Hyderabad Crime News: వీడో వెరైటీ దొంగ! ఆమ్లెట్ వేసుకొని మరి తిని.. ఏమి దొరక్క బట్టలు కాల్చేశాడు..
ఎక్కడైనా దొంగతనాలు జరిగినప్పడు దోపిడీకు పాల్పడ్డ వారి శైలి, పద్దతిని బట్టి వారు ఏ ముఠాకు చెందిన వారో పోలీసులు దొరికిన ఆధారాలను బట్టి ఇట్టే ఫలానా ముఠాకు చెందిన వారే ఇట్టే చెప్పేస్తుంటారు..

షాద్‌నగర్: ఎక్కడైనా దొంగతనాలు జరిగినప్పడు దోపిడీకు పాల్పడ్డ వారి శైలి, పద్దతిని బట్టి వారు ఏ ముఠాకు చెందిన వారో పోలీసులు దొరికిన ఆధారాలను బట్టి ఇట్టే ఫలానా ముఠాకు చెందిన వారే ఈ దోపిడీకు పాల్పడ్డారని ఇట్టే చెప్పేస్తుంటారు.. ఆదిశ గా దర్యాప్తు చేపట్టి దొంగలను కూడా పట్టుకుంటుంటారు.. ఇదిలా ఉంటే దొంగతనం చేసే దానికి కూడా రకరకాలుగా దొంగలు విభిన్న తరహాలో దొంగతనాలకు పాల్పడుతుంటారని పోలీసులు చెబుతుంటారు.. ఇదే కోవలో కనిపించే వారే చెడ్డీ గ్యాంగ్, బనియన్ గ్యాంగ్, ఆయిల్ గ్యాంగ్, బందిపోట్లు గజదొంగలు డాకులు, ముసుగు దొంగలు ఇలా అనేక రకాలుగా గతంలో జరిగిన దొంగతనాలను బట్టి గుర్తించారు.. కానీ మీరు చదవబోయే దొంగ గురించి తెలిస్తే నోరెళ్ల బెడతారు.. మీరే కాదు ముందు పోలీసులే షాక్ అయ్యారు..
దర్జాగా కిచెన్‌లోకి వెళ్లి ఆమ్లెట్ వేసుకుని..
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆఫీసర్స్ కాలనీలో బోడంపాటి తిరుపతి గౌడ్ ఇంట్లో పై పోర్షన్ లో అద్దెకు ఉండే ఆంజనేయులు అనే ఓ పాత్రికేయుడు కుటుంబం ఇంటికి గత మూడు రోజులుగా తాళం వేసి ఉండగా, ఇది గమనించిన దుండగుడు పక్క ఇంటి పై నుండి తిరుపతి గౌడ్ ఇంటి పై పోర్షన్ లోకి చేరుకొని తాళం పగలగొట్టి దొంగతనానికి యత్నించాడు. కానీ అక్కడ ఏమీ కనబడలేదు.. కిచెన్‌లోని పోపు డబ్బాల్లో ఏమైనా దొరకుతాయామోనని ప్రయత్నించి ఉండుంటాడు.. సరిగ్గా అక్కడే ఈ దర్జా దొంగకు గుడ్లు కనిపించాయి.. దీంతో నూరూరింది.. స్టవ్ వెలిగించి పెనం పొయ్యిమీద పెట్టి మరీ గుడ్లు పగుల కొట్టి ఆమ్లెట్ వేసుకున్నాడు.. బాగా కాలాక షుష్టిగా తిన్నాడు.. అప్పడు వచ్చిన అసలు పనిమీద కాన్‌సంట్రేషన్ పెట్టాడు..
ఏమీ దొరక్క బట్టలకు నిప్పు...
ఇంట్లో అన్ని చోట్ల వెతికి వెతికి విసిగి వేశారిపోయిన సదరు దర్జా దొంగ చివరాఖరికి తన దొంగతనానికి ఇంట్లో వాళ్ళు ఏమీ పెట్టలేదు అని నిర్ధారణకు వచ్చాడు.. ఏమీ దొరకలేదన్న కోపమో లేక మండిందో ఏమో ఇంట్లో ఉన్న బట్టలన్నీ ఒక దగ్గర వేసి పోగేసి నిప్పంటించాడు. దీంతో విలువైన చీరలు, ఇతర దుస్తులు అన్నీ కాలిపోయాయి.. ఇంటి ముందు కెమెరాలు గమనించిన దుండగుడు వెనకవైపు నుండి మరో ఇంటి పైకి ఎక్కి ఈ ఇంట్లోని పై అంతస్తులోకి చేరుకున్నట్లు తెలుస్తుంది..ఈ ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. షాద్ నగర్ పట్టణంలో తరచూ జరుగుతున్న దొంగతనాల వ్యవహారంలో పోలీసులు పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని కోరుకుంటున్నారు..





















