Jagga reddy: మరోసారి కన్నీరు పెట్టుకున్న జగ్గారెడ్డి - ఎంత రాజకీయ నాయకుడైతే మాత్రం మనసుండదా ?
Congress Leader Jaggareddy: తన అనుచరుడు చేసిన సాయాన్ని గుర్తు చేసుకుని జగ్గారెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. అందరికీ అండగా ఉంటానన్నారు.

Jagga Reddy tears: కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఇటీవలి కాలంలో సున్నిత మనస్కుడు అయిపోయారు. తన అనుచరులకు, నియోజకవర్గ ప్రజలకు కష్టం వస్తే ఆయన తట్టుకోలేకపోతున్నారు. తాజాగా సంగారెడ్డి లో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. 2017 లో సంగారెడ్డి లో రాహుల్ గాంధీ సభ కోసం కంది మండలం నాయకుడు ఆంజనేయులు భూమిని అమ్మాల్సి వచ్చినందుకు కన్నీళ్లు పెట్టుకున్నారు జగ్గారెడ్డి.
కెసిఆర్ 10 ఏళ్ళ పాలన లో రాష్ట్రాన్ని నాశనం చేశారని.. కెసిఆర్ కుటుంబ షాక్ లకు రాష్ట్రం లో కాంట్రాక్టులు కూడా రాని పరిస్థితి ఉందన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటానన్నారు. క్యాన్సర్ బారిన పడిన వారికి అన్ని విధాలుగా ఆర్థిక సాయం చేస్తానని ప్రకటించారు. నవంబర్ లో ముఖ్య కార్యకర్తలను మండలాల వారీగా కలుస్తానని హామీ ఇచ్చారు. కార్యకర్తల కుటుంబాల్లో ఆడపిల్లల పెళ్ళికి సాయం చేస్తానని.. ఫోన్ చేస్తే అందుబాటులో లేడు అనడం కాదు.. నా పేరు చెబితేనే పనులు అయిపొతాయని భరోసా ఇచ్చారు.
కార్యకర్తలంతా స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు. సంగారెడ్డి నియోజకవర్గం లో ని అన్ని పంచాయతీ లు కాంగ్రెస్ గెలవాలని దిశానిర్దేశం చేశారు. ఎంపీటీసీ లు, జడ్పీటీసి లు, మునిసిపాలిటీ ల్లో గెలిచి రావాలని.. మరో 8 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లో ఉంటుందన్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం అప్పులు చేయండి. ఆ అప్పులు ఎలా కట్టాలో నేనే చెబుతానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా.. జూలకంటి ఆంజనేయులు అనే తన అనుచరుడి భూమిని రాహుల్ గాంధీ సభ కోసం అమ్మిన విషయాన్ని గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్నారు. మాట్లాడలేక మధ్యలోనే వెళ్లిపోయారు.
జగ్గారెడ్డి ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున కార్యకర్తలకు సాయం చేస్తున్నారు. రాహుల్ గాంధీ పుట్టిన రోజు సందర్భంగా క్యాన్సర్ పేషెంట్ కి 10 లక్షల ఆర్ధిక సాయం చేశారు . సంగారెడ్డి నియోజకవర్గం తాళ్లపల్లి గ్రామానికి చెందిన హరి కృష్ణ ప్రసాద్ గత కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నారు. గురుకుల పాఠశాలలో 13 వేల రూపాయలు చిరుధ్యోగి గా పనిచేస్తున్నారు హరికృష్ణ ప్రసాద్. హరి కృష్ణ ప్రసాద్ కు భార్య శైలజ, ఎల్ కే జి, ఒకటో తరగతి చదువుతున్న పాప, బాబు ఉన్నారు. మూడు నెలల క్రితం హరి కృష్ణ ప్రసాద్ కు క్యాన్సర్ ఉందని తేలింది. ఇప్పటికే వైద్యం కోసం లక్షల రూపాయల ఖర్చు చేసిన కుటుంబం .. ఇకపై వైద్యానికి డబ్బులు లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో లో పడ్డారు. అనుచరుల ద్వారా హరి కృష్ణ ప్రసాద్ పరిస్థితి నీ తెలుసుకున్న జగ్గారెడ్డి.. క్యాన్సర్ చికిత్స కు పూర్తి ఖర్చు భరించేందుకు ముందుకు వచ్చారు. రాహుల్ గాంధీ పుట్టిన రోజు సందర్భంగా క్యాన్సర్ పేషంట్ హరి కృష్ణ ప్రసాద్ కు పది లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. ఆ తర్వాత కూడా పలువురికి సాయం చేస్తూ వస్తున్నారు.





















