Andhra Pradesh Highway: ఏపీలో కొత్తగా 20 జాతీయరహదారులు... కేంద్రానికి ప్రతిపాదనలు పంపిన రాష్ట్ర ప్రభుత్వం... ఆ రహదారులివే!
ఏపీలో కొత్తగా మరో 20 జాతీయ రహదారులు రూపుదిద్దుకోనున్నాయి. రద్దీ దృష్ట్యా రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.
ఏపీలో కొత్తగా మరో 20 జాతీయ రహదారులు రానున్నాయి. రాష్ట్ర రహదారులు జాతీయ రహదారులుగా మారనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. రాష్ట్రంలో ఉన్న 20 రాష్ట్ర రహదారులు జాతీయ రహదారులుగా గుర్తించాలని ప్రభుత్వం కోరింది. అత్యంత రద్దీగా ఉన్న రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తితో ఇటీవల ఏడు రహదారులను జాతీయ రహదారులుగా కేంద్రం ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం 485.65 కి.మీ. రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించింది. అయితే తాజాగా మరో 20 రాష్ట్ర రహదారులను కూడా జాతీయ రహదారులుగా గుర్తించాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది.
Also Read: YSR Death Anniversary: వైఎస్ కేబినేట్ మంత్రులకు విజయమ్మ ఆహ్వానం!... పిలుపుపై రాజకీయవర్గాల్లో చర్చ
కేంద్రం సుముఖత
ఈ విషయంపై వైసీపీ ఎంపీలు దిల్లీలో కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ ఉన్నతాధికారులతో చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర పంపిన ప్రతిపాదనలలో 688. కి.మీ. మేర 11 రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ఉత్తర్వులు ఇంకా వెలువడాల్సి ఉంది. మరో 9 రహదారులపైనా కేంద్రం సానుకూలం ఉన్నట్లు తెలుస్తోంది. 889.06 కి.మీ. మేర మరో 9 రహదారులను జాతీయ రహదారులుగా ప్రకటించే అంశాన్ని పరిశీలిస్తుంది. దీనిపై కూడా త్వరలో అధికారికంగా నిర్ణయం వెలువడాల్సిఉంది.
ప్రతిపాదించిన మార్గాలు
- నరసాపురం నుంచి రాజోలు- 23 కి.మీ
- భీమవరం నుంచి తాడేపల్లిగూడెం-35 కి.మీ
- బేస్తవానిపేట నుంచి ఒంగోలు-107 కి.మీ
- మల్కనగిరి నుంచి సబ్బవరం-251 కి.మీ
- పట్చూరు నుంచి కోలార్-31కి.మీ
- ఎన్ హెచ్ 67 వద్ద ఆంజనేయస్వామి జంక్షన్ నుంచి కర్ణాటక సరిహద్దు వరకు - 3 కి.మీ
- పలాస నుంచి ఒడిశాలోని పద్మాపూర్ వరకు- 23 కి.మీ
- చేలూరు నుంచి తనకల్ వరకు-12.77 కి.మీ
- పెనుకొండ నుంచి పావగడ వరకు-26.92కి.మీ
- తుముకూరు నుంచి వేపరాళ్ల-39.81కి.మీ
- గుత్తి నుంచి కౌతలం-135 కి.మీ
Also Read: Teenmar Mallanna: తీన్మార్ మల్లన్న చరిత్ర అలాంటిది.. మాజీ ఉద్యోగుల సంచలన ఆరోపణలు