అన్వేషించండి
Chitti Muthyalu restaurant : 'చిట్టి ముత్యాలు' ఓపెనింగులో 'దిల్' రాజు సందడి - రొమాన్స్ విత్ రైస్ అట
ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్, దర్శకులు హరీష్ శంకర్, అనిల్ రావిపూడి చేతుల మీదుగా ఓ రెస్టారెంట్ మొదలు అయ్యింది. (Image Courtesy : Kuchipudi Venkat)

'చిట్టి ముత్యాలు' ఓపెనింగులో 'దిల్' రాజు సందడి
1/6

ఉలవచారు, రాజుగారి తోట, కూచిపూడి పలావ్, రాజుగారి కోడి పలావ్, మారేడుమిల్లి... విజయవంతమైన రెస్టారెంట్లు ఎన్నో సినీ దర్శకుడు కూచిపూడి వెంకట్ స్టార్ట్ చేశారు. భోజన ప్రియులకు ఆయన మంచి వంటకాలు అందిస్తున్నారు. (Image Courtesy : Kuchipudi Venkat)
2/6

ఫుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ అనిపించుకున్న కూచిపూడి వెంకట్ తాజాగా 'చిట్టి ముత్యాలు' పేరుతో మరో రెస్టారెంట్ స్టార్ట్ చేశారు. స్వతహాగా దర్శకుడు కావడంతో ఈ రెస్టారెంటుకు 'రొమాన్స్ విత్ రైస్' అని ట్యాగ్ లైన్ పెట్టారు. (Image Courtesy : Kuchipudi Venkat)
3/6

'చిట్టి ముత్యాలు'ను హైటెక్ సిటీ సమీపంలోని మాదాపూర్, అయ్యప్ప సొసైటీలోని ఇమేజ్ గార్డెన్స్ లో ఏర్పాటు చేశారు. ప్రముఖ నిర్మాతలు 'దిల్' రాజు, టీజీ విశ్వ ప్రసాద్, దర్శకులు హరీష్ శంకర్, అనిల్ రావిపూడి చేతుల మీదుగా ఈ రెస్టారెంట్ ప్రారంభించారు. (Image Courtesy : Kuchipudi Venkat)
4/6

రెస్టారెంట్ రిబ్బన్ దిల్ రాజు కట్ చేయగా... హరీష్ శంకర్ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనిల్ రావిపూడి 'మెను కార్డు' లాంచ్ చేయగా... విశ్వప్రసాద్ క్యాష్ కౌంటర్ ఓపెన్ చేశారు. తమ ఆహ్వానాన్ని మన్నించి తమ చేతుల మీదుగా 'చిట్టి ముత్యాలు' ప్రారంభించిన ప్రమఖులకు కూచిపూడి వెంకట్ కృతజ్ఞతలు తెలిపారు. (Image Courtesy : Kuchipudi Venkat)
5/6

హరీష్ శంకర్ తో కూచిపూడి వెంకట్ (Image Courtesy : Kuchipudi Venkat)
6/6

కొన్నాళ్ల క్రితం రామ్ గోపాల్ వర్మ చేతుల మీదుగా 'తెలుగు పబ్' ప్రారంభించారు కూచిపూడి వెంకట్. అప్పటి దృశ్యం ఇది. (Image Courtesy : Kuchipudi Venkat)
Published at : 17 Nov 2023 02:59 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ఆంధ్రప్రదేశ్
ఇండియా
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion