Covid 19 India Cases: దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా ఉద్ధృతి.. కొత్తగా 45 వేల కేసులు, 460 మరణాలు
గత కొన్ని రోజుల నుంచి పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. కేరళ రాష్ట్రం నుంచే 70 నుంచి 80 శాతం పాజిటివ్ కేసులు వస్తున్నాయి. రికవరీ రేటు మాత్రం 97 శాతానికి పైగా ఉందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.
ఇండియా కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టినట్లే కనిపించినా... గత కొన్ని రోజుల నుంచి పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 45,083 మంది కరోనా బారిన పడ్డారు. అదే సమయంలో మరో 460 మంది కరోనా మహమ్మారితో పోరాడుతూ చనిపోయారు. రికవరీ రేటు మాత్రం 97 శాతానికి పైగా ఉందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.
నిన్న ఒక్కరోజులో 35,840 మంది కొవిడ్19 బారి నుంచి కోలుకుని ఆరోగ్యంగా డిశ్ఛార్జ్ అయ్యారు. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసులు 3,68,558 (3 లక్షల 68 వేల 558) ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ తాజా హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. నేటి ఉదయం వరకు కరోనా రికవరీ రేటు 97.53 శాతానికి చేరినట్లు పేర్కొన్నారు. తాజా కేసులలో ఒక్క కేరళ రాష్ట్రం నుంచే 70 నుంచి 75 శాతం పాజిటివ్ కేసులు వస్తున్నాయి.
Also Read: Covid-19 Vaccine: 3 రకాల కోవిడ్ వ్యాక్సిన్లను 5 సార్లు తీసుకున్నాడు, చివరికి ఏమైందంటే..
COVID19 | India reports 45,083 new cases, 460 deaths and 35,840 recoveries in the last 24 hours; active caseload 3,68,558
— ANI (@ANI) August 29, 2021
Recovery Rate currently at 97.53% pic.twitter.com/4rPH44bS1f
దేశంలో మొత్తం 45 వేల కరోనా కేసులు రాగా, అందులో కేరళలో గడిచిన 24 గంటల్లో 31,265 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 153 కరోనా మరణాలు ఈ ఒక్క రాష్ట్రంలోనే నమోదు కావడం ఆందోళనకు గురి చేస్తోంది. కేరళ మోడల్ ఏంటి, అసలు అక్కడ ఏం జరుగుతుందంటూ నెటిజన్లు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగానే జరుగుతోంది.
Of 45,083 new COVID19 cases and 460 deaths reported in India in the last 24 hours, #Kerala recorded 31,265 COVID positive cases and 153 deaths yesterday.
— ANI (@ANI) August 29, 2021
Also Read: Himalayan Salt: హిమాలయన్ సాల్ట్ అంటే ఏమిటీ..? ఇది ఆరోగ్యానికి మంచిదేనా?