంటి కొత్త టెక్నాలజీ మీద ఫోకస్ చేయాలని సంస్థ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే ఇదివరకే రియల్ టైం ఎక్స్‌పీరియన్స్ ఉన్న వారు టీంలో చేరితో ప్రయోజనం ఉంటుందని నియామకాలలో వారికి సైతం ప్రాధాన్యం కల్పిస్తున్నారు. 

కాలేజీలలో క్యాంపస్ నియామకాలు
ఐటీ సంస్థ క్యాప్‌జెమిని తాజా నియామకాలలో ఫ్రెషర్స్ కు సైతం అవకాశం కల్పిస్తోంది. దేశంలోని 50కి పైగా కాలేజీల నుంచి బీటెక్, ఎంసీఏ పూర్తి చేసుకుంటున్న వారిని భర్తీ చేస్తామని సీఈవో అశ్విన్ యార్డి పేర్కొన్నారు. ఇందుకోసం క్యాప్‌జెమినీ కాలేజీలకు ముందుగానే సమాచారం ఇస్తామన్నారు. టాలెంటెడ్ యంగ్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులతో ఆఫీసులో నూతనోత్సహంతో పాటు కొత్త టెక్నాలజీని త్వరగా నేర్చుకునే ఛాన్స్ ఉంటుందని భావిస్తున్నారు. 

AI వర్క్‌ఫోర్స్ కోసం నియామకాలు
“AI-రెడీ వర్క్‌ఫోర్స్”ను క్రియేట్ చేయడానికి క్యాప్‌జెమిని ప్రాధాన్యత ఇచ్చింది. అందుకోసం వారికి మొదటి నుంచీ కృత్రిమ మేధస్సు (AI)లో శిక్షణ ఇవ్వాలని, వేగంగా అభివృద్ధి చెందుతున్న AI ల్యాండ్‌స్కేప్‌కు అనుగుణంగా ప్రాజెక్టులకు ఉద్యోగులను సిద్ధం చేయాలని నిర్ణయించింది. ఈ కొత్త విధానం ఖర్చుతో కూడుకున్న, సరికొత్త ఆవిష్కరణ ఆధారిత సేవలకు పెరుగుతున్న క్లయింట్ సర్వీస్ డిమాండ్‌ను ఫోకస్ చేసింది. గ్లోబల్ క్లయింట్స్ ప్రాజెక్టులు, స్కేలబుల్ సొల్యూషన్‌ల కోసం క్యాప్‌జెమిని నియామకాలకు నిర్ణయం తీసుకుంది. WNS సంబంధిత "ఏజెంటిక్ AI" పరిష్కారాలను క్యాప్‌జెమిని విశ్లేషించి కార్యకలాపాలు పెంచాలని సీఈవో భావిస్తున్నారు.

భారతదేశంలో ప్రస్తుతం దాదాపు 1.75 లక్షల మంది ఉద్యోగులతో తమ కార్యకలాపాలు విస్తరించడానికి క్యాప్‌జెమిని చర్యలు చేపట్టింది. ముఖ్యంగా టీసీఎస్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్ వంటి ఐటీ సంస్థలు ఉద్యోగాల తొలగింపు దిశగా అడుగులు వేస్తుంటే క్యాప్‌జెమినీ అందుకు భిన్నంగా కొత్తగా నియామకాలు చేపట్టి AI టెక్నాలజీపై ట్రెనింగ్ ఇచ్చి ప్రాజెక్టులు చేయాలని భావించడం విశేషం.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget