అన్వేషించండి

Crime News: ఆచార్యుడు కాదు కామాంధుడు.. బాలిక‌ను గ‌ర్భ‌వ‌తిని చేసిన‌ స్కూల్ ప్ర‌న్సిపాల్, కోన‌సీమలో దారుణం

Konaseema Crime News | ఆ ప్ర‌యివేటు స్కూల్ ముందు ఓ ఫ్లెక్సీ ఉంటుంది.. ఆఫ్లెక్సీలో క‌ర‌స్పాండెంట్ ఆచార్య షాజి జ‌య‌రాజ్ డిగ్రీల తోక‌తో అత‌గాడి ఫోటో ఉంటుంది. ఆచార్య కాదు కామాంధుడు వీడు అంటున్నారు.

మండ‌పేట: విద్యాల‌యాలు స‌ర‌స్వ‌తి నిల‌యాలు అంటారు.. చదువు చెప్పే విద్యా సంస్థలను ప‌విత్ర‌మైన దేవాల‌యంతో పోల్చుతారు.. అటువంటి విద్యాల‌యాల్లోనే బాలిక‌ల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోతోంది. తండ్రి స్థానంలో నిలిచి విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు కామాంధుడై పాఠ‌శాలలోని విద్యార్థులపై త‌న వికృత బుద్దిని చూపాడు. కూతురు వ‌య‌స్సున్న బాలిక‌ను మాయ‌మాట‌లు చెప్పి లోబ‌ర్చుకుని, ఎవ‌రికైనా చెబితే చంపేస్తాన‌ని బెదిరించాడు. ప్రిన్సిపాల్ చేసిన లైంగిక దాడితో బాలిక గ‌ర్భం దాల్చడంతో ఆ కామాంధుడి చేష్టలు బ‌ట్టబ‌య‌ల‌య్యాయి. అంబేడ్క‌ర్ కోన‌సీమ జిల్లా ప‌రిధిలోకి వ‌చ్చే మండ‌పేట నియోజ‌క‌వ‌ర్గంలోని రాయ‌వ‌రం మండ‌లం మాచ‌వ‌రంలో ఈ దారుణం చోటుచేసుకుంది. నిందితుడు స్కూల్ ప్రిన్సిపాల్ షాజి జ‌య‌రాజ్‌ను అదుపులోకి తీసుకుని, పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు..

మాయ‌మాట‌ల‌తో విద్యార్థినిని లొంగ‌దీసుకుని..

మాస్టారు అంటే పిల్ల‌లంద‌రికీ గౌర‌వం, అంత‌కంటే అభిమానం.. అందుకే ఆ బాలిక ఎక్క‌డ లేని విన‌యం, విధేయ‌త చూపింది. ఇదే అద‌నుగా తొమ్మిదో త‌ర‌గ‌తి చ‌దువుతున్న ఆ బాలికను మాయ‌మాట‌ల‌తో త‌న ఛాంబ‌ర్‌కు త‌ర‌చూ పిలిపించుకుని మాట్లాడేవాడు. ఈ క్ర‌మంలోనే మాట‌లు కాస్త వికృత చేష్ట‌లుగా మారాయి. ప్రిన్సిపాల్ అస‌లు స్వ‌రూపం తెలుసుకునేలోపే అతడి బారిన పడింది. ఆ బాలిక అత‌ని చేష్ట‌లను కూడా ఎవ్వ‌రికీ చెప్పుకోలేక పోయింది. ఇదే ఆస‌రాగా తీసుకున్న ప్రిన్సిపాల్ జ‌య‌రాజ్ నాలుగు నెల‌ల కిందట ఆ బాలిక‌పై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

అత్యాచారం విషయం చెబితే చంపేస్తాన‌ని బెదిరింపు..

బాలిక‌ను లొంగ‌దీసుకున్న ప్రిన్సిపాల్ జ‌య‌రాజ్ అత్యాచారం చేసి ఆపై దీని గురించి ఎవ్వ‌రికైనా చెబితే చంపేస్తాన‌ని బెదిరించాడ‌ని బాలిక త‌ల్లి తండ్ర‌లు పోలీసుల‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రిన్సిపాల్ చేసిన పాడు ప‌ని ఎవ్వ‌రికీ చెప్పుకోలేని బాలిక తనలో తాను మానసిక వేదన అనుభవించింది. ఆ త‌రువాత కూడా అద‌ను చూసుకుని బాలికపై లైంగిక దాడికి పాల్ప‌డిన‌ట్లు ఆ బాలిక చెబుతోంది. 

మూడు నెల‌లుగా నెల‌స‌రి రాక‌పోయేస‌రికి..

బాలిక శ‌రీరంలో మార్పుల‌తో పాటు మూడు నెల‌లుగా పీరియ‌డ్స్ రాక‌పోవ‌డంతో తల్లిదండ్రులు బాలిక‌ను మండ‌పేట‌లోని ఓ ప్ర‌యివేటు ఆసుప‌త్రిలో చూపించారు. బాలిక మూడు నెల‌లు గ‌ర్భ‌వ‌తిగా నిర్ధార‌ణ కావడంతో తల్లిదండ్రులు షాకయ్యారు. దీంతో బాలిక‌ను నిల‌దీసిన త‌ల్లితండ్రుల‌కు అస‌లు విష‌యం చెప్పింది. నాలుగు నెల‌ల క్రితం స్కూల్ ప్రిన్సిపాల్ జ‌య‌రాజ్ త‌న‌పై లైంగిక దాడికి పాల్ప‌డ్డాడ‌ని చెప్ప‌డంతో బాధిత బాలిక త‌ల్లితండ్రులు రాయ‌వ‌రం పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో బాలిక త‌ల్లితండ్ర‌లు ఇచ్చిన ఫిర్యాదుతో 
కేసు నమోదు చేసి దర్యాప్తు చేప‌ట్టారు. నిందితుడు ప్ర‌యివేటు స్కూల్ ప్రిన్సిపాల్ షాజి జ‌య‌రాజ్‌ను అదుపులోకి తీసుకున్న‌ట్లు తెలిసింది.. 

టాప్ హెడ్ లైన్స్

Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Minor Girls Assault Case: గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Anantapur Road Accident: ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Hushar Pittalu Trailer : ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
పల్సర్‌ 150లో భారీ మార్పులు.. కొత్త ఇంజిన్‌, కొత్త ఫ్రేమ్‌తో వస్తున్న బజాజ్‌ యూత్‌ఫుల్‌ బైక్‌!
కొత్త బజాజ్‌ పల్సర్‌ 150 న్యూ లుక్‌ భలే ఉంది, మీరు చూశారా?.. ఫోటోలు లీక్‌
Claude Vs ChatGPT: చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
Embed widget