అన్వేషించండి

Brazil Man Covid-19 Vaccine: 3 రకాల కోవిడ్ వ్యాక్సిన్లను 5 సార్లు తీసుకున్నాడు, చివరికి ఏమైందంటే..

మనం ఫస్ట్ డోస్ టీకా తీసుకోడానికే అవస్థలు పడుతున్నాం. అలాంటిది ఆ వ్యక్తి పదివారాల్లో మూడు రకాల డోసులను ఐదుసార్లు తీసుకున్నాడు.

కోవిడ్-19 వ్యాక్సిన్‌లను రెండు డోసులు మాత్రమే వేస్తారనే సంగతి తెలిసిందే. ఫస్ట్ డోసులో వేయించుకున్న వ్యాక్సిన్‌నే సెకండ్ డోసులో కూడా వేయించుకోవాలి. కనీసం నెల నుంచి రెండు నెలల గ్యాప్ ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే, మనం ఒక్క డోసు వేయించుకోడానికే ఎన్నో అవస్థలు పడుతున్నాం. 45 లోపు వయస్సు వాళ్లకు ఇంకా ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ కూడా పూర్తి కాలేదు. కానీ, ఓ వ్యక్తి మాత్రం మూడు రకాల కోవిడ్ వ్యాక్సిన్‌ను 5 డోసులు తీసుకున్నాడు. కేవలం 10 వారాల వ్యవధిలోనే అన్ని డోసులు వేయించుకున్నాడు. మరి, ఇంతకీ అతడి బతికే ఉన్నాడా? అతడి పరిస్థితి ఎలా ఉంది? 

కోవిడ్-19 వ్యాక్సిన్ వైరస్‌ను నివారించదు. కేవలం దాన్ని అడ్డుకొనే రోగ నిరోధక శక్తిని మాత్రమే పెంపొందిస్తుందనే సంగతి తెలిసిందే. అయితే, ఈ వ్యాక్సిన్‌లను ఇష్టానుసారంగా తీసుకోకూడదు. ప్రభుత్వం వెల్లడించిన మార్గదర్శకాల ప్రకారమే తీసుకోవాలి. వేర్వేరు కంపెనీల వ్యాక్సిన్లను తీసుకున్నా లేదా.. వెంట వెంటనే రెండు డోసులను తీసుకున్నా.. కొత్త సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 

అయితే, బ్రెజిల్‌‌లోని రియో డి జనీరో ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి వ్యాక్సిన్లు తీసుకోవడమే పనిగా పెట్టుకున్నాడు. కోవిడ్ వ్యాక్సిన్ మొదలైన రోజు నుంచి ఇప్పటివరకు అతడు వివిధ రకాల కోవిడ్ వ్యాక్సిన్లను 5 సార్లు తీసుకున్నాడు. ఈ ఏడాది మే 12న ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్నాడు. జూన్ 5న అస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను రెండో డోసుగా తీసుకున్నాడు. జూన్ 17న కరోనావ్యాక్ సెకండ్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నాడు. జులై 19న మరోసారి ఫైజర్ వ్యాక్సిన్‌ను రెండో డోసుగా, జులై 21న కరోనావ్యాక్ వ్యాక్సిన్‌ను మొదటి డోసుగా తీసుకున్నాడు. 

అధికారులు ఈ వ్యక్తి పేరు బయటకు వెల్లడించలేదు. అయితే, అతడి అన్ని రకాల వ్యాక్సిన్లను అన్నిసార్లు ఎలా తీసుకున్నాడో తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియలో సాంకేతిక లోపాల వల్లే అతడు గందరగోళానికి గురై.. వరుసగా వ్యాక్సిన్లు తీసుకున్నాడా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. చిత్రం ఏమిటంటే.. అతడు అన్ని సార్లు వ్యాక్సిన్ తీసుకోడానికి వచ్చినా వైద్య సిబ్బంది గుర్తించలేదు. పైగా సిస్టమ్‌లో అతడి పేరు నమోదు చేసినా.. అతడు గతంలో వ్యాక్సిన్లు తీసుకున్నాడనే సమాచారం కూడా చూపించడం లేదు. దీంతో అతడు ఎప్పుడు ఎక్కడ వ్యాక్సిన శిబిరం పెట్టినా.. అక్కడికి వెళ్లి పొడిపించుకుంటున్నాడు. 

Also Read: ఈ స్కూల్‌లో ముగ్గురే విద్యార్థులు.. వీరికి చదువు చెబితే రూ.57 లక్షలు జీతం, ఎక్కడో తెలుసా?

ఇన్ని సార్లు వ్యాక్సిన్ తీసుకున్నా.. అతడు ఇంకా ఆరోగ్యంగానే ఉన్నాడు. కొన్ని రోజులు హాస్పిటల్‌లో అబ్జర్వేషన్ కోసం ఉంచారు. పదే పదే వెళ్లి వ్యాక్సిన్ తీసుకోవద్దని వైద్యులు అతడికి సూచించారు. అయితే, ఇండియాలో ఉన్నట్లే బ్రెజిల్‌లో కూడా వ్యాక్సిన్లకు కొరత ఉంది. ఇంకా చాలామందికి ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ పూర్తి కాలేదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఒకే వ్యక్తికి అన్నిసార్లు వ్యాక్సిన్ తీసుకొనే అవకాశం ఎలా దొరికిందా అనేది మిస్టరీగా మారింది. అయితే, మీరు మాత్రం ఎప్పుడూ అలా చేయకండి. ప్రభుత్వం, వైద్యులు సూచించిన మార్గదర్శకాల ప్రకారమే వ్యాక్సిన్ తీసుకోండి. 

Also Read: హిమాలయన్ సాల్ట్ అంటే ఏమిటీ..? ఇది ఆరోగ్యానికి మంచిదేనా?

Also Read: వేడి నీళ్లు vs చన్నీళ్లు.. ఏ నీటితో స్నానం చేస్తే ఆరోగ్యం?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

School Children Cold Weather Condition | చలికి ఇబ్బంది చిన్నారులకు ఆపన్న హస్తాలు | ABP Desamట్రాన్స్ జెండర్స్ ఆన్ డ్యూటీ, నేటి నుంచే హైదరాబాద్ రోడ్లపై..సహనం కోల్పోయిన సీపీ, తిట్టేసి క్షమాపణలు!Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
TG HighCourt: హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Instagram Reach Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
Anantapur Crime News: స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
Embed widget