8th Pay commission: 8వ వేతన సంఘం సిఫార్సులు అమలు ఎప్పుడు? జీతాలు పెరిగేది ఎప్పుడంటే
Central government salary hike | ఎనిమిదవ వేతన సంఘం జీతం ఇంకా రానప్పటికీ, ఉద్యోగుల డబ్బు సురక్షితం అని చెప్పవచ్చు. అమలులోకి రాగానే ప్రభుత్వం వారికి బకాయిలు చెల్లిస్తుంది.

8th Pay commission | జనవరి 2026 మొదలుకాగానే, లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఇకపై జీతం పెరుగుతుందని వారు భావించారు. సోషల్ మీడియాతో పాటు ఉద్యోగుల కార్యాలయాల్లో 7వ వేతన సంఘం ముగిసిన వెంటనే కొత్త వేతనం అమల్లోకి వస్తుందని చర్చలు జరిగాయి. కానీ నెలలు గడిచినా, జీతం మాత్రం పెరగలేదు. పెన్షన్లలో ఎటువంటి మార్పు రాలేదు. ఇప్పుడు అసలు జాప్యం ఎందుకు జరుగుతోంది, కొత్త వేతనం ఎప్పుడు వస్తుంది. ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఎంత బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది అనే విషయాలు తెలుసుకోండి.
8వ వేతన సంఘం గురించి గందరగోళం ఎందుకు
నిజానికి, ప్రతి 10 సంవత్సరాలకు ఒక కొత్త వేతన సంఘాన్ని అమలు చేసే సంప్రదాయం భారత్‌లో ఉంది. 7వ వేతన సంఘం జనవరి 1, 2016 నుండి అమలులోకి వచ్చింది. దీని ఆధారంగా జనవరి 1, 2026 నుండి 8వ వేతన సంఘం అమల్లోకి వస్తుందని భావించారు. కానీ ఇది కేవలం ఒక అంచనాగా మిగిలింది. వాస్తవానికి, జీతం పెంచడానికి ఎటువంటి ఆటోమేటిక్ సిస్టమ్ లేదు.
జీతం ఎందుకు పెరగలేదు
వేతన సంఘం ప్రక్రియ చాలా సుదీర్ఘంగా ఉంటుంది. మొదట, ప్రభుత్వం వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తుంది. ఆ తర్వాత, వేతన సంఘం ఉద్యోగుల జీతాలు, అలవెన్సులు, పెన్షన్లకు సంబంధించిన అన్ని అంశాలను అధ్యయనం చేస్తుంది. ఆపై తన సిఫార్సులను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది. ప్రభుత్వం ఆ సిఫార్సులను పరిశీలించి ఆమోదించాలి. ఆ తర్వాతే కొత్త జీతాలు అమల్లోకి వస్తాయి. అందుకే 7వ వేతన సంఘం గడువు ముగిసిన తర్వాత జీతం నేరుగా పెరగలేదు.
జనవరి 2026లో ఏమి మారింది దు
జనవరి 2026లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం పెరగలేదు. పెన్షనర్లకు అంతే మొత్తం వస్తుంది. ప్రభుత్వం ఇప్పటివరకు 8వ వేతన సంఘం గురించి ఎటువంటి తుది నోటిఫికేషన్ ఇవ్వలేదు. ప్రస్తుతం ఉద్యోగులకు పాత జీతాలు, పెన్షన్లు అందుతున్నాయి.
8వ వేతన సంఘం ఎప్పుడు అమలులోకి రావొచ్చు
8వ వేతన సంఘం సిఫార్సులు 2026 రెండవ అర్ధభాగంలో లేదా 2027 ప్రారంభంలో అమలులోకి రానున్నాయి. అయితే, ఆలస్యం జరిగితే కూడా ఉద్యోగులకు నష్టం ఉండదు, ఎందుకంటే కట్-ఆఫ్ తేదీ జనవరి 1, 2026గా పరిగణించనున్నారు.
బకాయిలు అంటే ఏమిటి..
కొత్త జీతం అమలు తేదీ, కట్-ఆఫ్ తేదీ మధ్య ఏర్పడే వ్యత్యాసాన్ని బకాయిలు అంటారు. 8వ వేతన సంఘం తరువాత అమలులోకి వస్తే, ఉద్యోగులకు గత తేదీ నుండి పెరిగిన జీతం మొత్తం ప్రయోజనం లభిస్తుంది. ఎంత ఆలస్యమైతే, అన్ని నెలల బకాయిలు ఒకేసారి ఉద్యోగులకు లభిస్తాయి.
బకాయిల లెక్కింపు ఎలా ఉంటుంది
ఒక ఉద్యోగి ప్రస్తుత జీతం రూ. 50,000 అని అనుకుంటే.. 8వ వేతన సంఘం తర్వాత ఈ జీతం రూ. 55,000కి పెరుగుతుంది. అంటే, ప్రతి నెలా రూ. 5,000 వ్యత్యాసం ఉంటుంది. వేతన సంఘం మే 2027లో అమలులోకి వస్తే, జనవరి 2026 నుండి ఏప్రిల్ 2027 వరకు మొత్తం 15 నెలల బకాయిలు కేంద్రం చెల్లించనుంది. నెలకు రూ. 5,000 చొప్పున మొత్తం బకాయిలు రూ. 75,000 ఉద్యోగికి ఒకేసారి చెల్లిస్తారు.
పెన్షనర్లకు ఏం ప్రయోజనం
ఉద్యోగులే కాకుండా, పెన్షనర్లకు కూడా బకాయిలు అందిస్తుంది. పెన్షన్ కొత్త సిఫార్సుల ఆధారంగా లెక్కించనున్నారు. కట్-ఆఫ్ తేదీ నుండి అమలు తేదీ వరకు ఉన్న వ్యత్యాసం వారికి బకాయిల రూపంలో ఇస్తారు.






















