అన్వేషించండి

Double Decker Flyover on NH65: ఎల్‌బీనగర్‌ నుంచి హయత్‌నగర్.. 8 వరుసలతో డబుల్ డెక్కర్ రోడ్డు

విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారి NH-65లో డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ వస్తోంది. 650కోట్లతో పెద్ద అంబర్‌పేట్‌ నుంచి ఎల్‌బీనగర్‌ వరకూ మెట్రో లైన్ - ఫ్లై ఓవర్ కలిసిన ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తారు

Double Decker Flyover on NH65: హైదరాబాద్ -విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఎలివేటెడ్ కారిడార్‌ను తెలంగాణ ప్రభుత్వం చేపడుతోంది. ఎల్‌బీనగర్‌ LB Nagar నుంచి హయత్‌నగర్‌ Hayath Nagar వరకూ 5.5 కిలోమీటర్ల మేర 8వరుసలతో డబుల్‌ డెక్కర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకు రూ.650 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా...! ఈ రోడ్డు నిర్మాణం చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయనున్నామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నాగ్‌పూర్‌లో నిర్మించిన  డబుల్‌ డెక్కర్‌ కారిడార్‌ నమూనాలోనే ఇక్కడ కూడా నిర్మించాలని భావిస్తున్నారు. ఎల్‌బీనగర్‌ వద్ద ట్రాఫిక్ పరిస్థితిని ఆయన స్వయంగా క్షేత్రస్థాయిలో సమీక్షించారు. 

ఎలివేటెడ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే..
విజయవాడ- హైదరాబాద్‌ రోడ్డు మార్గంలో ఏ స్థాయిలో రద్దీ ఉంటుందో అందరికీ అనుభవమే. ఎల్బీనగర్‌ దగ్గర అవుటర్ వరకూ రోడ్డు విపరీతంగా రద్దీ ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఆ రోడ్లను వెడల్పు చేసినప్పటికీ రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. జాతీయ రహదారిపై నుంచి వచ్చే వాహనాలకు లోకల్ ట్రాఫిక్‌ కలవడంతో చాలా ఎక్కువ రద్దీగా ఉంటోంది. అందుకే వాహనాలు నేరుగా ఎల్బీనగర్‌కు చేరుకునేలా..ఇటు నుంచి కకూడ అంతరాయం లేకుండా వెళ్లేలా పూర్తిగా ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించాలని అనుకుంటున్నారు 

మెట్రో మార్గానికి అనుగునంగా..

విస్తరణలో భాగంగా ప్రస్తతం ఉన్న మెట్రో లైన్‌ను హయత్‌నగర్ వరకూ విస్తరించాలని ఇంతకు ముందే నిర్ణయించారు. ఇప్పుడు చేపట్టబోయే నిర్మాణం దానిని కూడా దృష్టిలో ఉంచుకుని చేయనున్నారు. ఇందులో కింద సర్వీసు రోడ్డు ఉంటుంది. మధ్యలో 8వరుసల ఫ్లైఓవర్.. దానిపైన మెట్రో మార్గం ఉంటుంది. ఇలా డబల్ డెక్కర్ రోడ్డును 5.5 కిలోమీటర్ల వరకూ నిర్మిస్తారు. ప్రస్తుతం విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారి విస్తరణ జరుగుతోంది. నగరానికి వెలుపల కొన్ని చోట్ల రోడ్ల విస్తరణ చేపట్టారు. చౌటప్పల్ దగ్గర ఉన్న  మల్కాపూర్ నుంచి ఎల్బీనగర్‌ వరకూ ఉన్న రోడ్డు ఇరుకుగా ఉండటంతో దానిని విస్తరించడానికి 541కోట్ల వ్యయంతో పనులు చేపట్టారు. ORR లోపల పెద్ద అంబర్‌పేట్ వరకూ రోడ్డు విస్తరణ పూర్తైంది. ఆ తర్వాత కూడా రోడ్డు వెడల్పు బాగానే ఉన్నప్పటికీ నగరంలోని ట్రాఫిక్‌ హైవేపైకి వచ్చి ఇబ్బంది అవుతోంది. సిటీ మధ్యలో ఉండటంతో రోడ్డును డివైడర్‌తో క్లోజ్ చేయడం ఇబ్బంది అవుతోంది. చాలా చోట్ల పాసింగ్ కోసం రోడ్డును ఓపెన్ చేయాల్సి వస్తోంది. అందుకే పెద్ద అంబర్‌పేట్‌ నుంచి ఎల్బీనగర్‌ వరకూ ఎలాంటి అంతరాయం లేకుండా ఎలివేటెడ్ మార్గం వేయాలని అనుకుంటున్నారు. మెట్రో కోసం ఎలాగూ ఎలివేటెడ్ మార్గాన్ని వేయాలి కాబట్టి రెండింటికీ కలిసొచ్చేలా దీనిని ప్రతిపాదించారు. 


Double Decker Flyover on NH65: ఎల్‌బీనగర్‌ నుంచి హయత్‌నగర్.. 8 వరుసలతో డబుల్ డెక్కర్ రోడ్డు

రెండు గంటల్లో విజయవాడ-హైదరాబాద్

ఈ మార్గాన్ని ఏడాది లోగా పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. దీనిపై 6వతేదీన కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీని కలుస్తున్నామని చెప్పారు.విజయవాడ హైదరాబాద్‌ మధ్య పెరుగుతున్న రద్దీ దృష్ట్యా మరో గ్రీన్‌ఫీల్డ్ హైవేకు కేంద్రం ఓకే చెప్పింది. ఏపీ కొత్తరాజధాని అమరావతి నుంచి.. ఫ్యూచర్‌ సిటీ దగ్గర ORRకు కలిసేలా దీనిని తెలంగాణ ప్రభుత్వం అడుగుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు కూడా  హైదరాబాద్‌- విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ హైవే కావాలని  రెండు రోజుల కిందట విజయవాడ వచ్చిన గడ్కరీని కోరారు. ఆయన వెంటనే ఆమోదం తెలిపారు. యాక్సెస్ కంట్రోల్డ్.. గ్రీన్‌ఫీల్డ్ హైవేతో రెండు గంటల్లోనే హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లిపోవచ్చని కోమటిరెడ్డి అంటున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Ponguleti Srinivas Reddy on 22A Lands: రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదు.. 22ఏ భూముల వివాదంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదు.. 22ఏ భూముల వివాదంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Embed widget