Pradhan Mantri Vidya Lakshmi Scheme: పేద విద్యార్థులకు గుడ్ న్యూస్! చదువు కోసం ₹7.5 లక్షల వరకు లోన్..అప్లై చేసుకోండి!
Pradhan Mantri Vidya Lakshmi Scheme: ఉన్నత విద్యు అభ్యసించే విద్యార్థులకు కేంద్రం బ్యాంకు రుణాలు ఇప్పిస్తోంది. పోర్టల్‌లో మీ వివరాలు అప్‌లోడ్ చేస్తే నేరుగా లోన్ అమౌంట్ మీ ఖాతలోకి చేరిపోతాయి.

Pradhan Mantri Vidya Lakshmi Scheme: ఉన్నత విద్యను అభ్యసించాలనే ఆలోచన ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులతో ముందుకు వెళ్లలేపోతున్న వారికి కేంద్రం సహాయం చేస్తోంది. వారికి ప్రభుత్వమే పూచికత్తుగా ఉంటూ బ్యాంకులోన్ ఇప్పిస్తోంది. ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకం ద్వారా పేద విద్యార్థులకు చేయూత ఇస్తోంది కేంద్రం. ఇది చాలా మందికి తెలియక చదువుకోవాలనే కోరిక ఉన్నప్పటికీ చంపుకుంటున్నారు. ఇంతకీ ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది... కావాల్సిన అర్హతలు పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం
వికసిత్ భారత్‌లో భాగంగా విద్యార్థులకు ఉన్నత విద్య అభ్యసించే అవకాశం కల్పించి వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకం ప్రారంభించింది. ఇందులో భాగంగా ఉన్నత విద్యలో చేరే విద్యార్థులకు బ్యాంకు రుణాలు ఇప్పించబోతున్నారు. బ్యాంకు చుట్టూ తిరిగే అవసరం లేకుండా బ్యాంకులే ఫోన్ చేసి డబ్బులు అప్పులు ఇచ్చేలా చేస్తున్నారు. ఇది కూడా కేవలం 15 రోజుల్లోనే అకౌంట్‌లో డబ్బులు జమ కాబోతున్నాయి.
ఈ పథకం ద్వారా మీరు ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు, ట్రాన్స్‌పోర్ట్ ఫీజులు చెల్లించేందుకు కూడా రుణం తీసుకోవచ్చు. ఇలా రుణం ఇచ్చేందుకు ఎలాంటి ప్రాసెసింగ్ చార్జీలు వసూలు చేయబోరు. మీరు ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకం కోసం ఏర్పాటు చేసిన పోర్టల్‌ల ద్వారా అప్లై చేసిన 15 రోజుల్లోనే తక్కువ వడ్డీతో రుణం మంజూరు చేస్తారు.
ఉన్నత విద్య చదవాలనే ఆలోచన ఉన్న విద్యార్థులులు ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పోర్టల్ ద్వారా రుణం కోసం అప్లై చేసుకోవాలి. రుణానికి అప్లే చేసుకునేటైంలో టెన్త్, ఇంటర్, డిగ్రీ మార్కుల జాబితా, పాస్ మెమో అప్‌లోడ్ చేయాలి. మీరు ఏ కోర్సు అభ్యసించాలని అనుకుంటున్నారో ఆ కోర్సు అడ్మిషన్ డాక్యుమెంట్, మీ ఇన్‌కం సర్టిఫికెట్, అందజేయాల్సి ఉంటుంది. పోర్టల్‌లోనే అప్‌లోడ్ చేయాలి. దీని ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. తుది గడువు అంటూ లేదు.
ఈ ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథం ద్వారా రుణం పొందాలంటే కొన్ని అర్హతలు కేంద్రం నిర్దేశించింది. విద్యార్థి కుటుంబ ఆదాయం ఏడాదికి నాలుగు లక్షలు దాటకూడదు. గతంలో ఎలాంటి విద్యారుణాలు తీసుకొని ఉండకూడదు. ఎలాంటి కోర్సులోనైనా చేరవచ్చు. విదేశాల్లో చదువుకున్న వారికి కూడా రుణాలు మంజూరు చేస్తారు. రుణం కోసం అవసరమైన పత్రాలు అప్‌లోడ్ చేయకపోతే మీ దరఖాస్తు పెండింగ్‌లో ఉంటుంది. అన్నీ కరెక్ట్‌గా ఉంటే 15 రోజుల్లో రుణం మంజూరు అవుతుంది. దీనికి సంబంధించిన ఇంకా అనుమానులు ఉన్నా ఏ కోర్సులకు రుణం ఇస్తారని తెలుసుకోవాలని ఉంటే 18001031 నెంబర్‌కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు.
ఎన్ని రకాల లోన్‌లు ఇస్తారు
అర్హత ఉన్న వారికి మూడు రకాలుగా రుణాలు ఇస్తారు. మొదటి విభాగంలో రూ.4 లక్షలలోపు రుణం మంజూరు చేస్తారు. రెండో విభాగంలో రూ.4 లక్షల నుంచి రూ.7.5 లక్షల వరకు లోన్ ఇస్తారు. మూడో విభాగంలో రూ.7.5 లక్షలకు పైగా రుణాన్ని ఇస్తారు.
రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి
- ఉన్నత విద్య కోసం రుణం అప్లై చేయాలనుకునే వాళ్లు అధికారిక వెబ్‌సైట్ ద్వారానే చేయాల్సి ఉంటుంది.
- విద్యార్థులు ప్రధానమంత్రి విద్యాలక్ష్మి అధికారిక వెబ్‌సైట్ https://pmvidyalaxmi.co.in లోకి వెళ్లాలి.
- అందులో విద్యార్థి పేరు, ఫోన్ నెంబర్ , మెయిల్, అడ్రెస్, వంటి వివరాలు ఎంటర్ చేయాలి.
- రిజిస్ట్రేషన్ పూర్తి అయిన తర్వాత విద్యా రుణం అప్లికేషన్‌పై క్లిక్ చేయాలి.
- వారు అడిగిన వివరాలు నింపాలి
- తర్వాత అవసరమైన సర్టిఫికెట్స్ అప్‌లోడ్ చేయాలి.





















