News
News
X

Daily Horoscope Today 19 June 2022: ఈ రాశివారు ఆర్థికంగా మరింత బలపడతారు, మీరున్నారా ఇందులో!

Horoscope 19th June 2022:ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి

FOLLOW US: 
Share:

2022 జూన్ 19 ఆదివారం రాశిఫలాలు

మేషం
సూర్యుడు ద్వితీయ స్థానం, చంద్రుడు పదకొండో స్థానంలో ఉన్నందున కొత్తగా తలపెట్టిన పనులు సక్సెస్ ఫుల్ గా పూర్తవుతాయి. కొత్త నిర్మాణాలు కలిసొస్తాయి. శుక్ర సంచారం కూడా మీకు అనుకూలంగా ఉంది. అన్ని రంగాలవారికి శుభసమయం. ఎల్లో, రెడ్ మీకు కలిసొచ్చే రంగులు.

వృషభం
బృహస్పతి పదకొండో స్థానం, చంద్రుడు పదో స్థానంలో అనుకూలంగా ఉన్నందున వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ఉద్యోగం బాగా సాగుతుంది. రాజకీయాల్లో ఉన్నవారికి మంచి టైమ్. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఆరోగ్యం విషయంలో మాత్రం నిర్లక్ష్యం వద్దు. కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు.  ఆరెంజ్, గ్రీన్ మీకు కలిసొచ్చే రంగులు.

మిథునం
ఈ రాశికి చెందిన నాయకులకు రాజకీయాల్ల పురోగతి ఉంటుంది. శని, శుక్రసంచారం ఉద్యోగులకు లాభిస్తుంది. ఎప్పటి నుంచో చేతికి అందాల్సిన మొత్తం అందుతుంది. వ్యాపారం బాగాసాగుతుంది. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు. అమ్మా-నాన్న దీవెనలు మీపై ఉంటాయి. ఆరెంజ్, స్కై బ్లూ శుభప్రదమైన రంగులు.

Also Read: ఏడు వారాల నగలు వేసుకోవడం వెనుక ఆంతర్యం ఏంటి... ఏ రోజు ఏ రాళ్లు ధరిస్తారు..!

కర్కాటకం
బృహస్పతి సంచారం మీకు అనుకూలంగా ఉండడంతో అదృష్టం కలిసొస్తుంది. వ్యాపారులకు లాభాలుంటాయి, కొత్త ప్రాజెక్టులు మొదలెట్టేందుకు అనుకూల సమయం. ఉద్యోగులకు బాగానే ఉంటుంది. భవిష్యత్ కోసం ప్రణాళికలు వేసుకునేందుకు ఇదే సరైన సమయం. తల్లిదండ్రుల కొసం సమయం వెచ్చించేందుకు ప్లాన్ చేసుకోండి. వైట్, ఎల్లో రంగులు మీకు శుభప్రదం.

సింహం
ఉద్యోగులకు పని ఒత్తిడి తగ్గుతుంది. కార్యాలయంలో పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. వృత్తి, వ్యాపారాలు బాగా సాగుతాయి. వాహనం కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఆరెంజ్, వైట్ మీకు కలిసొచ్చే రంగులు.

కన్య
ఆరో స్థానంలో ఉన్న చంద్రుడు, రాశి అధిపతి బుధుడు వల్ల బ్యాంకింగ్, మీడియా రంగంలో ఉన్న ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. శని ఆరో స్థానంలోకి రావడం వల్ల రాజకీయాల్లో ఉన్నవారికి కూడా బావుంటుంది. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం బావుంటుంది. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. స్కై బ్లూ , వైలెట్ మీకు కలిసొచ్చే రంగులు.

తులా
ఈ రోజు ఉద్యోగులకు ఒత్తిడి పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ , మీడియా వారికి అనుకూల సమయం. కుటుంబంతో సమయం గడుపుతారు. తల్లిదండ్రుల ఆశీస్సులు మీపై ఉంటాయి. వాహనం కొనుగోలు గురించి ఆలోచిస్తారు. వైలెట్, వైట్ మీకు కలిసొచ్చే రంగులు.

Also Read: తెల్లవారుజాము వచ్చే కలలు నిజమవుతాయా? దీనిపై పురాణాలు.. సైన్స్ ఏం చెబుతున్నాయి? 

వృశ్చికం
చంద్రుడు శుభస్థానంలో సంచరించడం వల్ల సాంకేతిక, బ్యాంకింగ్ రంగాల వారికి బాగా కలిసొస్తుంది. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు సక్సెస్ అవుతారు.   ఉత్సాహంగా పనిచేస్తారు. గ్రీన్, వైట్ మీకు కలిసొచ్చే రంగులు.

ధనస్సు
తృతీయ చంద్రుడు, గురుగ్రహం ప్రభావం మీకు చాలా లాభదాయకంగా ఉంది. శని తృతీయ సంచారం కూడా అనుకూలంగా ఉంది. వ్యాపారం, ఉద్యోగంలో విజయం సిద్ధిస్తుంది. అదృష్టం కలిసొస్తుంది. స్నేహితులతో సంతోష సమయం గడుపుతారు.. స్నేహితుల సూచనలు పరిగణలోకి తీసుకోండి. ఆహారం, ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు. వైట్, వైలెట్ మీకు శుభప్రదమైన రంగులు.

మకరం
చంద్రుడి సంచారం మకరరాశివారికి ఆర్థికంగా కలిసొస్తుంది. ఉద్యోగులకు కార్యాలయంలో అనుకూల వాతావరణం ఉంటుంది. అమ్మవారి ఆలయానికి వెళ్లి రావడం వల్ల ప్రశాంతత లభిస్తుంది. గృహ నిర్మాణంలో  ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. స్థిరాస్తి వృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తారు. గ్రీన్, వైట్ మీకు కలిసొచ్చే రంగులు. 

కుంభం
ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఇంటా-బయటా గౌరవం దక్కుతుంది. కార్యాలయంలో పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి.పనిలో సహోద్యోగుల నుంచి సహకారం అందుతుంది. ఆర్థికంగా మరింత బలపడతారు. 
గ్రీన్ మీకు కలిసొచ్చే రంగు.

మీనం
శని, బృహస్పతి సంచారం ఉద్యోగులు, వ్యాపారులకు కలిసొస్తుంది. పన్నెండో ఇంట ఉన్న చంద్రుడి వల్లి పిల్లల ఆరోగ్యం మెరుగుపడుతుంది. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. విదేశాలకు వెళ్లాలనుకున్న విద్యార్థులు ఇప్పటి నుంచీ ప్రయత్నాలు మొదలుపెట్టండి. ఆరెంజ్, ఎల్లో మీకు కలిసొచ్చే రంగులు.

Also Read: నిద్రలేవగానే ఎవర్ని చూడాలంటే…!

Published at : 19 Jun 2022 05:40 AM (IST) Tags: Horoscope Today 2022 Aries Cancer Leo Libra Scorpio Rasi Phalalu Today 19th June 2022 Aaj ka Rashifal 19 June 2022 Taurus Gemini Virgo

సంబంధిత కథనాలు

Weekly Horoscope (03-09 April): ఈ రాశులవారు ఈ వారం ఏ విషయంలోనూ తొందరపడొద్దు, ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్త!

Weekly Horoscope (03-09 April): ఈ రాశులవారు ఈ వారం ఏ విషయంలోనూ తొందరపడొద్దు, ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్త!

వారఫలాలు ( ఏప్రిల్ 03 నుంచి 09 ): ఈ వారం ఈ రాశులవారికి అదృష్టం కలిసొస్తుంది, ఆశించిన పురోగతి సాధిస్తారు

వారఫలాలు ( ఏప్రిల్ 03 నుంచి 09 ): ఈ వారం ఈ రాశులవారికి అదృష్టం కలిసొస్తుంది, ఆశించిన పురోగతి సాధిస్తారు

ఏప్రిల్ 2 రాశిఫలాలు, ఈ రాశివారు ఈ రోజు తీసుకునే నిర్ణయం భవిష్యత్ లో ప్రయోజనకరంగా ఉంటుంది

ఏప్రిల్ 2 రాశిఫలాలు, ఈ రాశివారు ఈ రోజు తీసుకునే నిర్ణయం భవిష్యత్ లో ప్రయోజనకరంగా ఉంటుంది

Tirumala Vasanthotsavam : ఏప్రిల్ 3 నుంచి తిరుమలలో శ్రీవారి వసంతోత్సవాలు, పలు సేవల రద్దు!

Tirumala Vasanthotsavam : ఏప్రిల్ 3 నుంచి తిరుమలలో శ్రీవారి వసంతోత్సవాలు, పలు సేవల రద్దు!

Astrology: మీది ఈ రాశుల్లో ఒకటా- ఇక మీ కష్టాలు తీరినట్టే

Astrology: మీది ఈ రాశుల్లో ఒకటా- ఇక మీ కష్టాలు తీరినట్టే

టాప్ స్టోరీస్

Nara Lokesh: చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు, గుడ్‌మార్నింగ్ ధర్మవరం అబద్ధం - ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేష్

Nara Lokesh: చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు, గుడ్‌మార్నింగ్ ధర్మవరం అబద్ధం - ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేష్

SRH Vs RR: టాస్ రైజర్స్‌దే - బౌలింగ్‌కు మొగ్గు చూపిన భువీ!

SRH Vs RR: టాస్ రైజర్స్‌దే - బౌలింగ్‌కు మొగ్గు చూపిన భువీ!

KTR On Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి - కేంద్రానికి TS మంత్రి కేటీఆర్ లేఖ

KTR On Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి - కేంద్రానికి TS మంత్రి కేటీఆర్ లేఖ

MLA Durgam Chinnaiah: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వార్నింగ్! మావోయిస్టుల లేఖ కలకలం

MLA Durgam Chinnaiah: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వార్నింగ్! మావోయిస్టుల లేఖ కలకలం