అన్వేషించండి
Advertisement
Yadagirigutta: గ్రిల్స్ మధ్య ఇరుక్కున్న బాలుని తల - చాకచక్యంగా బయటకు తీసిన భక్తులు, యాదాద్రి ఆలయంలో ఘటన
Yadadri News: యాదగిరిగుట్ట క్యూలైన్‌లో ఓ బాలునికి ప్రమాదం తప్పింది. స్వామి దర్శనం కోసం వేచి చూస్తుండగా బాలుని తల గ్రిల్స్ మధ్యలో ఇరుక్కుపోయింది. తోటి భక్తులు బాలున్ని రక్షించారు.
Boy Head Stucked In Que Line Grills In Yadagirigutta: యాదగిరిగుట్టపై (Yadagirigutta) ఓ బాలునికి ప్రమాదం తప్పింది. స్వామి దర్శనం కోసం క్యూలైన్‌లో వేచి చూస్తుండగా బాలుని తల గ్రిల్స్ మధ్యలో ఇరుక్కుపోయింది. గమనించిన తోటి భక్తులు బాలున్ని రక్షించారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ బోడుప్పల్‌కు చెందిన ఓ కుటుంబం ఆదివారం ఉదయం స్వామి వారి దర్శనం కోసం రూ.150 టికెట్ ప్రవేశ క్యూలైన్‌లో వేచి ఉన్నారు. ఈ క్రమంలో దయాకర్ అనే బాలుడి తల గ్రిల్స్ మధ్యలో ఇరుక్కుపోయింది. దీంతో బాలుడి కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే గమనించిన తోటి భక్తులు బాలుడి తలను జాగ్రత్తగా బయటకు తీశారు. బాలుడికి ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
ప్రపంచం
కర్నూలు
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion