Crime News: భర్త హత్యకు భార్య ప్లాన్, అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడ్డ వ్యక్తి - మేడ్చల్‌లో ఘటన
Hyderabad Crime News | మేడ్చల్ మల్కాజిగిరిలో ఓ వివాహిత తన భర్తను హత్య చేయించాలని కుట్ర చేసింది. బీర్ సీసాలతో దాడి చేసినా బాధితుడు ప్రాణాలతో బయటపడ్దాడు.

Wife plans to kill Husband in Hyderabad | మేడ్చల్: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో భర్తను చంపాలని ఓ వివాహిత ప్లాన్ చేసింది. అదృష్టం కొద్దీ అతడు గాయాలతో బయటపడ్డాడు. దుండిగల్ పి.యస్ పరిధిలో ఆలస్యంగా ఈ ఘటన వెలుగు చూసింది. ముగ్గురు వ్యక్తులతో కలిసి భార్య తనను హత్య చేయాలని ప్లాన్ చేసిందని బాధితుడు తెలిపాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న బాచుపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
అసలేం జరిగిందంటే..
బాచుపల్లి పీఎస్ పరిధిలో నివాసం ఉంటున్న రాందాస్ అనే వ్యక్తికి భార్యతో వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో భర్త రాందాస్‌ను హత్య చేయించాలని జ్యోతి అనే మహిళ ప్లాన్ చేసింది. ఇంటివద్దకు వచ్చి తనను మద్యం తాగాలని తీసుకెళ్లారని బాధితుడు తెలిపాడు. మొదట పక్కనున్న వైన్స్ షాపులో బీర్లు కొని తాగారు. తరువాత వద్దని చెబుతున్నా తనను బలవంతంగా బౌరంపేట్ తీసుకెళ్లి మరికొందరు రాందాస్ కు ప్లాన్ ప్రకారం భర్త కు మద్యం తాగించారు. భార్య జ్యోతి పురమాయించిన ముగ్గురు వ్యక్తులు కలిసి బీర్ సీసాలతో రాందాస్ పై దాడి చేశారు.

అపస్మారక స్థితిలో పడిఉన్న రాందాస్ మృతిచెందాడని భావించి నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. యువకులు వెళ్లిపోయాక బాధితుడు రాందాడు గాయాలతోనే అర్ధరాత్రి తన తమ్ముడి ఇంటికి చేరుకుని విషయాన్ని తెలిపాడు. తనపై భార్య చేపించిన హత్యాయత్నంపై బాచుపల్లి పీఎస్ లో బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఈ భార్యాభర్తలు బాచుపల్లి పీఎస్ పరిధిలోని రాజీవ్ గృహకల్పలో నివాసముంటున్నారు. అయితే హత్యాయత్నం జరిగిన ప్రదేశం దుండిగల్ పీఎస్ పరిధిలోకి వస్తుందని జీరో ఏఫ్ఐఆర్ చేసి దుండిగల్ కి కేసు ట్రాన్స్ ఫర్ చేశారు బాచుపల్లి పోలీసులు.
చంపుతుందేమోనని అన్నకు ఎప్పటినుంచో భయం..
బాధితుడు రాందాస్ తమ్ముడు మీడియాతో మాట్లాడుతూ.. ‘గత మూడు సంవత్సరాలుగా వారి మధ్య వివాదం నడుస్తోంది. గృహ హింస కేసు పెట్టింది. అమ్మా నాన్న కుటుంబం మొత్తం కేసు మీద తిరుగుతోంది. తనను ఏమైనా చేస్తుందేమోనని భయపడి ఇక్కడ ఉండటం లేదు. అయితే ఊళ్లో పంటలు ఎండిపోవడం, అక్కడ ఏమీ లేకపోవడంతో అమ్మానాన్న, సోదరుడు ఇక్కడికి వచ్చి నాతో పాటు ఉంటున్నారు. ఈ క్రమంలో వదిన వచ్చి నా భర్త నాకు కావాలి అన్నది. వీరు కలిసి ఉంటారేమోనని పెద్ద మనుషులు కూడా పంచాయతీలో చెప్పారు. శనివారం రాత్రి నాయుడు అనే వ్యక్తికి ఫోన్ చేసి మాట్లాడారు. గోపీ అనే వ్యక్తి బీర్ తాగుదామని నమ్మించి మా అన్నను తీసుకెళ్లాడు. తాను రానని, ఇదివరకే మద్యం సేవించి ఉన్నానని చెప్పినా బలవంతంగా బీర్ తాగించారు. బోరంపేటకు వెళ్లే రోడ్డుకు తీసుకెళ్లిన తరువాత మరో ఇద్దరు వ్యక్తులు వచ్చి బీర్ సీసాలతో మా అన్నపై దాడి చేశారు. భార్యభర్తలు ఇద్దరూ ఒకటే చోట ఉన్నారని అనుకున్నాం. అర్ధరాత్రి రక్తంతో ఇంటికి వచ్చాడు. 100కు డయల్ చేసి చెప్పాం. పోలీసులకు ఫోన్ చేస్తే ఉదయం ఫిర్యాదు చేయాలన్నారు. బాచుపల్లి పీఎస్ కు వెళ్లి ఫిర్యాదు చేస్తే దుండిగల్ కు కేసు బదిలీ చేశారు. జ్యోతి అనే వ్యక్తి అడ్రస్ వివరాలు ఇచ్చినా చర్యలు తీసుకోలేదని’ వాపోయాడు.






















