Students Scholarship: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. నెలకు 2000 స్కాలర్‌షిప్, రూ.25,000 క్యాష్ ప్రైజ్.. ఇలా అప్లై చేయండి
VVM Scholarship 2025 for Students : కేంద్ర, ఏపీ ప్రభుత్వాలు కలిసి విద్యార్థి విజ్ఞాన్ మంథన్ 2025 అనే ప్రత్యేక పోటీని నిర్వహించాలని నిర్ణయించాయి. నెలకు రూ.2 వేలు స్కాలర్ షిప్, 25 వేలు నగదు ఇస్తారు.

VVM Scholarship 2025 Apply online | ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శుభవార్త చెప్పాయి. ప్రతిభ ఉన్న విద్యార్థులను ప్రోత్సహించే లక్ష్యంతో విద్యార్థి విజ్ఞాన్ మంథన్ (VVM) 2025 పేరుతో ఓ ప్రత్యేక పోటీ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఎంపికైన విద్యార్థులకు ఈ విద్యార్థి విజ్ఞాన్ మంథన్ స్కాలర్‌షిప్ 2025 కింద నెలకు ₹2,000 స్కాలర్‌షిప్‌తో పాటు అదనంగా ₹25,000 నగదు బహుమతి లభిస్తుంది. కనుక విద్యార్థులు కింద వివరాలు తెలుసుకుని వెంటనే అప్లై చేయాలని అధికారులు సూచించారు.
VVM Scholarship ఎగ్జామ్ పోటీకి అర్హులు ఎవరంటే..
ఆంధ్రప్రదేశ్‌కి చెందిన విద్యార్థులు ఈ పోటీలో పాల్గొనడానికి అర్హులుగా నిర్ణయించారు. రీసెర్చ్, సైన్స్‌పై ఆసక్తి ఉన్నవారు పాల్గొనాలని సూచించారు. ఈ స్కాలర్‌షిప్ పోటీలో 6వ తరగతి నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు పాల్గొనవచ్చు. దీన్ని Online Exam రూపంలో నిర్వహించనున్నారు. VVM Scholarship ఎగ్జామ్‌లకు దరఖాస్తు చివరి తేదీ సెప్టెంబర్ 30, 2025 వరకు చేయవచ్చు.
VVM Scholarship పోటీకి సంబంధించిన కీలక విషయాలు
తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలలో ఈ స్కాలర్‌షిప్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. కేవలం రూ.200 చెల్లించి విద్యార్థులకు ఈ పోటీకి దరఖాస్తు చేసుకోవాలి. జూనియర్ (6-8 తరగతులు) విభాగం, సీనియర్ (9-12 తరగతులు) విభాగంలో ఈ పోటిని నిర్వహిస్తారు. జూనియర్ విభాగానికి అక్టోబర్ 28 – నవంబర్ 2 తేదీలలో పరీక్ష ఉంటుంది. సీనియర్ విభాగం విద్యార్థులకు నవంబర్ 19 – నవంబర్ 23 తేదీలలో ఎగ్జామ్ నిర్వహిస్తారు. స్టడీ మెటీరియల్ ఆగస్టు 16వ తేదీ నుంచి, సెప్టెంబర్ 1వ తేదీన మోడల్ ఎగ్జామ్ పేపర్లు అందుబాటులోకి వస్తాయి. రాష్ట్ర స్థాయిలో టాప్ 3 విద్యార్థులకు రూ.5 వేలు, రూ.3 వేలు, రూ.2 వేలు ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ లు గా ప్రకటించారు. జాతీయ స్థాయిలో విజేతలకు నెలకు ₹2,000 భాస్కరా స్కాలర్‌షిప్ ఒక్క ఏడాది పాటు, ₹25,000 నగదు బహుమతి అందజేస్తారు.
పోటీ వివరాలు:
పరీక్ష ఫీజు: ₹200 మాత్రమే
పరీక్ష భాషలు: తెలుగు, హిందీ, ఇంగ్లీష్
విభాగాలు: జూనియర్ (6-8 తరగతులు)
సీనియర్ (9-12 తరగతులు)
పరీక్ష తేదీలు:
జూనియర్ విభాగం: అక్టోబర్ 28 – నవంబర్ 2
సీనియర్ విభాగం: నవంబర్ 19 – నవంబర్ 23
మోడల్ ఎగ్జామ్: సెప్టెంబర్ 1
స్టడీ మెటీరియల్ : ఆగస్టు 16 నుంచి అందుబాటులోకి
అవార్డులు & స్కాలర్‌షిప్‌లు:
రాష్ట్ర స్థాయిలో టాప్ 3 విద్యార్థులకు:
- 1వ బహుమతి: ₹5,000
- 2వ బహుమతి: ₹3,000
- 3వ బహుమతి: ₹2,000
జాతీయ స్థాయిలో విజేతలకు:
- ₹25,000 క్యాష్ బహుమతి
- నెలకు ₹2,000 భాస్కరా స్కాలర్‌షిప్ (1 Year)
దరఖాస్తు ఎలా చేయాలి?
అధికారిక వెబ్‌సైట్ https://www.vvm.org.in కి వెళ్ళండి
అందులో ముందుగా Register/Login చేయండి
వివరాలు ఫిల్ చేసి ఫీజు చెల్లించండి
పరీక్ష తేదీకి స్టడీ మెటీరియల్‌తో రెడీ అవ్వండి
గమనిక: ప్రతి స్టేజ్‌లో ఎంపికైన విద్యార్థులకు సర్టిఫికెట్లు, మెమెంటోలు, గుర్తింపు పత్రాలు అందజేస్తారు. ఇది భవిష్యత్తులో రీసెర్చ్, స్కాలర్‌షిప్, సైంటిఫిక్ కేర్‌యర్ వైపు వెళ్లేందుకు ఇది గొప్ప అవకాశంగా మారనుంది.
ముఖ్యమైన లింకులు:
VVM Scholarship అధికారిక వెబ్‌సైట్: https://www.vvm.org.in
VVM Scholarship దరఖాస్తు చివరి తేదీ: సెప్టెంబర్ 30, 2025






















